Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Wednesday, 19 May 2021

Modified New Education policy in the State

NOTE : కేవలం మీడియా లో వస్తున్న వార్తలు ఆధారంగా మాత్రమే... అధికారకంగా కాదు....

Modified New Education policy in the State

👉New setup

  1) pre primary, LKG, UKG,1st, class, 2nd class, YSR ప్రాథమిక పాఠశాల.

2) 3వ తరగతి నుంచి 8 వ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.

3) 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు జిల్లా పరిషత్ జూనియర్ కాలేజి.

4) NO UP schools.

NEP-2020 ప్రతిపాదనలు AP లో పూర్తి స్థాయిలో అమలు జరిగితే New Staff Pattern ఈ క్రింది విధంగా వుండే అవకాశం ఉంది: 

1) Primary School: AW Teacher,SGT 

2) High School: SGT, SA/TGT , Gr-2 HM  

3) Junior College: SA/TGT, JL/PGT, Principal.

నాడు నేడు రివ్యూ లో అధికారులు ఏపీ సీఎం కు చేసిన ప్రతి పాదనలు

★ రాష్ట్రంలో 10 మంది పిల్లల కన్నా తక్కువగా ఉన్న స్కూళ్లు, అలాగే 30 మంది కన్నా పిల్లలు తక్కువగా ఉన్న స్కూళ్ల గురించి వివరణ.

★ కొన్నిచోట్ల పిల్లల సంఖ్య తక్కువ, టీచర్లు ఎక్కువ ఉన్న స్కూళ్లు గురించి వివరణ.

★ టీచర్ల సేవలను సమర్థవంతంగా వాడుకోవడానికి జాతీయ మార్గదర్శకాలు అనుసరించాలి.

★ స్కూళ్ల వారీగా అక్కడున్న విద్యార్థులు, టీచర్ల సంఖ్యను బట్టి మార్పులు.

★ పిల్లలు తక్కువుగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ పిల్లలను కలుపుకునేటట్లు చేయడం.

★ అంగన్‌వాడీ టీచర్లు, ప్రస్తుతం ఉన్న టీచర్లు వీరికి విద్యాబోధన చేస్తారు. 

★ అవకాశం ఉన్న చోట మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ కూడా హైస్కూల్‌ పరిధికి* తీసుకురావాలని ప్రతిపాదన.

★ అవసరమైన చోట అప్పర్‌ప్రైమరీ స్కూళ్లను హైస్కూళ్లగా* మారుస్తామని అధికారులు సీఎం కు ప్రతిపాదించారు.


ఏపీలో పాఠశాలల తీరుపై సీఎం జగన్ రివ్యూ చేశారు. పలు పాఠశాలల దుస్థితిపై సీరియస్ అయ్యారు. ఏపీ వ్యాప్తంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రారంభించిన నాడు-నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాభ్యాసంలో గట్టి పునాదులు వేయడం, ఎఫెక్టివ్‌ ఫౌండేషనల్‌ ఎడ్యుకేషన్‌ మార్గదర్శక ప్రణాళికపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశశారు. ఈ సందర్బంగా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అంగన్‌వాడీ ఉపాధ్యాయుల కోసం రూపొందించిన స్పోకెన్‌ ఇంగ్లీష్‌ పుస్తకం, సీడీలను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. అంగన్‌వాడీ అభివృద్ధి కమిటి శిక్షణ కోసం రూపొందించిన కరదీపిక నమూనాను అధికారులు సీఎంకు చూపించారు.

