Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Friday, 21 May 2021

Krishnapatnam: ఆయుర్వేద మందు.... తాజా సమాచారం

నా మందు ఆయుర్వేదమే.. ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తా: ఆనందయ్య

నా మందు ఆయుర్వేదమే...సీఎం గారు సానుకూలంగా ఉన్నారు..రిటైర్డ్ హెచ్ మాస్టర్ కోటయ్యకు మందు వేసి నాలుగు రోజులైందన్నారు. తన మందు వల్లే కోటయ్య ఇబ్బందిపడ్డారని చెప్పలేమన్నారు.తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని ఆనందర్య స్పష్టం చేశారు.

 ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తా: ఆనందయ్య


తన మందు ఆయుర్వేదమేనని ఆనందయ్య కుండబద్దలు కొట్టారు. ఆయుష్ అధికారుల ఎదుట మందు తయారు చేశానని, వారి మందుపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. రేపు ఐసీఎంఆర్, కేంద్ర ఆయుష్ బృందం రానుందని తెలిపారు. కరోనాకు విరుగుడుగా తాను అందిస్తున్న మందుపై ప్రభుత్వం, ప్రజలు మద్దతు ఇస్తుందని అన్నారు. తన మందుపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని ఆనందయ్య తెలిపారు. ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తానన్నారు. ప్రజలకు మేలు చేసేందుకే మందు తయారు చేశానని చెప్పారు. వేల మందికి మందు తయారు చేయాలంటే సమయం పడుతుందన్నారు.

రిటైర్డ్ హెచ్ మాస్టర్ కోటయ్యకు మందు వేసి నాలుగు రోజులైందన్నారు. తన మందు వల్లే కోటయ్య ఇబ్బందిపడ్డారని చెప్పలేమన్నారు.

ఇతర కారణాల వల్ల అనారోగ్యానికి గురై ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. తన మందు వల్లే ఆయన కోలుకున్నట్లు కోటయ్య కుటుంబ సభ్యులు చెప్పిన విషయాన్ని ఆనందయ్య గుర్తు చేశారు. తన మందును కొందరు అమ్మే ప్రయత్నం చేస్తున్నానని, అమ్మేవారిని కట్టడి చేయాలని కోరారు. త్వరలో అందరికీ మందు ఇస్తానని చెప్పారు. తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని ఆనందర్య స్పష్టం చేశారు.

కాగా, నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం లో ఆనందయ్య నాటు మందు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నాటు మందుతో కరోనా తగ్గిపోతుందని ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున ఆనందయ్య నాటు మందు కోసం ప్రజలు కృష్ణపట్నం చేరుకున్నారు. అయితే, ప్రజల తాకిడి ఎక్కువ కావడంతో రెండు రోజుల క్రితం మందు పంపిణీని నిలిపివేశారు. ఈ మందుకు ఎంతవరకు శాస్త్రీయత ఉన్నది అని తెలుసుకోవడానికి ఆయుష్ శాఖ, ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేయబోతున్నారు. ఇప్పటికే ఆయుష్ అధికారులు మందును పరిశీలించారు. ఐసీఎంఆర్ కూడా పరిశోధనలు చేయబోతున్నది. ఈ మందుకు శాస్త్రీయత ఉందని ఆయా శాఖలు దృవీకరిస్తే మందు పంపిణీకి అనుమతులు లభిస్తాయి.

Nellore: ఆనందయ్య మందు తయారీని పరిశీలించిన ఆయుష్ శాఖ.. ఏం చెప్పారంటే..

ఆనందయ్య ఆయుర్వేద మందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? లేదా? ఏపీ సర్కార్ నిర్ణయం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఐతే ఇది గంటల్లో తేలే వ్యవహారం కాదు. కొన్ని రోజులు పట్టే అవకాశముంది. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేస్తున్న ఆయుర్వేద మందుపై ఏపీ ఆయుష్ శాఖ పరిశీలన చేసింది. ఇవాళ ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు కృష్ణంపట్నానికి వెళ్లి ఆనందయ్య మందు తయారీ విధానాన్ని పరిశీలించారు. ఆయన ఏయే పదార్థాలు వాడుతున్నారు? ఎంత మోతాదులో వాడుతున్నారు. మందును ఎలా తయారు చేస్తున్నారో వీడియో తీశారు. ఓ రహస్య ప్రాంతంలో అధికారులకు ఆయన డెమో ఇచ్చారు. పూర్తిస్థాయిలో పరిశీలన అనంతరం అందులో ఎలాంటి హానికారక పదార్థాలు లేవని నిర్ధారించారు.

