WhatsApp New Feature: మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను పరిచయం చేసిన వాట్సాప్... మీరూ వాడుకోండి ఇలా
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల రూపొందించిన నూతన ప్రైవసీ పాలసీ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఫలితంగా, కొంత మంది యూజర్లు సిగ్నల్, టెలిగ్రామ్ వంటి యాప్స్‌కు మారుతున్నారు. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగిన వాట్సాప్ తమ యూజర్లు చేజారకుండా ఉండేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా, వాట్సాప్ కొత్త ఫీచర్‌ను రోల్ అవుట్ చేసింది. ఈ ఫీచర్ వాట్సాప్ చాట్ బాక్స్ రంగులను మార్చడానికి యూజర్లను అనుమతిస్తుంది. అంతేకాక, యూజర్లు తమ సందేశాలను ఇకపై కేవలం నలుపు రంగులోనే కాకుండా ముదురు నీలం ఆకుపచ్చ రంగులోనూ టైప్ చేసే ఫీచర్‌ను చేర్చింది. దీంతో, యూజర్లు అట్రాక్టివ్ రంగుల్లో వాట్సాప్‌ను మార్చుకోవచ్చు.
కాగా, ఈ ఫీచర్ ప్రస్తుతానికైతే, ఐఓఎస్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. తొలుత వాట్సాప్ వెర్షన్ 2.21.60.11లో రోల్ అవుట్ కానున్న ఈ ఫీచర్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇప్పటికి ఎటువంటి స్పష్టత లేదు.
వాయిస్ మెసేజెస్ స్పీడ్‌గా ప్లే చేయొచ్చు. ఇటీవలి కాలంలో వాట్సాప్ చాలా అట్రాక్టివ్ ఫీచర్లపై పని చేస్తోంది.
యూజర్ల సౌలభ్యం కొరకు వాయిస్ మెసేజెస్ ప్లేబ్యాక్ స్పీడ్‌ను అడ్జెస్ట్ చేసుకునే ఫీచర్‌పై కూడా పనిచేస్తోంది. ఈ ఫీచర్‌ను కూడా తొలుత iOS బీటా వర్షన్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్ యూజర్లు తమ వాయిస్ నోట్లను వేగంగా ప్లే చేయవచ్చు. ఇది మొత్తం 1x, 1.5x, 2x అనే మూడు- స్పీడ్ లెవెల్స్‌ను కలిగి ఉంటుంది. యూజర్‌కు వచ్చిన వాయిస్ మెసేజెస్ను వీటిలో ఏదో ఒక స్పీడ్‌తో ప్లే చేసుకునే అవకాశం లభిస్తుంది.
కాగా, వాట్సాప్ ఇటీవల చాట్ థ్రెడ్ ఫీచర్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు ఇకపై తమ సమస్యలను వాట్సాప్‌కు సులభంగా రిపోర్ట్ చేయవచ్చు. అంతేకాకుండా కేవలం 48 గంటల్లోనే సమస్యకు పరిష్కారాన్ని పొందవచ్చు. ప్రస్తుతానికి కొంతమంది బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను అతి త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లందరికీ పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ స్పష్టం చేసింది. బీటా యూజర్లు తమ వాట్సాప్ బీటా వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవడం ద్వారా మీకు ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ తెలిపింది.
0 comments:
Post a comment