Weight Loss Tips - బరువు తగ్గడానికి రోజూ జీర వాటర్ తాగుతున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
జీలకర్ర… భారతీయ వంటశాలలో విరివిగా లభించే మసాలా దినుసు. దీనిలో అనేక రకాల ఔషదగుణాలున్నాయి. ముఖ్యంగా దీనిని బరువు తగ్గించడానికి ఉపయోగిస్తుంటారు. జీలకర్ర వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలోని వ్యర్థాన్ని తొలగిస్తుంది. అంతేకాకుండా.. చర్మ సంరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే చాలా మంది బరువు తగ్గడానికి రోజూ జీలకర్ర నీటిని తాగుతుంటారు. అయితే కేవలం బరువు తగ్గడమే కాకుండా అనేక రకాల ప్రయోజనాలున్నాయి. అవెంటో తెలుసుకుందామా.
జీలకర్రను చాలా కాలంగా ఫ్లాబ్ కటింగ్ పదార్ధంగా చెబుతుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువును తగ్గించడమే కాకుండా..
కొవ్వును కరిగిస్తుంది. అలాగే రోజూవారీ జీలకర్ర తాగడం వలన కొవ్వును బర్న్ చేయడం వలన బరువు తగ్గించడమే కాకుండా.. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
నీటిలో నానబెడితే ఎం జరుగుతుంది…
చాలా మంది జీలకర్రను నీటినితో కలిపి తీసుకుంటారు. జీలకర్రను నీటిలో నానబెట్టడం వలన ఓస్మోసిస్ ఏర్పడుతుంది. దీనివలన జీరాలో ఎక్కువగా నీటిని పీల్చుకుంటాయి. దీంతో ఇందులో ఉండే పోషకాలన్ని నీటిలోకి వెళ్లిపోతాయి. దీంతో నీరు పసుపు రంగులోకి మారిపోతుంది.
దీనిలో ఎన్ని కేలరీలు ఉన్నాయి.
జీరాలో 7 కేలరీలు ఉన్నాయి. అంతేకాకుండా.. ఇది డిటాక్స్ పానియంగా ఉపయోగపడుతుంది. ఇందులో అతి తక్కువ కేలరీలు పానీయం అయినప్పటికీ ఆహారాన్ని సంతృప్తిగా తిన్నామనే భావన కల్పిస్తుంది. భోజనానికి ముందు జీరా వాటర్ తాగడం లేదా ఆకలిని తగ్గిస్తుంది.
రోజూకు ఎన్ని సార్లు తాగాలి…
బరువు తగ్గాలి అనుకునే వారికి రోజుకు 3 నుంచి 4 సార్లు జీరా నీరు తాగడం ఉత్తమం. ఉదయం లేవగానే.. అలాగే భోజనం ముందు.. రాత్రి భోజనం తర్వాత తీసుకోవడం ఉత్తమం.
ప్రతిరోజూ ఒకే రకమైన కొవ్వును తగ్గించే జ్యూస్ తాగాలంటే చాలా మందికి విసుగు వస్తుంది. అయితే వాటికి రుచికి విసుగు రాకుండా.. కేవలం బరువు తగ్గడానికి ఈ జ్యూస్ పనిచేస్తుంది. జీరా నీటిలో దాల్చినచెక్క పొడిని జోడించడం మంచిది. ఈ దాల్చినచెక్క గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించడానికి.. శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ తొలగించడానికి సహయపడుతుంది. రాత్రి సమయంలో జీలకర్రను నీటిలో నానబెట్టడం.. ఒక చెంచా దాల్చిన చెక్క పోడిని కలుపుకోవాలి. దానికి అల్లం పోడి కలపడం ఉత్తమం.
0 comments:
Post a comment