ఐతే అది కరోనాకు పనిచేస్తుందా? లేదా? తేల్చేందుకు మందులను ల్యాబ్‌కు పంపించారు.

''ఆయుష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య ఈ రోజు మందు తయారు చేశారు. మందు తయారీలో ఎటువంటి హానికర పదార్ధాలు లేవు.

ఆనందయ్య ఇచ్చేది ఆయుర్వేదం కాదు. ఆనందయ్య మందు నాటు మందుగానే పరిగణిస్తాం. కళ్ళలో వేసే మందులో కూడా సాధారణ పదార్ధాలే వాడుతున్నారు. మందు హానికరం కాదని మేం నిర్ణయానికి వచ్చాము. మందు రోగులపై పని చేస్తుందా లేదా అనేది విజయవాడ-తిరుపతి ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుంది. కేంద్ర ప్రభుత్వం సంస్థ CCRAS (సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్)కు ఈ డాక్టర్ల బృందం నివేదిక పంపుతుంది. అన్ని నివేదికలు వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రోగుల్లో ఆక్సిజన్ పెరిగినట్లు ప్రాథమికంగా సమాచారం ఉంది. పసరు వైద్యం పొందిన కొందరి ఆరోగ్యం పైనా డాక్టర్ల బృందం పరిశీలన ఉంటుంది.'' అని ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు.

ఆనందయ్య మందును ఎవరెవరు తీసుకున్నారు? ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వివరాలు సేకరించనుంది ఆయుష్ శాఖ. మందు తయారీ, రోగుల పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాత.. వారంలోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. అటు ఐసీఆఎంర్ బృందం కూడా మే 24న కృష్టపట్నం రానున్నారు. అక్కడ ఆనందయ్య కరోనా మందుపై అధ్యయనం చేస్తారు.

కృష్ణపట్నంలో శ్రీరామనవమి నుంచి ఆనందయ్య ఈ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు వేలాది మంది ప్రజలు తీసుకున్నారు. కరోనా రాని వారికి ఒక ముందు, ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వారికి మూడు రకాల మందును అందిస్తున్నారు. దాన్ని స్వీకరించిన వారిలో ఒకరిద్దరు మినహా పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. పైగా కరోనా రోగులకు రిపోర్టుల్లో నెగెటివ్ వచ్చిందని చెబుతున్నారు. అందుకే కృష్ణపట్నం ఆయుర్వేద మందు కోసం జనం ఎగపడుతున్నారు. పలువురు రాజకీయ నేతలు కూడా ఆయన మద్దతు తెలుపుతున్నారు. ఐతే మందుపై అధ్యయనం పూర్తయ్యే వరకు పంపిణీని నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మందును పంపిణీ చేయవద్దంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో కృష్ణపట్నం నిర్మానుష్యమైంది.

ఐతే ఇటీవల ఆనందయ్య వద్ద మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని తెలిసింది. కంటిలో మందు వేయడం వల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చిందని.. మళ్లీ ఆస్పత్రిలో చేరారని కథనాలు వచ్చాయి. ఐతే ఆయనకు పరిస్థితి నిలకడగానే ఉందని, నీరసనంగా ఉండడంతోనే మళ్లీ ఆస్పత్రికి వెళ్లినట్లు ఆయన కూతురు వెల్లడించారు. చికిత్స అనంతరం మళ్లీ ఇంటికి వెళ్లారు. ఇప్పడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. ఆయుష్ శాఖ, ఐసీఎంఆర్ రిపోర్టుల తర్వాతే మందు పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు

బ్లాక్‌ మార్కెట్‌లో 10 వేలకు ఆనందయ్య మందు.. కొనసాగుతున్న ఐసీఎంఆర్‌, ఆయుష్ అధ్యయనం

నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం బ్రేక్‌లు వేడయంతో.. కేటుగాళ్లు ఎంట్రీ ఇచ్చారు. సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు. ఈ మందుకు భారీగా డిమాండ్ ఉండటంతో బ్లాక్‌ మార్కెట్లో కేటుగాళ్లు దీని అమ్మకాలు మొదలుపెట్టేశారు. ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ 3 వేల నుంచి 10 వేల వరకు మందును విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఐసీఎంఆర్‌తో పాటు ఆయుష్ అధికారులతో ఈ మందుపై అధ్యయనం చేయిస్తున్న ప్రభుత్వం అనుమతులు వచ్చే వరకూ బ్రేక్ వేయాలని నిర్ణయించింది.శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటికే ఆయుష్‌ కమిషనర్‌ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతుండగా… ఒకట్రెండు రోజుల్లో ఐసీఎంఆర్‌ బృందం కూడా కృష్ణపట్నానికి రానుంది.

