Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Monday, 12 April 2021

Jagananna Smart Towns - జగనన్న స్మార్ట్‌టౌన్ల గురించి పూర్తి వివరాలు...మార్గదర్శకాలు...అప్లికేషన్ ఫారం....


 Jagananna Smart Towns - ఇక స్మార్ట్‌టౌన్లకు భూసేకరణ..

సన్నాహాలు వేగవంతం చేసిన పురపాలక శాఖ

ఎంత భూమి కావాలో ప్రాథమికంగా అంచనా

జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు

భూసేకరణకు మార్గదర్శకాలు జారీ . 

Jagananna Smart Towns -  జగనన్న స్మార్ట్‌టౌన్ల గురించి పూర్తి వివరాలు...మార్గదర్శకాలు...అప్లికేషన్ ఫారం....

సొంతంగా ఇల్లు కలిగి ఉండడం మధ్యతరగతి ప్రజల కల. ఈ కలను నెరవేర్చడానికి వారు జీవితాంతం పనిచేస్తారు. వారి ఇంటిని పొందడానికి ప్రభుత్వం సామాన్యులతో చేతులు కలిపితే, అది చాలా సహాయకారిగా ఉంటుంది.

ఇటీవల విజయవాడ మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ చేసిన ప్రకటన ప్రజల ముఖాల్లో చిరునవ్వు తెచ్చిపెట్టింది. మిడిల్ ఇన్‌కమ్ గ్రూపులకు (ఎంఐజి) ఇంటి స్థలం (ప్లాట్లు) అందించడానికి జగన్నన్న స్మార్ట్ టౌన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఇటీవల జరిగిన ఒక సంభాషణలో కమిషనర్ తెలిపారు. ఈ పథకం కింద, విజయవాడ నగర శివార్లలో (5 కిలోమీటర్ల పరిధిలో) ప్రాంతాలు అభివృద్ధి చేయబడతాయి .

అమరావతి: రాష్ట్రంలో స్మార్ట్‌టౌన్ల భూసేకరణకు పురపాలక శాఖ సమాయత్తమవుతోంది. లాభాపేక్ష లేకుండా అన్ని వసతులతో అభివృద్ధి చేసిన లేఅవుట్లను మధ్యతరగతి వర్గాలకు అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు పట్ల రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా స్మార్ట్‌టౌన్ల ప్రాజెక్టును చేపట్టేందుకు పురపాలక శాఖ సన్నాహాలు వేగవంతం చేసింది. ఇప్పటికే మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో నిర్వహిస్తున్న డిమాండ్‌ సర్వే అంచనాల ప్రకారం ఎంత భూమి అవసరమవుతుందో ప్రాథమిక అంచనాకు వచ్చింది. దీంతో అవసరమైన మేర కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో స్మార్ట్‌టౌన్లలో స్థలాల కోసం దరఖాస్తుదారుల అర్హతలు, భూసేకరణకు మార్గదర్శకాలతో పురపాలక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

రాష్ట్ర స్థాయి కమిటీ ప్రత్యక్షంగా పరిశీలించాకే ఆమోదం

► భూసేకరణకు జాయింట్‌ కలెక్టర్‌ (రైతు భరోసా, రెవెన్యూ) నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మెట్రోపాలిటన్‌ కమిషనర్‌/పట్టణాభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్, సంబంధిత మునిసిపల్‌ కమిషనర్, ఎస్‌ఈ (ప్రజారోగ్య శాఖ), జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ కమిషనర్‌ సభ్యులుగా ఉంటారు. 

► రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్‌–డైరెక్టర్‌ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీని నియమించారు. ఇందులో ఏపీ టిడ్కో ఎండీ, టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్, గృహనిర్మాణ సంస్థ వైస్‌ చైర్మన్‌ సభ్యులు. 

► జిల్లాల్లో స్మార్ట్‌టౌన్లకు అవసరమైన భూమిని అంచనా వేయడం, మార్గదర్శకాల మేరకు భూమిని గుర్తించడం జిల్లా కమిటీల బాధ్యత. 

► జిల్లా కమిటీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ సమీక్షిస్తుంది. రాష్ట్ర స్థాయి కమిటీలో కనీసం ఇద్దరు సభ్యులు ఆ భూములను ప్రత్యక్షంగా పరిశీలించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆ భూములు ఉన్నాయో, లేదో నిర్ధారించాలి. రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదించాకే జిల్లా కలెక్టర్లు భూసేకరణ ప్రక్రియ చేపడతారు. 

మూడు కేటగిరీలుగా ప్లాట్లు

► డిమాండ్‌ అంచనాలను పరిగణనలోకి తీసుకుని జిల్లా కేంద్రాల్లో 150 ఎకరాలు/200 ఎకరాలు/250 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్లు వేస్తారు. 

► మునిసిపాలిటీల్లో 50 ఎకరాలు/100 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్లు వేయాలని నిర్ణయించారు. 

