Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Saturday, 10 April 2021

ఉద్యమ స్థాయికి చదవడం మాకిష్టం -యాప్‌ల వినియోగంలో సాంకేతిక సమస్యలు పై పాఠశాల విద్య కమిషనర్‌ చినవీరభద్రుడు

We love reading 

ఉద్యమ స్థాయికి చదవడం మాకిష్టం

‘ఈనాడు’తో పాఠశాల విద్య కమిషనర్‌ చినవీరభద్రుడు

చిన్నారుల్లో పఠనాసక్తిని పెంపొందించడం, గ్రంథాలయాలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పాఠశాల విద్య కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలు, పాఠశాలల్లో ‘నాడు- నేడు’, ఏకోపాధ్యాయ పాఠశాలల ఇబ్బందులు, ‘చదవడం మాకిష్టం’ తదితర అంశాలపై శుక్రవారం ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, చిత్తూరు(విద్య)


యాప్‌ల వినియోగంలో సాంకేతిక సమస్యలు

విద్యార్థుల హాజరు నమోదు, మధ్యాహ్న భోజనం, పరిసరాల పరిశుభ్రత వంటి మరికొన్ని అంశాలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వివిధ యాప్‌లు రూపొందించాం. వీటి వినియోగంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయమై అధ్యయనం చేయమని ఇటీవల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆదేశించారు. ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎన్ని యాప్‌లు వినియోగిస్తున్నారు? ఇందుకు ఎంత సమయం పడుతోంది? తద్వారా బోధనపై ఎంత భారం పడుతుంది? అని తెలుసుకోవాలని సూచించారు. త్వరలోనే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కూడా సమావేశం నిర్వహిస్తాం. శిక్షణ కోసం విజయవాడలో కార్యశాల(వర్క్‌షాప్‌) ఏర్పాటు చేస్తాం. ఉపాధ్యాయుల బయోమెట్రిక్‌ నమోదులో నెల క్రితం వరకూ సర్వర్‌ సమస్య ఉంది. కొత్త వెర్షన్‌ తీసుకొచ్చినందున ప్రస్తుతం ఇబ్బందులు తలెత్తడంలేదు. ఇంకా ఎక్కడైనా అడ్డంకులు ఉంటే.. మా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తాం.


మరిన్ని పుస్తకాలు అందుబాటులోకి తెస్తాం

‘చదవడం మాకిష్టం’ కార్యక్రమం పెద్ద ఉద్యమం కావాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ బాధ్యతను తీసుకోవాలి. సమగ్ర శిక్ష గ్రంథాలయ, వయోజన విద్యాశాఖ సంయుక్తంగా కలిసి కార్యక్రమాన్ని అమలు చేయాలి. భవిష్యత్తులో ఉన్నత విద్యా మండలి కూడా ఇందులో కలుస్తుందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో సంబంధిత శాఖల భాగస్వామ్యంతో ‘చదవడం మాకిష్టం’ను ముమ్మరం చేస్తాం. ఏ తరగతి పిల్లలు ఏ పుస్తకాలు చదవాలి? అనే అంశంపై ప్రణాళికలు రూపొందిస్తాం. పాఠశాలలు, శాఖా గ్రంథాలయాల్లో మరిన్ని పుస్తకాలు అందుబాటులోకి తెచ్ఛి. చిన్నారులు, యువతలో జ్ఞాన సముపార్జనకు ప్రయత్నిస్తాం.


గుడుపల్లె ఎంఈవో ప్రత్యేక శ్రద్ధ

విద్యాసంస్థల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి ‘మన బడి నాడు- నేడు’ను ప్రారంభించాం. జిల్లాలోని ఎక్కువ ప్రాంతాల్లో వేగంగా, నాణ్యంగా పనులు చేపడుతున్నారు. కొన్నిచోట్ల వివాదాలు ఉన్నాయి. సామగ్రి సేకరణలో సమస్యలు వస్తున్నాయి. వీటిని కూడా అధిగమించి.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం. ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన నేను 40కి పైగా పాఠశాలలను సందర్శించి.. సమస్యలు తెలుసుకున్నా. గుడుపల్లె ఎంఈవో ఆ మండలంలోని బడులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని.. చక్కగా నాడు-నేడు అమలు చేస్తున్నారు. రెండో విడత కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు కూడా భాగస్వాములవుతారు. తద్వారా ఉపాధ్యాయులపై భారం తగ్గుతుంది. ఏకోపాధ్యాయ పాఠశాలల సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వీటిని పరిష్కరించడానికి ఆర్థిక శాఖతో కలిసి మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. 10-15 రోజుల్లో వీటిని సిద్ధం చేస్తాం. అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటాం అని చిన వీరభద్రుడు తెలిపారు.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top