Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Monday, 24 May 2021

దూసుకువస్తున్న పెనుగండం నేడు తుపానుగా మారనున్న వాయుగుండం రేపటికి అతి తీవ్రంగా మారే అవకాశం

The looming hurricane

The cyclone that is going to become a hurricane today

Likely to become the most serious tomorrow

దూసుకువస్తున్న పెనుగండం

 నేడు తుపానుగా మారనున్న వాయుగుండం

రేపటికి అతి తీవ్రంగా మారే అవకాశం

 అప్రమత్తమైన బలగాలు

 సకాలంలో ప్రజల్ని తరలించాలని ప్రధాని ఆదేశం

పరిస్థితిని ఎదుర్కొనేందుకు బెంగాల్‌, ఒడిశా సన్నద్ధత

దిల్లీ, ఈనాడు - విశాఖపట్నం

రాకాసి తుపాను దూసుకొస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం ఉదయం వాయుగుండంగా మారింది. సాయంత్రానికి ఇది పోర్ట్‌బ్లెయిర్‌కి ఉత్తర వాయువ్యదిశగా 590 కి.మీ, పారాదీప్‌కి దక్షిణ ఆగ్నేయంగా 570 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం అర్థరాత్రికి తీవ్ర వాయుగుండమై, సోమవారం మరింత బలపడి తుపానుగా మారనుందని, ఆ తర్వాత 24 గంటల్లో క్రమంగా అతి తీవ్ర తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు ప్రకటించారు. ఈ నెల 26 సాయంత్రానికి ఇది ఉత్తర ఒడిశాలోని పారాదీప్‌, పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీనికి ‘యస్‌’ అనే పేరును ఒమన్‌ దేశం సూచించింది. అక్కడి భాషలో దీనికి మల్లె పువ్వు అని అర్థం. వాయుగుండం కారణంగా ఇప్పటికే అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 25-27 మధ్య ఒడిశా, పశ్చిమబెంగాల్‌, సిక్కింలోని పలు జిల్లాల్లో ఈ స్థాయిలో వర్షాలు కురవనున్నాయి.

క్రమంగా పెరగనున్న గాలుల తీవ్రత

సోమవారానికి మధ్య బంగాళాఖాతంలో గంటకు 65 - 85 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 26 మధ్యాహ్నం నుంచి తుపాను తీరం దాటేదాకా గంటకు 90-110 కి.మీ వేగంతో, తీరం దాటేటప్పుడు 155-165 నుంచి 185 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. ఆయా తేదీల్లో మధ్య, ఉత్తర బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా, అసాధారణంగా మారుతుందని తెలిపారు. సోమవారం అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో అలలు 1-2 మీటర్ల వరకూ ఎగసిపడతాయన్నారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.

ఉన్నత స్థాయిలో సమీక్ష

పశ్చిమ తీరంలో తౌక్టే తుపాను విలయం ఇంకా మరిచిపోకముందే తూర్పు తీరంలో ‘యాస్‌’ తుపాను విరుచుకుపడనున్న నేపథ్యంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. ప్రజలను అప్రమత్తం చేయాలని, తీర ప్రాంతాల్లో ముప్పున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌-19 సోకి చికిత్స పొందుతున్న వారికి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంతవరకు విద్యుత్తు, సమాచార వ్యవస్థలు దెబ్బతినకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు.

సర్వసన్నద్ధంగా ఉందాం: ఎన్డీఆర్‌ఎఫ్‌

తుపానును ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉందామని ‘జాతీయ విపత్తు ఉపశమన దళం’ (ఎన్డీఆర్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ఎన్‌.ప్రధాన్‌ పశ్చిమబెంగాల్‌, ఒడిశా ప్రభుత్వాల అధికారులకు పిలుపునిచ్చారు. ఎలాంటి గడ్డు పరిస్థితినైనా ఎదుర్కొని ముందుగానే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాత్కాలిక అసౌకర్యమా, లేదా మరణమా అనేది అర్థం చేసుకుని ప్రజలు ఆయా ప్రాంతాల నుంచి ఖాళీ చేసేలా చూడాలన్నారు. ప్రమాద హెచ్చరిక స్థాయిని మించిన అప్రమత్తత అవసరమని ఆయనొక వార్తాసంస్థకు చెప్పారు. భారీ వృక్షాలు, స్తంభాలను తొలగించడానికి కావాల్సిన యంత్ర సామగ్రితో దళాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అత్యవసర సందర్భాల్లో రంగంలో దిగడానికి రాష్ట్రాల్లోని విపత్తు ఉపశమన దళాలు తగినంతగా అందుబాటులో ఉండడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒడిశాలో మాత్రం ప్రత్యేక దళాలు ఉన్నాయని, అక్కడి నమూనా బాగుందని కితాబిచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్‌లో 98% మందికి కరోనా టీకాలు అందాయని చెప్పారు.

ముఖ్యమంత్రుల సమీక్ష

వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కూడా తుపానుపై సమీక్ష నిర్వహించారు. ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలని తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు.

నౌకాదళం, కోస్ట్‌గార్డ్‌ సమాయత్తం

తుపానును ఎదుర్కొనేందుకు నౌకాదళం, తీరగస్తీ దళం (కోస్ట్‌గార్డ్‌) అప్రమత్తమయ్యాయి. నాలుగు యుద్ధ నౌకలు, 11 సరకు రవాణా విమానాలు, 25 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు నేవీ ప్రకటించింది. ఆదివారం కోల్‌కతా, పోర్ట్‌బ్లెయిర్‌లకు 334 ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలను, 21 టన్నుల సామగ్రిని భారత వాయుసేన చేరవేసింది. విశాఖలోని ఐఎన్‌ఎస్‌ డేగా, చెన్నైకి సమీపంలోని ఐఎన్‌ఎస్‌ రాజాలిపై విమానాలు సిద్ధంగా ఉన్నాయని... ఇవి తుపాను సమయంలో ఏరియల్‌ సర్వే చేసి సహాయక చర్యలు చేపడతాయని వివరించింది. తౌక్టే తుపాను అనుభవాల నేపథ్యంలో చమురు క్షేత్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

తుపాను హెచ్చరికలతో మరికొన్ని రైళ్ల రద్దు

ఈనాడు, హైదరాబాద్‌, రాజమహేంద్రవరం నగరం, న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో రైల్వేశాఖ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. 59 రైళ్లను శనివారం రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే మీదుగా ఇతర రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. ఈ రైళ్లను ఒక్కో రోజు పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. రద్దయిన తేదీలు 24-30 మధ్య ఉన్నాయి. ఈ నెల 24న హజ్రత్‌ నిజాముద్దీన్‌-సంత్రగచ్చి(02767), హౌరా-యశ్వంతపూర్‌ (02863), హౌరా-వాస్కోడిగామా(08047), 26న సంత్రగచ్చి-హజ్రత్‌ నిజాముద్దీన్‌(02768), 27న తిరువనంతపురం-షాలిమార్‌ (02641), హౌరా-తిరుచునాపల్లి(02663), చెన్నై సెంట్రల్‌-సంత్రగచ్చి(02808), వాస్కోడిగామా-హౌరా(08048), 27, 28 తేదీల్లో పాట్నా-యర్నాకులం(02644), 28న పురులియా-విల్లిపురం(06169), హౌరా-మైసూరు(08117), 29న కన్యాకుమారి-హౌరా(02666), తాంబ్రం-జసిదిహ్‌(02375), యశ్వంతపూర్‌-హౌరా(06597), హౌరా-యర్నాకులం(02877), 30న హౌరా-పుదుచ్చేరి(02867) రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top