Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Monday, 3 May 2021

Cricket : ఆ క్రికెటర్ ఇప్పుడు ఎమ్మెల్యే.. బెంగాల్ అసెంబ్లీకి పోటీ చేసి గెల్చిన టీమ్ ఇండియా క్రికెటర్

 Cricket : ఆ క్రికెటర్ ఇప్పుడు ఎమ్మెల్యే.. బెంగాల్ అసెంబ్లీకి పోటీ చేసి గెల్చిన టీమ్ ఇండియా క్రికెటర్

పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీకి జరిగిన ఎన్నికల (Elections) ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో టీమ్ ఇండియాకు (Team India) ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్ (Cricketer) గెలుపొందాడు. గతంలో టీమ్ ఇండియా తరపున ఆడిన మనోజ్ తివారి (Majoj Tiwary) ఈ ఏడాది ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్ లో చేరాడు. ఆయనకు బెంగాళ్‌లోని షిబ్‌పూర్ అసెంబ్లీ టికెట్‌ను టీఎంసీ అధినేత మమత బెనర్జీ కేటాయించారు. అప్పటి నుంచి విస్తృతంగా ప్రచారం చేసిన మనోజ్ తివారి ఎన్నికల వేళ బాగా కష్టపడ్డాడు. నిన్న వెలువడిన ఫలితాల్లో తన సమీప బీజేపీ అభ్యర్థి రథిన్ చక్రబర్తిపై మనోజ్ తివారి 6 వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందాడు. జనరల్ కేటగిరీకి చెందిన ఈ నియోజకవర్గంలో 2016లో ఏఐఎఫ్‌బీకి చెందిన అభ్యర్థి విజయం సాధించాడు.
అంతకు ముందు టీఎంసీకి చెందిన జతు లాహిరి గెలుపొందాడు. కానీ మమత బెనర్జీ అనూహ్యంగా ఈ సీటును క్రికెటర్ అయిన మనోజ్ తివారీకి కేటాయించింది. ఈ నియోజకవర్గంపై మమత కూడా పెద్దగా దృష్టి సారించలేదు. అయినా సరే తివారి తన స్వశక్తితో ఇక్కడ ప్రచారం చేసి గెలుపొందాడు.

1985 నవంబర్ 14న హౌరాలో జన్మించిన మనోజ్ తివారి చిన్నప్పటి నుంచే క్రికెట్ మీద దృష్టిపెట్టాడు. కుడి చేతి వాటం బ్యాట్స్‌మాన్, లెగ్ స్పిన్నర్‌గా కెరీర్ ప్రారంభించాడు. పవ్చిమ బెంగాల్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడిన మనోజ్.. జాతీయ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. మనోజ్ తివారి టీమ్ ఇండియా తరపున 2008లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేశాడు. 2012 టీ20 వరల్డ్ కప్ జట్టులో మనోజ్ తివారి సభ్యుడిగా ఉన్నాడు. తన కెరీర్‌లో 12 వన్డేలు, 2 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. వన్డేల్లో ఒక సెంచరీ, మరో అర్దసెంచరీ చేసిన మనోజ్ టీ20ల్లో మాత్రం విఫలం అయ్యాడు.

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున ఆడాడు. 2018 ఐపీఎల్ సీజన్ అతడికి చివరిది. పంజాబ్ జట్టు అతడిని 2018లో రూ.1 కోటికి కొనుక్కున్నది. 2018-19 సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్ తరపున అత్యధిక స్కోర్ రికార్డు మనోజ్ తివారి పేరిటే ఉన్నది. మనోజ్ తివారి 119 ఫస్ట్ క్లాస్, 163 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మనోజ్ తివారి ఒక ట్రిపుల్ సెంచరీ కూడా చేశాడు. తివారి చివరి సారిగా 2012 సెప్టెంబర్ 11న న్యూజీలాండ్ తరపున టీ10 మ్యాచ్ ఆడాడు. కాగా, తివారి ఇంత వరకు తన క్రికెట్ కెరీర్‌కు అధికారికంగా క్రికెట్ నుంచి రిటైర్ కాలేదు.



1 comment:

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top