Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 4 April 2021

కరోనా భయం గుప్పిట్లో బడులు సాగేదెలా?

 తేది: 4/4/2021

వార్త దిన పత్రిక నందు  ఆర్టికల్

కరోనా భయం గుప్పిట్లో బడులు సాగేదెలా?

***

ఇటీవలి కాలంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తోంది. దీనివల్ల స్కూళ్లు, కాలేజీలు మీద ఈ వైరస్‌ ప్రభావం అధికంగా ఉంటోంది. దీనితో కొన్ని చోట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్‌ బారిన పడుతున్నారు. అయితే పిల్లల్లో లక్షణాలు ఉంటే వారిని ఇళ్లకు పంపిస్తున్నారు తప్ప. కోవిడ్ పరీక్షలు చేయించడం, ముందు జాగ్రత్త చర్యలు కూడా తక్కువగానే ఉంటున్నాయి. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని ఇంటికి పంపించినప్పటికీ వారికి హాజరు నుంచి ఎటువంటి మినహాయింపు ఇవ్వడం లేదని తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ స్టూడెంట్ యాప్ ద్వారా హాజరు తీస్తున్నారు. భవిష్యత్తులో ఈ హాజరు శాతం అమ్మఒడి కోసం వాడుకోవచ్చనే సందేహాలు తల్లిదండ్రులలో ఉండటంతో జ్వరం, జలుబు లాంటి కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ హాజరు శాతం తగ్గకూడదని పిల్లలను తల్లిదండ్రులు స్కూళ్లకు పంపుతున్నారు. దీనివల్ల ఎక్కడ తమకు కరోనా సోకుతుందోనని భయంభయంగా స్కూళ్లకు విద్యార్థులు, ఉపాధ్యాయులు వెళుతున్నారు.  కరోనా తీవ్రతతో అప్రమత్తమైన కేంద్రం ఏప్రిల్‌ నెలాఖరు వరకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కూడా ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం పాఠశాలకు వచ్చే విద్యార్థులు అందరూ మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. పాఠశాలల్లో అసెంబ్లీ నిర్వహించరాదు. తరగతి గదికి ఇరవై మంది విద్యార్థులు మాత్రమే ఉండేటట్లు చూడాలి. బెంచీల సైజులను బట్టి రెండు లేదా ముగ్గురిని కూర్చోబెట్టాలి. స్టూడెంట్స్ లో ఎటువంటి కోవిడ్ లక్షణాలు కనిపించినా సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కాంటాక్ట్ చేసి పరీక్షలు చేయించాలి. 45 సంవత్సరాల దాటిన ఉపాధ్యాయులందరూ వ్యాక్సిన్ ని వేయించుకోవాలి. మధ్యాహ్న భోజన పథకాన్ని హైస్కూల్స్ లో ఒక తరగతి తర్వాత ఒక తరగతికి భోజనం పెట్టేలా చర్యలు తీసుకోవాలి. కానీ రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలు ఎక్కడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అంతేగాక ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు మాస్కులు ధరించలేక పిల్లలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోనీ మాస్కు తీసేద్దామనుకుంటే భౌతిక దూరం నిబంధన కూడా పాటించడం లేదు. తరగతి గదుల్లో ఒక్కో బెంచ్‌కి నలుగురు, ఐదుగురు చిన్నారులను కూర్చోబెడుతున్నారు. శానిటైజేషన్‌ చేయడం లేదు. ప్రభుత్వ స్కూళ్ళలో  ఇరుకైన తరగతి గదులు, సరైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల కోవిడ్ నిబంధనలు అమలు చేయడం కష్టతరమవుతోంది. 

