Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Tuesday, 25 May 2021

Edn Minister with unions -ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విద్యాశాఖ మంత్రి సురేష్ వీడియో కాన్ఫెరెన్స్...పరీక్షలు జరపాలని మెజారిటీ సంఘాల సూచన.... సంఘాల నాయకులు సూచించిన విషయాలు.... మంత్రి హామీల వివరాలు ..

పత్రికా ప్రకటన

************

మంచి మనసున్న ప్రభుత్వం మనది.

ఉపాధ్యాయుల సూచనలన్నీ పరిగణనలోకి తీసుకుంటాం.

ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి.

పరీక్షలు జరపాలని మెజారిటీ సంఘాల సూచన.

ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విద్యాశాఖ మంత్రి సురేష్ వీడియో కాన్ఫెరెన్స్.

ఉపాధ్యాయ సంఘాల నాయకులు సూచించిన ప్రతి సూచన పరిగణనలోకి తీసుకొని సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి సురేష్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సమావేశంలో అన్ని సంఘాల నాయకులు, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, పాఠశాల విద్య డైరెక్టర్ చిన్నవీరబధ్రుడు, ఎస్ పి డి వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు ఇటీవల కరోనతో మరణించిన ఉపాధ్యాయులకు సంతాపం తెలిపారు.

సంఘాల నాయకులు సూచించిన విషయాలు :

ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి.

వివిధ యాప్ ల ద్వారా ఉత్పన్నమవుతున్న సమస్యలు పరిష్కరించాలి.

కరోనతో మరణించిన ఉపాధ్యాయులకు ఎక్సగ్రెసియా ప్రకటించాలి.

బదిలీలు, ప్రమోషన్ లకు సంబంధించిన విషయాలు.

పదవతరగతి పరీక్షలు నిర్వహించాలని, నాడు నేడు పనుల తీరు, ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణ లను పలు సంఘాల నాయకులు ప్రశంశించారు.

మంత్రి సురేష్ మాట్లాడుతూ....

ఉపాధ్యాయులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు తెలుసుకునేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగానే వీడియో కాన్ఫెరెన్స్.

మీ సూచనలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం.

మంచి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీ సమస్యలన్నీ పరిస్కారమవుతాయి.

విద్యా ప్రమాణాలు మెరుగుకు చర్యలు. అందులో భాగంగా టీచర్ సెంటర్ ల ఏర్పాటు. ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో ఇఁదుకోసం యూనివర్సిటీ ఏర్పాటు.

పిల్లల భవిష్యత్తు తో పాటు ఉపాధ్యాయుల భద్రత కూడా మాకు ముఖ్యం. అందుకే అందరికీ వాక్సిన్ కోసం కేంద్ర మంత్రి దృష్టికి మీ తరపున నేను మాట్లాడాను.

ప్రభుత్వం చేపట్టిన సంస్కరణ లకు మీ సహకారం ఉండటం వల్లే విజయవంతంగా నిర్వహిస్తున్నాం.

ఇలాగే మీ సహకారం కావాలి, మీ ప్రతి విన్నపం ప్రభుత్వం పరిశీలిస్తుంది.

****************

శ్రీనివాస్, పి. ఆర్. ఓ టు ఎడ్యుకేషన్ మినిస్టర్.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top