Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Sunday, 27 June 2021

Guidelines for the implementation of YSR Bima Scheme.

Guidelines for the implementation of YSR Bima Scheme.

 LFB&IMS Department - “YSR BIMA ” (Social Security Scheme) for Providing Rs.1.00 lakh Natural Death relief directly from Government and Rs.5.00 lakh Accidental Death / Permanent Disability relief through Group Insurance Scheme to the Primary Bread Earners of BPL Families – Orders - Issued.

వైఎస్‌ఆర్‌ బీమా అమలు బాధ్యత సచివాలయాలకు!

ఈనాడు, ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైఎస్‌ఆర్‌ బీమా పథకానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలు, విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇకపై ఈ పథకానికి కార్మికశాఖ నోడల్‌ ఏజెన్సీగా, గ్రామ, వార్డు సచివాలయాలు అమలు ఏజెన్సీగా పని చేస్తాయి. ఈ మేరకు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబంలో ప్రధానంగా సంపాదించే వ్యక్తి 18-50 ఏళ్ల మధ్య ఉన్నవారు సహజ మరణం పొందితే ఆ కుటుంబంలోని నామినీకి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రూ.లక్ష పరిహారం చెల్లిస్తుంది. అదే 18-70 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ మృతి చెందినా, శాశ్వత వైకల్యానికి గురైనా బీమా కంపెనీ ద్వారా రూ.5 లక్షల పరిహారం అందేలా చేస్తుంది.

ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. మరణం సంభవించిన 15 రోజుల్లోగా క్లెయిమ్‌లు పరిష్కరించాలి. జులై ఒకటి నుంచి ఈ నూతన విధివిధానాలు అమల్లోకి వస్తాయి. ఇందుకు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి రీ సర్వే చేసి లబ్ధిదారుల వివరాల్ని నమోదు చేస్తారు. సచివాలయాలన్నింటినీ వైఎస్‌ఆర్‌ బీమా ఫెసిలిటేషన్‌ కేంద్రాలుగా నోటిఫై చేశారు.

బీమా మిత్రల భవితవ్యమేంటి?

వైఎస్‌ఆర్‌ బీమా పథకం అమలు గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించడంతో ప్రస్తుతం ఆ బాధ్యతలను చూస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) పరిధిలోని బీమా మిత్రల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,350 మంది బీమా మిత్రలు ఉన్నారు. వీరు మృతుల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తూ లబ్ధిదారులకు బీమా సాయం అందేలా చూస్తున్నారు. ఒక్కో క్లెయింకు రూ.1000 ఇన్సెంటివ్‌గా ప్రభుత్వం చెల్లిస్తోంది. తాజాగా ఆదివారం విడుదల చేసిన జీవోలో ఆ బాధ్యతల నుంచి సెర్ప్‌ను తొలగించింది. సచివాలయాలు బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహించేంత వరకు సహకారం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జూన్‌ వివరాలను అప్‌లోడ్‌ చేసేందుకు వీరికి లాగిన్‌ అవకాశం కల్పించలేదు. కొత్త విధానం అమల్లోకి వస్తే తమ పరిస్థితి ఏంటని బీమా మిత్రలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సెర్ప్‌ అధికారులూ స్పష్టత ఇవ్వడం లేదు. సెర్ప్‌ సీఈవో రాజబాబును వివరణ కోరగా బీమా మిత్రల కొనసాగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.



★ జులై1,2021 నుండి మార్పులతో అమలుకానున్న YSR బీమా మార్గదర్శకాలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 

 నూతన మార్గదర్శకాల ప్రకారం  సహజ మరణానికి సంబంధించి చెల్లించే లక్ష రూపాయల బీమా మొత్తం ప్రభుత్వమే ప్రత్యక్షంగా చెల్లిస్తుంది.

★ ప్రమాద మరణానికి & శాశ్వత అంగవైకల్యానికి చెల్లించే 5లక్షల బీమా ఇన్సూరెన్స్ సంస్థలు చెల్లిస్తాయి.

Download.. Guidelines Here

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top