Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Monday, 14 June 2021

సీఎం సార్‌.. ఇదేం న్యాయం? ♦పాదయాత్ర హామీ మాకు.. ♦ఉద్యోగాలు డీఎస్సీ-2008 వాళ్లకేనా? ♦23 ఏళ్ల ఎదురుచూపులు మావి డీఎస్సీ-1998 అభ్యర్థుల ఆవేదన

సీఎం సార్‌.. ఇదేం న్యాయం?

♦పాదయాత్ర హామీ మాకు..

♦ఉద్యోగాలు డీఎస్సీ-2008 వాళ్లకేనా?

♦23 ఏళ్ల ఎదురుచూపులు మావి

♦కనీసం కలవడానికీ అవకాశమివ్వరు

♦వయోపరిమితి కూడా దాటిపోతోంది

♦ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలు

♦డీఎస్సీ-1998 అభ్యర్థుల ఆవేదన

⭕ఒకరిది 23 ఏళ్లనుంచి ఎడతెగని సమస్య! ఇంకొకరిది 13 ఏళ్లుగా విడివడని చిక్కుముడి! న్యాయచిక్కుల్లో భవిష్యత్త పడిపోయి.. అటు డీఎస్సీ-1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులూ, ఇటు డీఎస్సీ-2008 క్వాలిఫైడ్‌ అభ్యర్థులూ.. నలిగిపోతున్నారు. కాస్త ముందూవెనుక అయినా ఇద్దరికీ న్యాయం జరగాల్సిందే. అయితే, ‘వెనుక’ ఉన్నవారికి ఉద్యోగాలిచ్చి.. ‘ముందు’నుంచీ ఉన్నవారికి మాత్రం సర్కారు మొండిచెయ్యి చూపింది. పాదయాత్రలో హామీ ఇచ్చి.. ఇలా తమకు చెయ్యి ఇవ్వడంపై డీఎస్సీ-1998 క్వాలిఫైడ్‌  అభ్యర్థులు రగిలిపోతున్నారు.

🌻(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘‘అధికారంలోకి రాగానే తప్పకుండా న్యాయం చేస్తా. పరీక్ష ద్వారానే కదా మీరు రిక్రూట్‌ అయ్యింది. అర్హత, సర్వీస్‌ - ఈ రెండింటినీ పరిగణనలోనికి తీసుకుని వీలైనంత వరకు లాగిస్తాం. వెయిటేజి ఇచ్చి పరీక్ష పెట్టి గవర్నమెంట్‌లోనే లాగిద్దాం’’.. ఇది వైఎస్‌ జగన్‌ డీఎస్సీ- 1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ఇచ్చిన హామీ. తూర్పుగోదావరి జిల్లా తుని, విజయనగరం జిల్లా సాలూరు, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు.. ఇలా పాదయాత్రలో తనను కలిసిన ‘అభ్యర్థుల’కు పదేపదే ఇదే చెబుతూ వచ్చారు. కోరుకొన్నట్టు అధికారంలోకి వచ్చారుగానీ, డీఎస్సీ-1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థుల కోరికను మాత్రం మరిచారు. తాజాగా డీఎస్సీ-2008 క్వాలిఫైడ్‌ అభ్యర్థులను కాంట్రాక్టు ఉద్యోగుల్లో నియమించడంతో డీఎస్సీ-1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులు మరింతగా విస్మయానికి గురయ్యారు.