బడికి వెళ్లకపోతే హాజరు సమస్య, వెళితే కరోనా భయం, ఈ రెండింటి మధ్య చిన్నారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఆన్లైన్లో విద్యా బోధన ప్రసక్తే లేదని, ఆన్లైన్ క్లాసుల వల్ల ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రస్తుతానికి స్కూళ్లకు సెలవులు ఇచ్చే పరిస్థితి లేదని, స్కూళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని,  విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడొద్దని, కోవిద్ ప్రోటోకాల్స్ ను తప్పకుండా పాటించాలని, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వం స్కూళ్లు మూసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో  ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు పెట్టాలని నిర్ణయించింది. మే 14 వరకు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు పాఠశాలలు పనిచేసేలా షెడ్యూల్‌ విడుదల చేసింది. అలాగే మే 15 నుంచి వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. ఎస్‌సీఈఆర్‌టీ షెడ్యూల్ ప్రకారం టెన్త్ విద్యార్థులు, టీచర్లకు వేసవి సెలవులు లేవని ప్రకటించింది. విద్యా సంస్థల్లోనూ కేసులు నమోదువుతుండటంతో అప్రమత్తమైన పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకొని మరోసారి విద్యా సంస్థలు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలన్నింటినీ మూసివేయగా మరికొన్ని చోట్ల కేవలం 1 నుంచి 8తరగతుల వరకు పాఠశాలల్లో తరగతులు రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆర్‌టి-పిసిఆర్‌ పరీక్షలు పెంచాలని, పాజిటివ్‌ వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందించాలని, ఆ తర్వాత ట్రేసింగ్‌ ప్రక్రియను చేపట్టాలంది. అయితే ఏప్రిల్ 30 వరకు ‘కరోనా’ ‘అన్ లాక్ డౌన్’ నిబంధనలు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. కరోనా వ్యాప్తి, విజృంభణ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన కరోనా నిబంధనలు, మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలని, అన్ని రాష్ట్రాలు ‘ఆర్టీ పీసీఆర్’ టెస్టుల సంఖ్య 70 శాతానికి పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. పాజిటివ్ వచ్చిన వారికి సరైన చికిత్స అందించాలని క్షేత్రస్థాయిలో కరోనా మార్గదర్శకాలు, నిబంధనలు అమలయ్యేలా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజల రద్దీ బాగా ఉండే ప్రాంతాల్లో, పనిచేసే ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా ఆంక్షలు విధించవచ్చని పేర్కొంది. భారత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కోవిడ్ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం మరోసారి కోవిడ్ నిబంధనలు అమలు చేసే విషయంపై సీరియస్‌గా దృష్టిసారించింది. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో కోవిడ్ నిబంధనల్ని అమలు చేయాలని మరోమారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా రెండో దశ వ్యాపిస్తున్నందున్న నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అవకాశం ఉన్నంత మేర వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని మరో మారు అవలంభించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దేశంలోనూ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరిశ్రమలు, దుకాణ సముదాయాలు, ఫ్యాక్టరీల్లో నియంత్రణా చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. రవాణా వాహనాలు, యంత్రాలు, ప్రాంగణాల్ని ఎప్పటికప్పుడు వైరస్ రహితంగా చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది ప్రభుత్వం. శానిటైజేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు చేపట్టాల్సిందిగా స్పష్టం చేసింది. వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, దుకాణాల్లోకి ప్రవేశించే సమయంలో థర్మల్ స్కానింగ్ చేయాల్సిందిగా సూచనలు చేసింది. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం విధిగా పాటించేలా చూడాలని స్పష్టంగా తెలిపింది. డైనింగ్ హాళ్లు, క్యాంటీన్లలో ప్రతీ రెండు గంటలకూ శానిటేషన్ చేయాలని, ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సినేషన్ వేయించేందుకు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కట్టడి చేసేందుకు టెస్ట్, ట్రేస్, ట్రీట్మంట్ కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేయాలి, టెస్టుల సంఖ్య పెంచాలి, కోవిడ్ కాంటాక్ట్ సోర్సు వ్యక్తులను వెంటనే గుర్తించాలి, వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో పూర్తి వైద్యం అందించాలి, కోవిడ్ ఆసుపత్రుల సంఖ్యను పెంచి తగినంత మంది వైద్యులు మరియు వైద్యేతర సిబ్బందిని నియమించాలి. మందులు, పీపీఈ కిట్లు, లేబరేటరీలు లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, ప్రజలందరితో, వ్యాక్సిన్ తీసుకున్న వారితో సహా  భౌతిక దూరం, మాస్కులు వాడటం మరియు చేతులు సానిటైజ్ చేసుకోవడం విధానాన్ని కచ్చితంగా అమలు చేయించాలి, దీని అమలు కోసం ప్రజలలో విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు జరపాలి, కోవిడ్ నిబంధనలు అమలు చేయక పోవడం వల్ల కరోనా వ్యాధి ఉధృతికి పాఠశాలలు మరియు కళాశాలలు కేంద్రంగా మారుతున్నాయి . కనుక కొవిడ్ నిబంధనలు సరిగా అమలు చేయని యాజమాన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి,  అవసరమైతే తాత్కాలికంగా స్కూళ్ళు కాలేజీల నిర్వహణను నిలుపుదల చేయాలి, బారులు, మద్యం దుకాణాలు, మాల్స్ బజారులు, పబ్లిక్ మరియు ప్రయివేట వాహనాలలో ప్రయాణీకుల పట్ల, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ప్రాంగణాల వద్ద కోవిడ్ కట్టడి ప్రోటోకాల్ అమలు చేయాలి, అమలు చేయని, పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి. కరోనా వ్యాక్సిన్ ప్రజలందరికి ఉచితంగా అందించాలి. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు భయ పడుతున్న కారణంగా ప్రజలందరూ వేయించుకునే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలి. గ్రామస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వైద్యుల పర్యవేక్షణ లేకుండానే జరుగుతుంది. అలా కాకుండా ప్రాధమిక వైద్య సదుపాయాలతో, అంబులెన్స్ అందుబాటులో, వైద్యుల ఆధ్వర్యంలోనే కరోనా వ్యాక్సినేషన్ జరిగే విధంగా చూడాలి. కరోనా మొదటి దశలో వైద్య సేవలు అందించిన డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిని మళ్లీ విధుల్లోకి తీసుకుని కరోనా వైద్యాన్ని ప్రజలకు అందించే విధంగా చూడాలి.

- వాసిలి సురేష్

9494615360



0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top