తాజాగా మంత్రి పేర్నినాని ఆనందయ్యను కలిసి తాజా పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. నాటు మందు తయారీ విధానంపైనా పేర్నినాని ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందిస్తామని ఆనందయ్యకు మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.


    నూట యాభై సంవత్సరాల క్రితం గ్రంథంలో ప్రస్తుతం #కృష్ణపట్నం #అనందయ్య గారు చేస్తున్న వైద్యం లిఖించబడి ఉన్నదికరోనాకు ఆనందయ్య మొత్తం ఐదు రకాల మందులను పంపిణీ చేస్తున్నారు. కరోనా రాకుండా రోగనిరోధక శక్తి పెంచడానికి ఒక మందు, పాజిటివ్‌ వచ్చిన వారికి నాలుగు రకాల మందులను ఇస్తున్నారు.

కరోనా రాకుండా ‘పీ’ రకం మందును, కోవిడ్‌ వచ్చిన వారికి పీ, ఎఫ్, ఎల్, కే రకాలను ఇస్తున్నారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయిన వారికి నాలుగు రకాలతో పాటు పసరు డ్రాప్స్‌ ఇస్తున్నారు.

1.పీ:

ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది. పాజిటివ్‌ వచ్చిన వారు రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు, పాజిటివ్‌ లేని వారు రోగనిరోధక శక్తి పెంచుకోవడం కోసం ఒక్క రోజు రెండు సార్లు వినియోగించాలి.

ఇందులో తెల్ల జిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవర్‌ దంగిలే ఐదు బకెట్లు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, తోక మిరియాలు, పచ్చ కర్పూరం, ఫిరంగి చెక్క పొడి అన్ని కలిపి ఒక బకెట్‌లో సిద్ధం చేసి మిక్సీ వేసిన తర్వాత అవసరమైనంత తేనె కలిపి నాలుగు గంటల పాటు ఉడికించి మిశ్రమంగా తయారు చేసి ఇస్తున్నారు.

2.ఎఫ్‌:

పాజిటివ్‌ ఉన్న వారికి ఇస్తున్నారు. ఇందులో పుప్పింటి ఆకు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్లు, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కేజీల వరకు సిద్ధం చేసి ఆన్నింటిని కలిపి మిక్సీ వేసి చూర్ణంగా ఇస్తున్నారు. ఇది రోజు భోజనం తర్వాత రెండు సార్లు చొప్పున మూడు రోజులు తీసుకోవాలి.

3.ఎల్‌:

ఇది కూడా పాజిటివ్‌ ఉన్న వారికే. ఇందులో నేల ఉసిరి, గుంట గలగర ఆకులు ఒక బకెట్, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనె రెండు మూడు కేజీలు తీసుకొని సిద్ధం చేస్తున్నారు. దీనిని ఫీ,ఎఫ్‌ రకాల మందుతో పాటు రోజుకు ఒక్కసారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి.

4. కే:

ఇది కూడా పాజిటివ్‌ ఉన్న వారికే. ఇందులో పెద్ద పల్లేరు కాయలు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కేజీల తీసుకుని కలిపి దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది పాజిటివ్‌ రోగులకు రోజుకు ఒక్క సారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి.

5 ఐ:

ఆక్సిజన్‌ తగ్గిన వారికి కంటి డ్రాప్స్‌. తేనె, ముళ్ల వంకాయ గుజ్జు, తోక మిరియాలను వినియోగిస్తారు. ఇందులో కిలో తేనె, వంద గ్రాముల తోక మిరియాలు, కొద్దిగా వంకాయ గుజ్జుతో సిద్ధం చేసి పల్స్‌ తీవ్రను బట్టి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క డ్రాప్‌ వేయాలి

కరోనాకు ఆయుర్వేద మందు ఇస్తున్న ఆనందయ్య అరెస్ట్.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

ఏపీలో ఇప్పుడు కరోనా కంటే ఎక్కువగా ఈ వైరస్‌కు ఆయుర్వేద మందు ఇస్తున్న నెల్లూరు జిల్లా ఆనందయ్య గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు కారణంగా కరోనా రోగులు త్వరగా కోలుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఏపీలోని పలు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కరోనా బాధితులు, ప్రజలు వేల సంఖ్యలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చేరుకుంటున్నారు. అయితే ఆనందయ్య ఇస్తున్న మందు గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో.. దీనిపై భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి.