♦‘ఎన్నికల హామీ’ని మరోసారి తెరపైకి తెచ్చారు. ‘‘పాదయాత్రలో మాకు హమీ ఇచ్చి.. ఉద్యోగాలు మాత్రం డీఎస్సీ-2008 క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ఇవ్వడం ఏమిటి? న్యాయం చేయాలని కోరేందుకు గత రెండు సంవత్సరాల నుంచి అనేకసార్లు సీఎంని కలిసేందుకు ప్రయత్నం చేసినా అవకాశం కూడా ఇవ్వలేదు’’ అని డీఎస్సీ-1998 అభ్యర్థులు వాపోతున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యీలు, ఎమ్మెల్సీలను పలు మార్లు కలిసి తమ సమస్యను విన్నవించినా ప్రయోజనం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆలస్యం జరుగుతున్నాసరే త్వరలో సీఎం న్యాయం చేస్తారని ఎంతో అశతో ఎదురుచూశాం. కరోనా, వయోపరిమితి దాటి ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు సతమతమవుతున్నాయి. ఈ విషయాన్ని మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’’ అని కన్నీటిపర్యంతమవుతున్నారు. గత ప్రభుత్వం నియమించిన ఎమ్మెల్సీలకమిటీ సిఫారసును యథాతథంగా అమలుచేసి.. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. 

అసలేం జరిగిందంటే...

డీఎస్సీ-1998లో 36,125 ఎస్‌జీటీ (తెలుగు) పోస్టులను నోటిఫై చేశారు 1994లో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన జీవో 221 ఆధారంగా ప్రక్రియను చేపట్టడం వల్ల కేవలం 16 వేలపోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. దీంతో భారీగా ఖాళీలు మిగిలిపోయాయి. అభ్యర్థుల అభ్యర్థనల మేరకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మరో ఐదు గ్రేస్‌ మార్కులు (కటాఫ్‌) తగ్గించి జీవో618 జారీచేసింది. ఈసారి మరో ఐదువేలమంది ఈ పోస్టులకు ఎంపికయ్యారు. వీరి నియామకంపై అప్పట్లో వివాదం రేగింది. అయితే, ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ (స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌) వేసి వారి ఉద్యోగాలు పోకుండా కాపాడగలిగింది. ఆతర్వాత కూడా ఇంకా 15వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1:3 నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థులు వివిధ కేటగిరీల్లో లేరన్న కారణంగా 4534 మందికి మాత్రం అప్పట్లో ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంతలో రాష్ట్రంలో ప్రభుత్వం మారి 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చారు. డీఎస్సీ అంశంపై వైఎస్‌ ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారి ఐవీ సుబ్బారావు నేతృత్వంలో కమిటీని నియమించింది. గత ప్రభుత్వంలో అవకాశం దొరకని 4534 మందిలో 3300 మందికి ఉద్యోగఅర్హత ఉందని కమిటీ చేసిన సిఫారసుల మేరకు వారికి ఉద్యోగాలు ఇస్తామని వైఎస్‌ ప్రకటించారు. వైఎస్‌ తొలి విడత పాలనలో ఇందుకు మించి ప్రక్రియ ముందుకు వెళ్లలేదు.

♦రెండోసారి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ఆయన అకాల మరణం తర్వాత పూర్తిగా మరుగునపడిపోయింది. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాకే ఫైలు కదిలింది. పాఠశాల విద్యా కమిషనర్‌ కె.సంధ్యారాణి కన్వీనర్‌గా 2017లో అప్పటి ప్రభుత్వం కమిటీని నియమించింది. సాంకేతిక చిక్కులు ఉన్నప్పటికీ మానవతా కోణంలో 3300 మందికీ ఉద్యోగాలు ఇవ్వాలని కమిటీ 2018లో నివేదించింది. ఇంతలో 36 మంది మహిళలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని అధికారుల నుంచి మరో సమాచారం వచ్చింది. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇంతలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అలముకొంది. వైఎస్‌ జగన్‌ 2018లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో డీఎస్సీ-1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులు కలిసినప్పుడల్లా.. వరాలు ప్రకటించారు. అధికారంలో రాగానే ఉద్యోగాలిచ్చి న్యాయం చేస్తానని పదేదే హామీలు ఇచ్చారు. ప్రస్తుతం తమకు ఆ హామీలు మాత్రమే మిగిలాయని 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులు వాపోతున్నారు. వయోపరిమితి దాటిపోవడం, చనిపోవడం వంటి కారణాలతో 4534 మంది అభ్యర్థుల్లో మిగిలింది ప్రస్తుతం 2500 మంది మాత్రమేనని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top