ముఖ్యంగా స్కూళ్లు మూతపడడంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. నాడు-నేడుతో స్కూళ్లు, అంగన్‌వాడీలు అభివృద్ధి అయ్యాయి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి స్కూల్‌ వినియోగంలో ఉండాలని.. కొత్తగా చేస్తున్న ప్రతిపాదనల వల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదన్నారు. శిక్షితుడైన టీచర్‌ పీపీ-1, పీపీ-2 పిల్లలకూ అందుబాటులో ఉండడం ఈ ప్రతిపాదనల్లో ఒక సానుకూల అంశమని అభిప్రాయపడ్డారు. అధికారులు మరోసారి కూర్చొని చర్చించి మరింత మంచి ఆలోచనలు చేయాలని కోరారు. ఈనెలలో మరోసారి దీనిపై సమీక్ష చేద్దామన్నారు జగన్.


రాష్ట్రంలో 10 మంది పిల్లల కన్నా తక్కువగా ఉన్న స్కూళ్లు, అలాగే 30 మంది కన్నా పిల్లలు తక్కువగా ఉన్న స్కూళ్ల గురించి అధికారులు సీఎంకు తెలిపారు. కొన్నిచోట్ల పిల్లల సంఖ్య తక్కువ, టీచర్లు ఎక్కువ ఉన్న స్కూళ్లు కూడా ఉన్నాయని తెలిపారు. స్కూళ్లను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, టీచర్ల సేవలను సమర్థవంతంగా వాడుకోవడానికి జాతీయ మార్గదర్శకాల ప్రకారం అధికారులు కొన్ని ప్రతిపాదనలు చేశారు. విద్యాభ్యాసంలో గట్టి పునాదులకోసం ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయని సీఎంకు వివరించారు.

స్కూళ్ల వారీగా అక్కడున్న విద్యార్థులు, టీచర్ల సంఖ్యను బట్టి మార్పులు చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. పిల్లలు తక్కువుగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ పిల్లలను కలుపుకునేట్టుగా చేస్తామన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ప్రస్తుతం ఉన్న టీచర్లు వీరికి విద్యాబోధన చేస్తారన్న అధికారులు.. దీనివల్ల శిక్షితులైన ఉపాధ్యాయులు వారికి ప్రాథమిక దశ నుంచే మంచి బోధన ఇవ్వగలరని, అలాగే స్కూళ్లు కూడా సమర్థవంతంగా వినియోగపడతాయన్నారు. అవకాశం ఉన్న చోట మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ కూడా హైస్కూల్‌ పరిధికి తీసుకురావాలని ప్రతిపాదనలు చేశారు.

ఆప్యాయతతో మన లక్ష్యాలను టీచర్లకు వివరించడం ద్వారా మంచి పని తీరు సాధించుకోగలమని.. అసహనం ఎప్పుడూ కూడా బయటకు రానివ్వకూడదు. మనం తీసుకుంటున్న విప్లవాత్మక మార్పుల్లో టీచర్ల పాత్ర కీలకమన్నారు. వారిని ఆప్యాయతతో దగ్గరకు తీసుకోండి... మంచి పనితీరు రాబట్టుకోండి అని అధికారులకు సూచించారు. స్కూళ్ళ నిర్వహణ, టీచర్లని వినియోగించడంలో జాతీయ ప్రమాణాలను పాటించాలి అని కోరారు. పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండాలన్నారు. పిల్లలకు 2 కీలోమీటర్ల దూరం లోపలే బడి స్కూళ్లు ఉండాల అన్నారు. ఇంతకన్నా ఎక్కువైతే పిల్లలకు భారం అవుతుందన్నారు.

రూపొందించిన పాఠ్యాంశాలను అంగన్‌వాడీ టీచర్లు పిల్లలకు బోధించగలగాలని సీఎం కోరారు. పెద్దవాళ్ల పిల్లల మాదిరిగా పేదవాడి పిల్లలు కూడా ఇంగ్లీషులో మంచి విద్యను అందుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాఠ్యప్రణాళిక పటిష్టంగా ఉండాలన్నారు. . నాడు - నేడు కింద బాగుచేసిన భవనాల నిర్వహణపై దృష్టిపెట్టాలని అధికారులను కోరారు. ఈ ఈ సమీక్షా సమావేశంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనూరాధ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top