ఏకంగా విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లడంతో.. ఆయన ఇస్తున్న మందుల కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనే అంశంపై ఐసీఎంఆర్ దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు.

దీంతో ఐసీఎంఆర్ బృందంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆయుష్ కమిషనర్ బృందం కృష్ణపట్నంకు చేరుకుని ఆయన ఇస్తున్న మందు తయారీ కోసం వాడుకున్న ముడిసరుకులను పరిశీలించింది. దీనిపై మరింత లోతైన పరిశీలిన కోసం రాష్ట్ర స్థాయి ల్యాబ్స్‌కు పంపాలని అధికారులు నిర్ణయించారు. దీంతో అప్పటివరకు ఈ మందు పంపిణీని ఆపాలని నిర్ణయించినట్టు నెల్లూరు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

మరోవైపు ఆయుర్వేద మందు ఇస్తున్న ఆనందయ్యను జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించడం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో భౌతిక దూరం పాటించలేదని ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఆనందయ్యను అరెస్ట్ చేశారా లేక ఆయనకు భద్రత కల్పించేందుకు తీసుకెళ్లారా ? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే ఆనందయ్యకు భద్రత కల్పించేందుకు ఆయనను అక్కడికి తీసుకెళ్లామని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఆనందయ్యను పోలీసులు అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

11ఆ ఆయుర్వేద మందు వాడటం వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్ ఉండవు..

సాక్షి, నెల్లూరు (కృష్ణపట్నం): కరోనా మహమ్మారికి విరుగుడుగా భావిస్తున్న ఆనందయ్య ఆయుర్వేద మందు వాడటం వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్ ఉండవని ఆయుష్‌ చేపట్టిన ప్రాధమిక విచారణలో తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. అయితే ఈ మందు తయారీ విధానంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను వారం రోజుల్లో ప్రభుత్వానికి అందజేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం అనుమతిచ్చాకే ఈ మందు పంపిణీ జరుగుతుందని, అంతవరకు ఎవ్వరూ దీన్ని వాడకూడదని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ మందుపై అధ్యయనానికి ఐసీఎంఆర్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందాన్ని పంపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు.

రంగంలోకి కేంద్ర సంస్ధలు

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనం జరిపేందుకు కేంద్ర సంస్థలు రంగంలోకి దిగనున్నాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్‌ సెంట్రల్ ఆయుష్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డీజీతో సంప్రదింపులు జరిపారు. దీంతో ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్ధ ప్రతినిధులు సోమవారం కృష్ణపట్నం వెళ్లి మందుపై శాస్త్రీయ అధ్యయనం ప్రారంభించనున్నారు. అధ్యయనం తర్వాతే మందు పంపిణీపై నిర్ణయం తీసుకోనున్నట్లు సింఘాల్‌ తెలిపారు.


 కృష్ణపట్నం ఆయుర్వేదం ఆనందయ్య  హౌస్ అరెస్ట్....

కృష్ణపట్నం లో అధికారులు ఆనందయ్య ని శుక్రవారం హౌస్ అరెస్టు చేశారు . ఆయన ప్రాణాలకి ముప్పు ఉందని భద్రత అధికారులు చెబుతున్నారు . కృష్ణపట్నం పరిసర ప్రాంత గ్రామాలలో ప్రస్తుతం భారీగా కరోనా పేషెంట్లు , జనం రాకతో గందరగోళ పరిస్థితి నెలకొంది . శాంతిభద్రతలు విఘాతం కలగకుండా కొద్ది రోజులు ఆయుర్వేదిక వైద్యులు ఆనందయ్య గ్రామంలో లేకుండా ఉంటే బాగుంటుంది అని , ఆయుర్వేదిక్ మందు ల్యాబ్ రిపోర్ట్ , అనుమతులు వచ్చేవరకూ ఆనందయ్యను గ్రామంలో ఉండకుండా తమ అదుపులోకి తీసుకునే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం . అంతేకాకుండా కార్పొరేట్ వైద్య రంగ వ్యవస్థ ద్వారా ఆనందయ్యకు ప్రమాదం పొంచి ఉందని ఆయనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు ..


