Rajaram - School teacher, Bus driver, Hero of kindness
ఆదర్శ ఉపాధ్యాయుడు: స్కూలు కోసం డ్రైవర్‌గా మారిన టీచర్
గురుబ్రహ్మ.. గురువిష్ణు.. గురుదేవో మహేశ్వర : గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమ: అంటూ గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చి దైవత్వాన్ని ఆపాదించిన సంస్కృతి మనది...! "మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవో భవ" అంటూ తల్లిదండ్రుల తరువాతి స్ధానం గురువుకే ఇచ్చిన దేశం మనది...నేటి బాలలను రేపటి తరం భ విష్యత్తు నిర్దేశకులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే. కర్నాటకలో కూడా రాజారాం అనే ఉపాధ్యాయుడున్నాడు. పిల్లలకు రాజారాం అంటే ఎంతో ఇష్టం. రాజారాం కూడా పిల్లలపై అమితమైన ప్రేమను కనబుస్తాడు. ఇంతకీ రాజారాం గురించి అంత ప్రత్యేకత ఏమిటో చూద్దాం...
కర్నాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన రాజారాం బ్రహ్మవర్ పట్టణంలోని బరాలి ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఆయన పని చేసే స్కూలుకు సరైన రవాణా వసతి లేదు. దీంతో ప్రతిసంవత్సరం అక్కడ స్కూళ్లో పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుకుంటూ వస్తోంది. ఇది గమనించిన రాజారాం పిల్లలను ఎలాగైనా స్కూలుకు తిరిగి రప్పించాలని భావించాడు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడగా... వారు స్కూలుకు పిల్లలను పంపేందుకు బస్సు కానీ, వ్యాను కానీ లేదని అందుకే పిల్లలను స్కూలు మారుస్తున్నట్లు తెలిపారు. ఇది రాజారాంను కొంత ఆవేదనకు గురిచేసింది. అయితే వెంటనే ఓ మినీ బస్సును రాజారాం కొన్నాడు. ఇక సమస్యకు చెక్ పెట్టదలుచుకున్నాడు.
రాజారామే ప్రతిరోజు చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి స్కూలు పిల్లలను ఎక్కించుకుని స్కూలుకు తీసుకొస్తాడు. అదికూడా పూర్తిగా ఉచితంగానే. ఇందుకోసం ఎలాంటి ఫీజు వసూలు చేయరు. ఇలా రోజుకు నాలుగు ట్రిప్పులు తిరిగి 30 కిలోమీటర్ల పరిసరాల్లో ఉన్న గ్రామాలు తిరిగి అక్కడి పిల్లలను తన స్కూలుకు తీసుకొస్తారు. స్కూలు అయిపోయాకా తిరిగి పిల్లలను తమ గ్రామాల్లో అదే బస్సులో వదిలేస్తూ ఉంటాడు. రాజారాం చదువు చెప్పడమే కాకుండా ఇలా పిల్లలను జాగ్రత్తగా తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేర్చుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో స్కూలు బస్సు నడిపే డ్రైవర్లపై నమ్మకం కోల్పోతున్న నేపథ్యంలో స్వయంగా ఓ టీచరే ఈ బాధ్యతను తీసుకోవడం చాలా గొప్ప విషయమని రాజారాంను కొనియాడారు.
బస్సు కొనేందుకు తన వద్ద సరిపడా డబ్బు లేకపోవడంతో... రాజారాం స్నేహితులు తలోచేయి వేశారు. వారు అందించిన ఆర్థిక సహకారంతో రాజారాం స్కూలు బస్సు కొన్నట్లు తెలిపాడు. అయితే బస్సును మెయింటెయిన్ చేయడానికి కాస్త డబ్బు ఖర్చు అవుతున్నప్పటికీ అది కూడా స్నేహితులు కలిసి పంచుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు రాజారాం. ఒకప్పుడు 60 మంది విద్యార్థులున్న ఈ స్కూలులో 90 మంది విద్యార్థులు అయ్యారని చాలా గొప్పగా చెప్తారు రాజారాం. మొత్తం 90 మంది విద్యార్థులను స్కూలుకు సమయానికి చేర్చే బాధ్యతను తానే తీసుకున్నట్లు గర్వంగా కూడా చెబుతారు రాజారాం.
