Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Friday, 25 June 2021

10th ,Inter Exams News in Eenadu And Sakshi

 


📚✍పరీక్షలు రద్దు - పదో తరగతి.. ఇంటర్మీడియట్‌ కూడ

సుప్రీంకోర్టు చెప్పిన గడువులోగా పరీక్షల ప్రక్రియ సాధ్యం కాదు

అందుకే రద్దు నిర్ణయం

♦మార్కుల మదింపునకు హైపవర్‌ కమిటీ ఏర్పాటు

♦మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి

♦ఉత్కంఠకు తెర

🌻ఈనాడు, అమరావతి:

 రాష్ట్రంలో పది, ఇంటర్మీడియట్‌ పరీక్షలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో తాము సంతృప్తి చెందకపోతే పరీక్షలకు అనుమతించబోమంటూ సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పిన నేపథ్యంలో.. విజయవాడలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పరీక్షల ప్రక్రియ మొత్తాన్ని జులై 31లోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఇంత తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాలు ఇవ్వడం సాధ్యం కానందున రద్దు చేస్తున్నామని వెల్లడించారు. పరీక్షల ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు 40 రోజులు, పరీక్షల షెడ్యూలు ప్రకటనకు ముందు విద్యార్థులకు 15 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి నిర్ణయలోపం లేదని, అన్ని నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు ప్రయత్నించామని తెలిపారు. విద్యార్థులు నష్టపోవద్దనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇంటర్‌ ఫలితాల తర్వాతే గ్రాడ్యుయేషన్‌ ప్రవేశాలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించిందని, ఇతర బోర్డులు పరీక్షలను రద్దు చేసినందున రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరగదని భావిస్తున్నామని అన్నారు. ఫలితాల విడుదలపై విధివిధానాలు రూపొందించేందుకు హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మార్కుల మదింపు ఎలా చేయాలన్నదానిపై పది రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం సూచించినట్లు పేర్కొన్నారు.

మొదటి ఏడాది, ప్రాక్టికల్‌ మార్కుల ఆధారంగా..

రెండో ఏడాది విద్యార్థులకు మొదటి సంవత్సరం మార్కులు, ప్రాక్టికల్‌ మార్కులను ప్రామాణికంగా తీసుకుని మార్కులు కేటాయించే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్‌ పరీక్షలను మే 5 నుంచి నిర్వహించేందుకు మొదట ఇంటర్‌ విద్యామండలి షెడ్యూలు విడుదల చేసింది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగడంతో పరీక్షలను వాయిదా వేసింది. తర్వాత జులై మొదటివారంలో నిర్వహించాలని భావించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తాజాగా రద్దుచేశారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు 5,12,959 మంది ఉండగా.. ద్వితీయ సంవత్సరం వారు 5,19,510 మంది ఉన్నారు.

పదిలో గ్రేడ్లు..

పదో తరగతిలో విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వనున్నారు. మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తే ట్రిపుల్‌ఐటీ లాంటి సంస్థల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాల్సి అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు. గతేడాది పరీక్షలను రద్దు చేసినా, విద్యార్థులకు ఎలాంటి మార్కులు, గ్రేడ్లు ఇవ్వలేదు. ఉత్తీర్ణులైనట్లు మాత్రమే పేర్కొంటూ మార్కుల జాబితాను విడుదల చేశారు. పరీక్షలను జూన్‌ 7 నుంచి నిర్వహించేందుకు మొదట షెడ్యూలు ప్రకటించారు. 11 పేపర్లను ఏడుకు కుదించారు. కరోనా కారణంగా పరీక్షలను వాయిదా వేయగా.. ఇప్పుడు రద్దుచేశారు. ఈ ఏడాది 11,752 ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు 6,28,359 మంది ఉన్నారు. వీరిలో బాలురు 3,23,339 మంది, బాలికలు 3,05,020 మంది ఉన్నారు.

ఉత్కంఠ వీడింది..

పరీక్షలు ఉంటాయా? రద్దవుతాయా? అనేదానిపై దాదాపు ఒకటిన్నర నెలలుగా తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలా? లేదంటే పై తరగతుల సబ్జెక్టులు చదువుకోవాలో అర్థం కాక కొంత ఒత్తిడికి గురయ్యారు. పదో తరగతి విద్యార్థులు ఇంటర్‌లో చేరడంతో ఇప్పటికే జేఈఈ పాఠ్యాంశాలపై ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతున్నాయి. రోజువారీ పరీక్షలు ఒక పక్క, పది పరీక్షలు ఎప్పుడు ఉంటాయో అనే ఒత్తిడి మరో పక్క కొనసాగింది. ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది విద్యార్థులు ఎంసెట్‌, జేఈఈ లాంటి పోటీ పరీక్షలు, అకడమిక్‌ పరీక్షలకు రెండింటినీ సమన్వయం చేసుకోవడంలో కొంత ఒత్తిడికి గురయ్యారు.

📚ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షలు రద్దు
♦మార్కుల నిర్ణయానికి హైపవర్‌ కమిటీ నియామకం
♦విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌
🌻సాక్షి, అమరావతి: 

సుప్రీంకోర్టు నిర్దేశించిన జూలై 31 లోగా టెన్త్, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి సాధ్యం కాదని, అందుకని పరీక్షలను రద్దుచేస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. విజయవాడలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరీక్షలపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘పదిరోజుల్లో మార్కుల ఇవాల్యుయేషన్‌ స్కీమ్‌ను రూపొందించి జూలై 31లోగా ఫలితాలు ప్రకటించేలా గురువారం సుప్రీంకోర్టు ప్రకటించిన టైమ్‌ షెడ్యూల్‌లో రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల సాధ్యం కాదు. అన్ని రాష్ట్రాలకు కామన్‌గా ఇదే టైమ్‌ షెడ్యూల్‌ ఉంది. పైగా జూలై 31 తరువాత ఉన్నతవిద్య ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించేలా యూజీసీని కూడా న్యాయస్థానం ఆదేశించింది.

🌻ఈ తరుణంలో ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు, జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల అవకాశాలను మన విద్యార్థులు  నష్టపోరాదు. అందుకే రెండో ఆప్షన్‌గా పరీక్షల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నాం..’ అని మంత్రి వివరించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలతో పాటు టెన్త్‌ పరీక్షలను కూడా రద్దుచేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు మార్కులను నిర్ణయించడం సహా ఇతర అంశాలకు సంబంధించి ఏ విధానాలను అనుసరించాలో సూచనలు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని వేయనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వంలో ఎలాంటి సందిగ్ధత లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షల నిర్వహణే మొదటి ప్రాధాన్యమని, కానీ కోర్టు పేర్కొన్న టైమ్‌ షెడ్యూల్‌లో పరీక్షలు, ఫలితాల ప్రకటన సాధ్యంకాదు కనుకనే రెండో ఆప్షన్‌గా పరీక్షలను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. 

*హైపవర్‌ కమిటీ సూచనల మేరకు మార్కుల కేటాయింపు

‘మార్కులు ఎలా తీసుకోవాలన్న దానిపై సీబీఎస్‌ఈ సవివర గైడ్‌లైన్స్‌ ఇచ్చింది. ఎలా అసెస్‌మెంటు చేయాలి? ఏయే పరీక్షలను పరిగణనలోకి తీసుకోవాలి? అన్న అంశాలను అందులో పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర  కేవలం ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల మార్కులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఏవిధంగా అసెస్‌మెంటు చేయాలి? ఎలా మార్కులు తీసుకోవాలో ఆ కమిటీ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు.  

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top