కరోనా సృష్టిస్తున్న కల్లోలం మరో రెండు నిండు జీవితాలు బుడిదపాలు అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తన కొడుకు ఆదుకుంటాడని కలలు కన్న తల్లీ , జీవితంలో స్థిరపడిపోయామన్న కొడుకు కళలు వారం రోజుల్లోనే కల్లలయ్యాయి. కరోనా వచ్చిన కొడుకు మృతి చెందిన గంటలోనే మరోతల్లి గుండె ఆగిపోయింది.
నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని ఎర్రవల్లితండాకు చెందిన జైపాల్‌నాయక్ ప్రస్తుతం జూపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్‌కాలనీలో నివాసం ఉంటున్నారు.ఆయనకు భార్యతో పాటు ఇద్దరు సంతానం ఉన్నారు.
అయితే గత నెల 28న జైపాల్‌నాయక్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
దీంతో శనివారం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. చాలా మందిని కరోనా కరుణించి నుండి బయటపడుతున్నా...ఉపాధ్యాయుడిని మాత్రం కబళించింది. వైద్యుల చికిత్సకు కరోనా లోంగుబాటు కాలేదు..దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జైపాల్‌నాయక్ కన్నుమూశారు.
ఇక ఈ విషయం తెలుసుకున్న ఆయన తల్లి మునావత్ నాన్కు గుండె బరువెక్కింది..తనకు తల కొరివి పెట్టాల్సిన తనయుడు తన కళ్లముందే కళ్లు మూసిన విషయాన్ని ఆమె గుండే తట్టుకోలేకపోయింది. కొడుకు మరణవార్త విన్న కొంతసేపటికే తల్లి గుండె పోటుతో చనిపోయింది. ఈ సంఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
0 Comments:
Post a Comment