ఆదుకున్న రాజారామ్
దీంతో మూతబడే ప్రమాదం నుంచి తమ పాఠశాలను కాపాడుకోవడానికి పాఠశాల ఉపాధ్యాయుడు రాజారామ్ సంకల్పించారు. పాఠశాలకు వాహనం కొనుగోలు చేయడానికి బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న పాఠశాల పూర్వ విద్యార్థులకు పరిస్థితిని వివరించి సహాయం అర్థించారు. పూర్వ విద్యార్థులు తలోచెయ్యి వేసి పాఠశాలకు ఓ మినీబస్సును అందించారు. కానీ డ్రైవర్‌ను ఎక్కడి నుంచి తీసుకురావడం? పాఠశాల నిర్వహణకు వచ్చే నిధులు అంతంతమాత్రంగానే ఉండడంతో వాహనాన్ని తనే డ్రైవర్పాత్రనూ పోషించాలని టీచర్ రాజారామ్ సిద్ధమయ్యారు. ఎంతో సాధన తరువాత బడి బస్‌ను నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌ను సంపాదించారు.
30 కిలోమీటర్లు, నాలుగు ట్రిప్పులు
♦ బరాలి గ్రామ చుట్టుపక్కనున్న శిరియార కల్లుబెట్టు, హొరళిజెడ్డు, అల్తారి కార్తిబెట్టు, కాజ్రళ్లి, మునిపురి తదితర గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి, తిరిగి ఇళ్లకు చేర్చడానికి రాజారామ్ ప్రతి రోజూ 30 కిలోమీటర్లు మేర నాలుగు ట్రిప్పులు తిప్పుతున్నారు.
♦ ఉదయం ఎనిమిది గంటలకు వాహనంతో గ్రామాలకు బయలుదేరి రెండు ట్రిప్పుల్లో విద్యార్థులను పాఠశాలకు తీసుకువస్తారు. సాయం త్రం ఐదు గంటలకు మరోసారి రెండు ట్రిప్పులు తిప్పి విద్యార్థులను ఇళ్లకు చేర్చుతారు.
♦ రాజారామ్ కృషికి ముగ్ధులైన గ్రామాల ప్రజలు తమ పిల్లలను తిరిగి ప్రభుత్వ పాఠశాలకు పంపించసాగారు. దీంతో పదిలోపు ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 90 కి చేరుకుంది.
♦ గణిత, సైన్స్ బోధిస్తున్న రాజారామ్‌తో అందుబాటులో లేనిరోజుల్లో వాహనానికి డ్రైవర్‌ను ఏర్పాటు చేయడానికి గ్రామస్థులు సమాలోచనలు చేస్తున్నారు. పాఠశాలలో హెచ్ఎం, మరో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నా రాజారామ్ మాత్రమే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు.
సేవకు ప్రశంసల జల్లు
పాఠశాల, విద్యార్థుల కోసం తపిస్తున్న రాజారామ్‌కు నలువైపులా నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. విద్యార్థులను పాఠశాలకు తీసుకువెళుతున్న రాజారామ్ ఫోటో నెట్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన ప్రయత్నాన్ని మాజీ దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన ట్విట్టర్ ఖాతాలో ఫోటోను షేర్ చేసిన కొనియాడారు.
మొత్తానికి రాజారాం చేస్తున్న మంచి పనికి చాలామంది ప్రశంసిస్తున్నారు. కేవలం చదువు చెప్పడమే తన బాధ్యతగా భావించకుండా...ఇలా సేవలు చేయడం రాజారాం ఎంతో పుణ్యం కట్టుకున్నాడని పలువురు మేధావులు కొనియాడారు. ఇలాంటి టీచర్ స్కూలుకు ఒక్కరుంటే చాలు... పిల్లలు చదువుకునేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తారని అభిప్రాయపడ్డారు. రాజారాం ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలిచారని పొగడ్తల వర్షం మేధావులు కురిపించారు.
వీడియో చూడండి...
0 comments:
Post a comment