Good news for middle class people. Jagananna Smart Town. Apply like this
ఆంధ్రా ప్రదేశ్ లోని సామాన్య , మద్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్.. సొంతింటి కలలను నిజం చేసుకోవాలని అనుకునే వారికి రాష్ట్రం ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఆ పథకాన్ని త్వరగా అమలు చేసే దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. గతంలోనే దీనిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. దీనిలో భాగంగా జగనన్న స్మార్ట్ టౌన్ పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాజాగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని తక్కువ ఆదాయం ఉన్నవారు.. మధ్య తరగతి ప్రజలకు ఇళ్ళ స్థలాలను అందించేందుకు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఓ ప్రకటన చేశారు.
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఐదు కిలోమీటర్ల దూరంలో అన్ని వసతులతో కూడిన ఇళ్ల స్థలాలను అభివృద్ధి చేసి ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని వివరించారు.
ఈ స్మార్ట్ టౌన్ లో చక్కటి డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీరు, విద్యుత్ సౌకర్యం, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. గేటెడ్ కమ్యునిటీల్లా అన్ని మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. ఈ ఇళ్లను పొందాలి అనుకుంటే సంవత్సరానికి 3 లక్షల రూపాయల నుంచి 18 లక్షల రూపాయల లోపు ఆదాయం కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ పథకానికి అర్హులే అని ప్రకటించారు.
ఈ పథకం కింద ఓ కుటుంబం150 చదరపు గజాల ఇంటి స్థలం పొందాలి అనుకుంటే ఏడాదికి 3 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఆదాయం కలిగి ఉండాలి అని నిబంధన పెట్టారు. అదే 200 చదరపు గజాల స్థలం కావాలి అంటే ఏడాదికి 6 లక్షల రూపాయల నుంచి 12 లక్షల వరకు ఆదాయం కలిగి ఉండాలి. అలా గే 240 చదరపు గజాల స్థలం దక్కించుకోవాలి అంటే ఏడాదికి 12 లక్షల రూపాయల నుంచి 18 లక్షల రూపాయల ఆదాయం ఉండాలి.
ఎవరి అర్హతలను బట్టి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని కమిషనర్ కోరారు. అర్హులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని విజయవాడ నగర కమిషనర్ కోరారు. వెంటనే తమ దగ్గర్లోని ఎమ్మార్వో ఆఫీసులో కాని లేదా కలెక్టరేట్ కార్యాలయంలో గాని లేదంటే గ్రామ, వార్డు సచివాలయంలో కాని జగనన్న స్మార్ట్ టౌన్ పథకానికి సంబంధించి అప్లికేషన్లు ఇస్తారని వివరించారు. అర్హులు ఆ దరఖాస్తును పూర్తి చేసి అక్కడ ఇవ్వాలన్నారు. దాంతో పాటు ఆధార్ కార్డు జత చేస్తే సరిపోతుందన్నారు. ఆ తరువాత పథకానికి అర్హులైన వారి జాబితాను తయారు చేసి వారికి పట్టాలు అందించడం జరుగుతుందన్నారు.
0 comments:
Post a comment