Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Saturday, 15 May 2021

Cyclone Tauktae: తీరంలో అలజడి.. భీకరంగా మారుతున్న తుఫాను.. బుసలు కొడుతున్న తౌక్తా

Cyclone Tauktae: తీరంలో అలజడి.. భీకరంగా మారుతున్న తుఫాను.. బుసలు కొడుతున్న తౌక్తా

Cyclone Tauktae: కరోనాతో దేశం అల్లాడిపోతుంటే.. దానికి తోడుగా తుఫాన్ రాబోతుంది. కేరళలోని కొచ్చి తీరానికి దగ్గరలో ఏర్పడ్డ తౌక్తా తుఫాను… ఇవాళ భీకర తుఫానుగా మారబోతోందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు మధ్యాహ్నంలోపు ఇది తీరం దాటే అవకాశముందని తెలిపింది. అరేబియా సముద్రంలో తీవ్ర తుపాను ఏర్పడబోతున్నట్లుగా వాతావరణ విభాగం హెచ్చరించింది. దేశంలోని పశ్చిమతీరం నుంచి తుఫాను ఉంటుందని అంచనా వేసింది. ఆగ్నేయ అరేబియా సముద్రంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడింది.

దీని ప్రభావం పశ్చిమాన ఉన్న కేరళ, గోవా, కర్ణాటక, మహారాష్ట్రపై ఎక్కువ ప్రభావం పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
అటు, అవసరమైతే అన్ని రకాలుగా సాయం అందిస్తామని ఇండియన్ నేవీ ప్రకటించింది. భారత నౌకాదళ నౌకలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డైవింగ్ టీమ్స్, విపత్తుల బృందాలు అన్నీ తుఫానును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి అని ఓ ట్వీట్‌లో నేవీ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం తుఫాను అరేబియా సముద్రంలో కొచ్చికి దగ్గరగా ఉండి… గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గుండ్రంగా తిరుగుతోంది. కేరళలోని కన్నూర్‌కి నైరుతీ దిశలో… 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం వాయవ్య దిశలో కదులుతున్న ఈ తుఫాను మే 18 ఉదయం నాటికి… గుజరాత్ తీరానికి దగ్గర్లో తీరం దాటవచ్చనే అంచనా ఉంది. అయితే.. దీని ప్రభావం డైరెక్టుగా కాకుండా… పరోక్షంగా తెలుగు రాష్ట్రాలపై పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఏపీలో ఉన్న మేఘాల వల్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

తుఫానుపై అప్రమత్తమైన భారత వాతావరణ శాఖ… అరేబియా సముద్రంలోకి ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. గతేడాది డిసెంబర్ 3న ఇలాగే ఓ బురేవీ తుఫాను… కేరళ ప్రాంతాల్లో తీరంలో అల్లకల్లోలం సృష్టించింది. మరోవైపు, ఈ సంవత్సరం నైరుతీ రుతుపవనాలు త్వరగా వచ్చే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మే 31 నాటికే కేరళను తాకవచ్చని పేర్కొంది. మామూలుగా అయితే… జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకుతాయి. అటు, దక్షిణ అండమాన్ తీరంలో చల్లటి గాలులు వస్తున్నాయి. మే 21 నుంచి అక్కడ వర్షాలు కురుస్తూ… ఆ గాలులు క్రమంగా పశ్చిమం వైపు వెళ్తూ… బంగాళాఖాతం నుంచి టర్న్ తీసుకుని కేరళవైపు వస్తాయని తెలిపింది.





ముంచుకొస్తున్న తౌక్టే

అరేబియా సముద్రంలో వాయుగుండం

175 కిలోమీటర్ల వేగంతో గాలులు

కేరళ అప్రమత్తం... రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్‌

ఈనాడు, అమరావతి, హైదరాబాద్‌, దిల్లీ:

 లక్షద్వీప్‌ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. ‘తౌక్టే’గా పేరు పెట్టిన ఈ  తుపాను ఆదివారం అత్యంత తీవ్రంగా మారుతుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.

ఈనెల 18న గుజరాత్‌ వద్ద తీరాన్ని దాటే అవకాశముందని తెలిపింది. ఈ క్రమంలో గంటకు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అప్రమత్తం చేసింది. ‘తౌక్టే’ కారణంగా కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. తుపాను ధాటికి ఇప్పటికే కొల్లాం జిల్లాలో అనేకచోట్ల చెట్లు నేలకూలాయి. వందల ఇళ్లు దెబ్బతిన్నాయి. కొండచరియలు ఎక్కువగా ఉన్న వయనాడ్‌, ఇడుక్కి జిల్లాల్లో ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు జాతీయ విపత్తు స్పందనా దళం అధికారులు తెలిపారు. తుపాను ప్రభావాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో 53 బృందాలను మోహరించినట్టు ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ఎన్‌.ప్రధాన్‌ తెలిపారు.

రాయలసీమకు భారీ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తాంధ్రలో, రాయలసీమలో ఈ రెండు రోజులు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. రాయలసీమలో అనేక చోట్ల భారీ వర్షాలకు అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఒకరోజు ముందుగానే కేరళకు రుతుపవనాలు!

ఈ ఏడాది ఒకరోజు ముందుగా... ఈనెల 31నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. రుతుపవనాలు మొట్టమొదట ఈనెల 22న దక్షిణ అండమాన్‌లోని సముద్ర ప్రాంతానికి చేరనున్నాయి. అనంతంరం వాయవ్య దిశగా ముందుకు కదులుతాయని ఐఎండీ పేర్కొంది. దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని అంచనా వేసింది.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top