ఉద్యోగులకు... డీఏ చెల్లింపు ఎప్పుడంటే...
న్యూఢిల్లీ : రేపటి(జూలై 1) నుంచి డీఏ పెరగనుందని భావించిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. డీఏ పెంపును కేంద్రం వాయిదా వేసింది. ఉద్యోగులకు సెప్టెంబరు నుంచి డీఏ చెల్లింపులు ఉండవచ్చని సమాచారం. కేంద్ర ప్రభుత్వం మూడు వాయిదాలకు సంబంధించిన డీఏ బకాయిలను ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. కాగా... కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపుతో పాటు ఎరియర్స్ కూడా చెల్లించవచ్చని తెలుస్తోంది.
2020 జనవరి, 2020 జూలై, 2021 జనవరి లకు సంబంధించిన మూడు ఇన్స్టాల్మెంట్ల డీఏ బకాయిలర ఉద్యోగులకు అందాల్సి ఉంది. కరోనా నేపధ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో... ఉద్యోగులు, పింఛనుదారులు డీఏ కోసం మరికొంతకాలం ఎదురుచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
0 Comments:
Post a Comment