► ఇక స్మార్ట్‌టౌన్లలో మూడు కేటగిరీల ప్లాట్లతో లేఅవుట్లు వేస్తారు. 150 చ.గజాల్లో మధ్య ఆదాయ వర్గం (ఎంఐజీ), 200 చ.గజాల్లో ఎంఐజీ–1, 240 చ.గజాల్లో ఎంఐజీ–2 ప్లాట్ల డిజైన్‌ రూపొందించారు.

వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షలు

స్మార్ట్‌టౌన్లలో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉండాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఒక కుటుంబం ఒక ప్లాట్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

భూసేకరణకు మార్గదర్శకాలు..

► వివాదాస్పదంకాని భూములనే ఎంపిక చేయాలి.

► భూముల ఎంపికలో మాస్టర్‌ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. 

► డిమాండ్‌ ఉన్న ప్రాంతంలో, తగినంత ఎత్తులో ఉన్న భూములకు ప్రాధాన్యమివ్వాలి.

► గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రాంతాల్లోనే ఎంపిక చేయాలి.

► పాఠశాలలు, రవాణా, వైద్య వసతులు అందుబాటులో ఉన్న ప్రాంతానికి ప్రాధాన్యమివ్వాలి.

► మునిసిపాలిటీల్లో అయితే గరిష్టంగా 3 కి.మీ., కార్పొరేషన్లలో అయితే గరిష్టంగా 5 కి.మీ. దూరంలో ఉన్న భూములను ఎంపిక చేయాలి.

► ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద చేపట్టిన ప్రాంతాలకు సమీపంలో ఉంటే మంచిది. 

► మౌలిక వసతుల కల్పన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ‘జగనన్న కాలనీ’లకు సమీపంలో ఉండేటట్టుగా చూడాలి.

► భవిష్యత్‌లో కూడా విస్తరణకు అవకాశం లేని ప్రాంతాలను ఎంపిక చేయకూడదు.

► ఆ భూములకు అప్రోచ్‌ రోడ్‌ తప్పనిసరిగా ఉండాలి.

► నిర్మాణాలకు అనువుగా లేని నేలలను ఎంపిక చేయకూడదు.

► చెరువులు, ఇతర నీటి వనరులకు సమీపంలో ఉన్న భూములను ఎంపిక చేయొద్దు.

► భూగర్భ జలాలు తగినంతగా ఉండి, తాగునీటి వసతి ఉన్న ప్రాంతంలోని భూములనే ఎంపిక చేయాలి.

 అర్హులు.

ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయం రూ. 3 లక్షల నుండి 6 లక్షల వరకు, అతను 150 చదరపు గజాల స్థలానికి అర్హుడు.

వ్యక్తిగత ఆదాయాలు రూ. 200 చదరపు గజాల స్థలానికి 6 లక్షల నుండి 12 లక్షల వరకు అర్హులు.

రూ. ఏటా 12 లక్షల నుండి 18 లక్షలు, 240 చదరపు గజాల ప్లాట్లకు అర్హులు.

కావలసిన పత్రములు

ఆసక్తి గల దరఖాస్తుదారులు ఆదాయ ప్రమాణాలు నెరవేర్చడానికి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని (రెవెన్యూ శాఖ జారీ చేసిన) అందించాలి

దరఖాస్తుదారు ఆధార్ కార్డును అందించాలి

ఇతర పత్రాల వివరాలు (అవసరమైతే) సంబంధిత అధికారి ఇస్తారు

జగన్న స్మార్ట్ టౌన్ MIG ప్లాట్ల పథకం | ఆన్‌లైన్, దరఖాస్తు ఫారం & ప్రాసెస్‌ను ఎలా దరఖాస్తు చేయాలి 

సచివాలయ సిబ్బంది ఏప్రిల్ 6, 7 తేదీల్లో డిమాండ్ సర్వేలు నిర్వహించారు. సర్వే పూర్తయినందున, ఆన్‌లైన్ దరఖాస్తు త్వరలో ప్రారంభం కానుంది.

అయితే కొన్ని ప్రముఖ న్యూస్ పోర్టల్స్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, సమీప MRO కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయం లేదా గ్రామం లేదా వార్డ్ సెక్రటేరియట్ వద్ద కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

FAQs

What benefits are given under the Jagananna Smart housing scheme?

Under this scheme, eligible families are being offered plots (Land). The area of Land to be given depends on the annual income of the applicant.

What are the available plot sizes under this scheme?

The sizes of plots are 150,200 & 240 square yards.

What is the minimum annual income requirement?

This scheme is applicable to people belonging to MIG (Medium Income Group) Category. If your income falls in the range of 3 Lakhs to 18 Lakhs, you are eligible to apply under this scheme.


When was the survey for this scheme conducted?

The survey was conducted by the secretariat staff on 6th & 7th April 2021.

How to Download the Application form of Jagananna Smart housing scheme?

Application Form

The application forms can be obtained from Nearest MRO office, Collectorate Office, or at the village or ward secretariat Office. Very Soon, it is expected that online process may also start.

Download Commissioner letter


Full Details Video.....0 Comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top