Search This Blog

Wednesday, 9 June 2021

Eastren Power APEPDCLApp - "Self Meter Reading" option enabled for Domestic consumers. విద్యుత్తుబిల్లు...కష్టాలకు చెల్లు. -

 The Eastern Power app is simple, fast, intuitive and easy to use.

The power is now in your hands! 

The Eastern Power app is simple, fast, intuitive and easy to use. Install this app, signup with your mail id, register using your 16 digit service number for paying electricity bills. Once you register and login, you stay connected with us for a seamless service experience.

You can: 

View & pay your electricity bills from your mobile

Get Bill reminders

Get the power supply position of your area

Analyse your consumption pattern over the last 12 months

Get payment history of the last 10 transactions

Register complaints through your mobile 

Get updates on your complaint & new service application status 

Give feedback to help us improve the services


విద్యుత్తుబిల్లు...కష్టాలకు చెల్లు

వినియోగదారులకు అందుబాటులోకి నూతన విధానం

యాప్‌ ద్వారా రీడింగ్‌ తీస్తూ...

న్యూస్‌టుడే, మండపేట : నెలవారీ విద్యుత్తు వినియోగం వేళ మీటరు రీడింగ్‌ తీసే వ్యక్తి ఒక్కరోజు ఆలస్యమైనా ఆందోళన పెరిగిపోతుంటుంది. వేసవి వేళ మరీను. ఫ్యాన్లు, ఏసీల వినియోగంతో ఈసారి బిల్లు ఎంత వస్తుందో... అని కంగారు పడుతుంటాం. ఈపీడీసీఎల్‌ అందుబాటులోకి తెచ్చిన నూతన విధానంతో ఇకపై అలాంటి అనవసర ఆందోళనలు అక్కర్లే. ఎంచక్కా మీ మీటరు రీడింగ్‌ మీరే సకాలంలో తీసి పంపితే ఈ-బిల్లు మీ కళ్లముందు ప్రత్యక్షమవుతుంది.


విద్యుత్తు మీటర్లు ఇంటి బయట ఏర్పాటు చేసినప్పటికీ కొన్నిచోట్ల గేటు తీసుకుని లోపలకు వెళ్లవలసిన పరిస్థితి.

ఇలాంటి ఇళ్లవారు ఏదైనా ప్రయాణం పెట్టుకున్నా రీడింగ్‌ బోయ్‌ వచ్చిన తరువాత వెళ్లడం లేదా పక్కింటి వారికి తాళాలు ఇవ్వడం చేస్తున్నారు. విధి నిర్వహణలో రీడింగ్‌ బాయ్‌లు సైతం కొవిడ్‌ బారిన పడుతున్నారు. ఈ పరిస్థితులకు చెక్‌ పెట్టేందుకు వినియోగదారులు ఎవరికి వారే సకాలంలో విద్యుత్తు బిల్లు రీడింగ్‌ తీసి పంపించేందుకు వీలుగా తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ 'ఈస్ట్రన్‌ పవర్‌ యాప్‌' అందుబాటులోకి తెచ్చింది.యాప్‌లో ఈ సేవల ప్రయోగాత్మక పరిశీలనకు గాను సంస్థ ఉద్యోగులకు ప్రస్తుతం అవకాశమిచ్చారు. జిల్లాలో 65 మంది సిబ్బంది వినియోగించుకున్నారు. సంస్థ సీఎండీ త్వరలో దీన్ని అధికారికంగా విడుదల చేయనున్నారు.


మూడురోజులు అటుఇటుగా వెసులుబాటు

ప్రస్తుతం ఈపీడీసీఎల్‌ తీసుకొచ్చిన ఈస్ట్రన్‌ పవర్‌ యాప్‌ ద్వారా గడువులోగా సకాలంలో ఎవరికివారు తమ ఇంటికి సంబంధించి స్వయంగా మీటరు రీడింగ్‌ తీసుకునే వెసులుబాటు ఉంది. గడువు తేదీకి మూడు రోజులు అటు లేదా ఇటుగా మీటరు రీడింగ్‌ యాప్‌ ద్వారా నమోదు చేస్తే సంబంధిత అధికారి తనిఖీ చేసిన అనంతరం ఈ బిల్లు జనరేట్‌ అయినట్లు సంక్షిప్త సందేశం పంపుతారు. దానిని బట్టి బిల్లు చెల్లించే వెసులుబాటు ఉంది.

అందరికీ అవగాహన కల్పిస్తాం

ప్రస్తుతం వినియోగదారులను రెండు విభాగాలుగా విభజించి మొదటి విభాగంలో 9వ తేదీ, రెండో విభాగంలో 19వ తేదీన రీడింగ్‌ తీస్తున్నారు. మొబైల్‌ యాప్‌ వినియోగించేవారు... మొదటి విభాగం వినియోగదారులైతే ప్రతినెలా 4వ తేదీ నుంచి 11వ తేదీలోగా, రెండో విభాగం వినియోగదారులైతే 14వ తేదీ నుంచి 21వ తేదీలోగా మీటరు రీడింగ్‌ తీయవచ్ఛు యాప్‌ వినియోగంపై ఎవరికైనా అర్థం కాకపోయినా అవగాహన కల్పిస్తాం. ప్రస్తుతం వినియోగదారులు మొబైల్‌ ద్వారా రీడింగ్‌ తీసి పంపిస్తే అది రికార్డులో నమోదవుతుంది. - గోలి తిరుమలరావు, ఏడీఈ, మండపేట

మొబైల్‌ యాప్‌ వినియోగం ఇలా...

గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఈస్ట్రన్‌ పవర్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. కొత్తవారైతే పేరు, చిరునామా, మొబైల్‌ నంబరు, మెయిల్‌ ఐడీ నంబరు నమోదు చేయాలి. ఐడీ, పాస్‌వర్డు ద్వారా లాగిన్‌ అవ్వాలి. 16 అంకెల విద్యుత్తు మీటరు సర్వీస్‌ నంబరు నమోదు చేసిన వెంటనే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్‌చేస్తే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. మీటరు ఐకాన్‌ రిజిస్టరు సర్వీసు నంబరుపై క్లిక్‌ చేసి కెమెరా ఐకాన్‌ ద్వారా మీటరు రీడింగ్‌ స్కాన్‌ చేయాలి. కేడబ్ల్యూహెచ్‌ రీడింగ్‌ నమోదు చేసి... సబ్‌మిట్‌ చేస్తే అధికారి నిర్ధారణ చేసిన తరువాత మొబైల్‌కు మెసేజ్‌ వస్తుంది. యాప్‌లో మీటరు రీడింగ్‌పై క్లిక్‌చేస్లే బకాయిలు ఉంటే వాటితో సహా జనరేట్‌ అయిన బిల్లు కనిపిస్తుంది.

యాప్‌ ద్వారా అందించే సేవల వివరాలు

Download..... Mobile App

0 Comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top