 Note : ఈ వార్తని నెల్లూరు మరియు చిత్తూరు వాట్సాప్ న్యూస్ ల ఆధారం తో ఫార్వర్డ్ చేసినది , మరియు స్థానిక MLA కాకాణి గారు ఈ వార్తలు అపోహలు అని ఆయన అన్నట్టు గా వస్తున్న వార్త కూడా  వాట్సాప్ లలో తిరుగుతున్నది . ఏదేమైనా వాస్తవాలు బయటికి వచ్చే వరకు వేచి చూడవలసిన అవసరం ఉంది అని తెలియజేయుట మైనది.  

ఆయుర్వేద వైద్యంపై జగన్‌ కీలక నిర్ణయం

శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులకు సీఎం ఆదేశం

అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద ఔషధంపై సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఔషధంపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. కొవిడ్‌పై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల అధికారులతో పరీక్షలు చేయించాలని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ బృందాన్ని పంపాలని.. ఆయుర్వేద వైద్యంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని ఆయన స్పష్టం చేశారు.

నేటి నుంచి ఆయుర్వేద మందు పంపిణీ చేస్తారంటూ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం తరలి వచ్చారు.

దీంతో సుమారు 3కి.మీ మేరకు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో క్యూలైన్లలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీకి అధికారులు తొలుత అనుమతివ్వలేదు. అనంతరం గందరగోళ పరిస్థితుల్లో పంపిణీ ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నిలిపివేశారు. ఇవాళ్టికి ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో అక్కడికి వచ్చిన వారు నిరాశగా వెనుదిరిగారు.

నెల్లూరు జిల్లా ఆయుర్వేద మందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ మందు పంపిణీ చేయాలా? వద్దా? అనే అంశంపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ క్రమంలోనే ఆయుర్వేద మందు శాస్త్రీయత, పనిచేసే విధానంపై అధ్యయనం చేయించాలని సీఎం ఆదేశించారు.
Krishnapatnam: ఆయుర్వేద మందుకి వేలాదిగా వస్తున్న ప్రజలు.

కృష్ణపట్నం: కరోనాకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుకు డిమాండ్‌ పెరుగుతోంది. నేటి నుంచి ఈ మందు పంపిణీ చేస్తారంటూ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం తరలి వచ్చారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో క్యూలైన్లలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు ఇంత వరకు ఆనందయ్య మందు పంపిణీకి అధికారులు తొలుత అనుమతివ్వలేదు. అనంతరం గందరగోళ పరిస్థితుల్లో పంపిణీ ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నిలిపివేశారు. ఇవాళ్టికి ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో అక్కడికి వచ్చిన వారు నిరాశగా వెనుదిరిగారు.

పంపిణీ చేయాలా? వద్దా??

మరోవైపు ఈ అంశంపై సీఎం జగన్‌ సమీక్షించనున్నారు. ఆయుర్వేద ముందు పంపిణీ చేయాలా? వద్దా? అనే అంశంపై ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించనున్నారు. ఆ మందు శాస్త్రీయత, పనిచేసే విధానాన్ని సీఎం తెలుసుకోనున్నారు. ఇప్పటికే అధికారుల బృందం చేసిన పరిశీలన, నివేదికపై ఆయన చర్చించనున్నారు. అనంతరం పంపిణీపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ పంపిణీకి అధికారికంగా అనుమతిస్తే ప్రభుత్వపరంగా చేయాల్సిన ఏర్పాట్లపై జగన్‌ చర్చించి ఆదేశాలివ్వనున్నారు.

Covid medicine : నెల్లూరు GGH ఖాళీ చేసి ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు కోసం పరుగులు తీసిన పేషెంట్స్

Nellore GGH : నెల్లూరు GGH ఆస్పత్రిలో కరోనా రోగులు ఖాళీ చేసి ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం పరుగులు తీశారు. దీంతో కరోనా పేషెంట్స్ బెడ్లు హాస్పిటల్ లో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇవాళ్టి నుంచి మళ్లీ నెల్లూరుజిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం సుముఖం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు పంపిణీ ప్రాంతం వద్ద పరిస్థితి అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది. ప్రస్తుతం ఇక్కడ 5 వేల మందికి మందు తయారు చేశారు. అయితే, ఇక్కడ ఉన్న జనం 35 వేల మంది సుమారు ఉన్నారు. వీరిలో కరోనా పాజిటివ్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు. ఏకంగా రెండు వేల వరకూ అంబులెన్స్ లు బారులు తీరి వరుసగా ఉన్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణపట్నం వచ్చి ఇబ్బందులకు గురి అవుడం మంచిదికాదని… తొందరపడి రావొద్దని… రెండు రోజుల్లో రద్దీ తగ్గుతుందని.. దీనిని అందరూ గమనించాలని స్థానికులు టీవీ9 దృష్టికి తెచ్చారు.

ఇదిలాఉండగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తోన్న ఆయుర్వేద కరోనా మందు పంపిణీపై వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. "కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య కరోనా వ్యాధిని నియంత్రించడానికి, కరోనా సోకిన వారికి నయం చేయడానికి అందజేస్తున్న ఆయుర్వేద మందును, (21-05-2021, శుక్రవారం) నుండి పంపిణీ చేస్తున్నాం. ప్రకృతిపరంగా దొరికే సహజసిద్ధమైన వస్తువులతో, ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందుతో ఎటువంటి హానీ ఉండదు. కృష్ణపట్నంలో అందజేస్తున్న మందు వల్ల అనేకమంది కరోనా బారి నుండి బయటపడి, వారి ఆరోగ్యం కుదుటపడింది." అని కాకాణి పేర్కొన్నారు.

NELLORE: Krishnapatnam, a small and quiet village located close to Sea Coast and Krishnapatnam Port, is abuzz with activity for the last one month with hundreds of people thronging the habitation for locally made medicines for Covid-19 prevention and cure.

Though they are not aware of the composition of the medicines and their authenticity, distressed kin of hapless Covid patients have been rushing to the village for the medicine hoping that it will save the victim’s life.

A resident and self-made ayurveda doctor Bonigi Anandaiah is preparing the medicines and distributing them free of cost. He claims that he uses locally available leaves besides honey, pepper, green camphor, nutmeg (Jajikaya), black cumin, and cinnamon to produce the medicine.

A railway contractor with roots tracing to Mallam village near Naidupeta, and now living in Chennai, Duvvuru Rama Raghava Reddy said his village is almost free from the deadly virus after his relatives and friends distributed the medicine to the residents, including some Covid patients.

ఆనందయ్య ఉచిత ఆయుర్వేద వైద్యం కోవిడ్​వైరస్‌కు శరాఘాతమైంది. కోవిడ్ వ్యాపారులను గంగవెర్రులెత్తిస్తోంది. డ్రగ్​మాఫియాలో ప్రకంపనలు పుట్టిస్తోంది. కరోనా పాజిటివ్​వచ్చిన వాళ్లకు మందు తీసుకున్నాక రెండు రోజుల్లో నెగటివ్​రిపోర్టు వచ్చేస్తోంది. శ్వాస తీసుకోవడం కష్టమైన వాళ్లకు ఆక్సిజన్‌తో పనిలేకుండా పోతోంది. కరోనాతో ఏర్పడిన జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులన్నీ మటుమాయమవుతున్నాయి. సిటీ స్కాన్​లో చెస్ట్​సివేరిటీ 24/25 ఉన్నవాళ్లకు సైతం సాధారణ స్థితికి చేరుకుంటోంది. కరోనాకు ఉచిత మందు గురించి ఆనోటా ఈనోటా ఇరుగుపొరుగు రాష్ర్టాలకూ చేరింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం అనే ఓ గ్రామం నెటిజన్ల పుణ్యమా అని ప్రపంచ చిత్రపటంలో కెక్కింది.

కృష్ణాపట్నంలో యథావిధిగా 21/5/2021నుంచి కరోనాకు మందు పంపిణీకి : MLA కాకాణి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తోన్న ఆయుర్వేద కరోనా మందు పంపిణీపై వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. “కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య కరోనా వ్యాధిని నియంత్రించడానికి, కరోనా సోకిన వారికి నయం చేయడానికి అందజేస్తున్న ఆయుర్వేద మందును, రేపటి నుండి (21-05-2021, శుక్రవారం) నుండి పంపిణీ చేస్తున్నాం. ప్రకృతిపరంగా దొరికే సహజసిద్ధమైన వస్తువులతో, ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందుతో ఎటువంటి హానీ ఉండదు. కృష్ణపట్నంలో అందజేస్తున్న మందు వల్ల అనేకమంది కరోనా బారి నుండి బయటపడి, వారి ఆరోగ్యం కుదుటపడింది.” అని కాకాణి పేర్కొన్నారు.

