కరోనాతో పాఠశాల హెడ్ మాస్టర్ నాయుడు వీర రాఘవేంద్రరావు మృతి
గుంటూరు: కరోనాతో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మృతి చెందాడు. వివరాలలోకి వెళితే... గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన నాయుడు వీర రాఘవేంద్రరావు (55) పెదకాకాని మండలం ఉప్పలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం కోవిడ్ బారిన పడిన ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు గత నెల 24వ తేదీన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రధానోపాధ్యాయుడు వీర రాఘవేంద్రరావు సోమవారం అర్థరాత్రి మృతి చెందారు.
ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడు వీర రాఘవేంద్రరావు మృతికి బంధువులు, ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.
0 Comments:
Post a Comment