అంతేకాదు, ఆనందయ్య అందిస్తున్న మందు పట్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పిన కాకాణి, కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి, తిరిగి ఆయుర్వేద మందును పంపిణీ చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. రేపటి నుండి అనగా తేది : 21-05- 2021, శుక్రవారం ఉదయం నుండి కరోనా సోకిన వారికి వేరుగా, కరోనా రాకుండా నియంత్రించడానికి వేరుగా భౌతిక దూరం పాటిస్తూ, మందు పంపిణీ చేపడుతున్నామని ఆయన వెల్లడించారు.


సంచలనం సృష్టించిన నెల్లూరుజిల్లా కృష్ణపట్నం ఆయుర్వేదమందు పంపిణీపై ఆ జిల్లా కలెక్టర్ లోకాయుక్తకు సమర్పించిన రిపోర్ట్...


పెను సంచలనం. ఒకప్రక్క కరోనా కు సరైన మందులు లేక రెమిడెసివిర్ లాంటి ఇంజెక్షన్లు, అత్యంత ప్రభావవంతమైన స్టెరాయిడ్స్ కూడా పనిచేయక అల్లోపతిలో అనేక వేల మంది అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం మరణిస్తుంటే...???

దీనికి సంబంధించి వైరల్ అవుతున్న పూర్తి వార్త మీకోసం 

నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణ పట్నం లో ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద మందు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా పెను సంచలనం సృష్టిస్తోంది.

కరోనా ఏ స్థాయిలో ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రావడం, CT SCAN లో చెస్ట్ సివియారిటీ స్కోర్ 24/25 ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే 0 కి రావడం, ఆక్సిజన్ అందక తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్న వారు కూడా ఒక్కరోజులో లేచి కూర్చోవడం పెను సంచలనం సృష్టిస్తోంది.

సోషల్ మీడియాలో గత మూడు రోజులుగా ఈ విషయం పెను దుమారం రేపడంతో కేరళ, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టి ఒక్కసారి గా కృష్ణపట్నం పైకి మళ్ళింది.

ఒక్క పైసా డబ్బు తీసుకోకుండా ఒక్కరోజు లోనే ఎంత తీవ్రమైన కేసైనా, తగ్గిపోవడం, ఎంత తీవ్రంగా కరోనా ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రావడం, కార్పొరేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులు కూడా రెండు రోజుల్లోనే తగ్గిపోవడం, ఇంత వరకు ఈ వైద్యం పై ఒక్క రిమార్క్ కూడా రాకపోవడంతో వేలాది మంది కృష్ణ పట్నానికి క్యూ కట్టడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.


ఏది ఏమైనప్పటికీ 25 లక్షలు ఖర్చు చేసిన ఏ మాత్రం గ్యారంటీ ఇవ్వని కార్పొరేట్ ఆసుపత్రులు కంటే ఒక్క పైసా తీసుకోకుండా రెండు రోజుల్లోనే నెగెటివ్ తెప్పిస్తామని భరోసా ఇస్తున్న ఆయుర్వేద వైద్యులు మనలాంటి సామాన్యులకు దేవుడితో సమానం అని అనడం అతిశయోక్తి కాదు.

సమాచార నిమిత్తము తెలియపరచడమైనది.

"కృష్ణపట్నంలో కరోనాకు మందు పంపిణీ పై కాకాణి స్పందన".

కృష్ణపట్నం గ్రామంలో బొణిగి ఆనందయ్య, తన మిత్రులతో కలిసి కరోనా నివారణకు మరియు కరోనా సోకిన వారికి ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారు.

బొణిగి ఆనందయ్య, తన మిత్రులతో అందిస్తున్న ఆయుర్వేద మందుకు సంబంధించి ఒక్క పైసా కూడా డబ్బులు తీసుకోకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో మందులు అందిస్తున్నారు.

ఆనందయ్య అందిస్తున్న మందు వల్ల వినియోగించిన వారిలో ఇప్పటివరకు సత్ఫలితాలు తప్ప, ఎక్కడా దుష్ప్రభావం చూపలేదు.

 ఆనందయ్య అందిస్తున్న మందు గురించి లోకాయుక్త, జిల్లా అధికారులను వివరణ కోరడం జరిగింది.

అధికారులు, ఆనందయ్య అందిస్తున్న మందు పట్ల ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయనప్పటికీ, లోకయుక్తకు నివేదిక అందించేందుకు, మందును పరిశీలించవలసిన అవసరం ఉందని చెప్పిన మీదట, మందు యొక్క ప్రభావం పరిశీలించుటకు గడువు కోరడమైనది.

 జిల్లా కలెక్టర్ గారు, ఆయుష్ మరియు ఇతర అధికారులతో సంప్రదించాం.

వీలైనంత త్వరలో, 24 గంటలలోపే మందు యొక్క ప్రభావంపై పరిశీలన పూర్తిచేయవలసినదిగా కోరాం.

 కరోనా నివారణలో భాగంగా, మందు పరిశీలన పూర్తయిన వెంటనే, ప్రజలెవ్వరికీ అసౌకర్యం కలగకుండా, భౌతిక దూరం పాటిస్తూ, ఆనందయ్య అందించే ఆయుర్వేద మందు పంపిణీకి త్వరలోనే చర్యలు చేపడుతాం.


ఆయుర్వేద మందు పంపిణీ ఆపేశాం
లోకాయుక్తకు నెల్లూరు కలెక్టర్‌ నివేదిక

నెల్లూరు, మే 18(ఆంధ్రజ్యోతి): కరోనాను తగ్గించే పేరుతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలో జరుగుతున్న ఆయుర్వేద మందు పంపిణీని నిలుపుదల చేశామని లోకాయుక్తకు కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు నివేదించారు. దీనిపై ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అయినా ఆ మందులో శాస్త్రీయతను పరీక్షించేందుకు ఆయర్వేద ల్యాబ్‌కు పంపామన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేవరకు మందు పంపిణీ చేయకూడదని ఆదేశించినట్లు తెలిపారు. కృష్ణపట్నంలో బి.ఆనందయ్య అనే వ్యక్తి కరోనా బాధితులకు నయం చేసేందుకు, వైరస్‌ రాకుండా అడ్డుకునేందుకు కొన్ని రోజుల నుంచి ఆయుర్వేద మందును తయారుచేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

ఈ మందు మంచి ఫలితాలను ఇస్తోందని ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున జనం రావడం మొదలుపెట్టారు. రోజుకు 5-6 వేలమందికి మందు పంపిణీ చేసేవారు. ఎటువంటి అనుమతుల్లేకుండా, అర్హత లేనివ్యక్తి ఆయుర్వేదం పేరుతో మందులు పంపిణీ చేస్తున్నారని కొందరు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై లోకాయుక్త ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, జిల్లా పంచాయతీ అధికారి, రెవెన్యూ డివిజన్‌ అధికారితో పాటు మరో ముగ్గురు ఆయుర్వేద వైద్యులను బృందంగా నియమించిన కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.

ఆ బృందం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టింది. ఆ మందు తీసుకున్న వారిలో ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు ఫిర్యాదులు రాలేదని, కానీ కంట్లో వేస్తోన్న మందువల్ల దీర్ఘకాలంలో ప్రమాదం ఏర్పడే అవకాశాలున్నట్లు గుర్తించారు. విచారణ బృందం తమ ప్రాథమిక నివేదికను కలెక్టర్‌కు అందించింది. దాని ఆధారంగా లోకాయుక్తకు, ఆయుష్‌ కమిషనర్‌కు ప్రత్యేక నివేదిక తయారు చేసి పంపారు. మందులో వాడుతున్న మూలికల వివరాలన్నింటినీ రాష్ట్ర ఆయుర్వేద ల్యాబ్‌కు పంపారు. అక్కడి నుంచి వచ్చే రిపోర్టుల ఆధారంగా పూర్తిస్థాయి నివేదికను అందజేస్తామని లోకాయుక్తకు కలెక్టర్‌ నివేదించారు.

అంతేకాదు, ఆనందయ్య అందిస్తున్న మందు పట్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పిన కాకాణి, కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి, తిరిగి ఆయుర్వేద మందును పంపిణీ చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుండి కరోనా సోకిన వారికి వేరుగా, కరోనా రాకుండా నియంత్రించడానికి వేరుగా భౌతిక దూరం పాటిస్తూ, మందు పంపిణీ చేపడుతున్నామని ఆయన నిన్న వెల్లడించారు.

0 Comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top