How to delete the data that Google collects from you ..
మీ నుంచి Google సేకరించే డేటాను ఇలా చూడండి.. దాన్ని తొలగించవచ్చు..!
స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ Google అంటే తెలుసు. ఇంకా చెప్పాలంటే.. అసలు ఫోన్లు లేని వారికి కూడా Google అంటే తెలుసు. అంతలా Google ప్రజాదరణ పొందింది. ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి నిద్ర పోయేవరకు ప్రపంచంలో చాలా మంది Google కు చెందిన ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు. GMAIL, Youtube, Google Drive.. ఇలా అనేక సర్వీసులను వాడుతారు. అయితే మీకు తెలుసా..? నిజానికి Google మన డేటాను స్టోర్ చేసి పెట్టుకుంటుంది. మనం ఉపయోగించే Google సేవలను బట్టి మన డేటాను Google సేకరిస్తుంది. అందుకు అనుగుణంగా మనకు యూట్యూబ్‌లో, ఇతర సైట్లలో యాడ్లను కూడా ప్రదర్శిస్తుంది.
అయితే మీ డేటాను Google ఏ మేర సేకరించింది, మీకు చెందిన ఏయే వివరాలు Google వద్ద ఉన్నాయి ?
వంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. అందుకు గాను Google Crome browser ను ఓపెన్ చేసి అందులో గూగుల్ అకౌంట్లో లాగిన్ అవ్వాలి. తరువాత https://adssettings.google.com/ అనే సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో గూగుల్ మీ నుంచి సేకరించిన డేటా వివరాలు ఉంటాయి.
గూగుల్ ఆ సైట్లో డిస్ప్లే చేసిన సమాచారాన్ని మీ ద్వారా సేకరించిందన్నమాట. మీరు గూగుల్‌కు చెందిన ఏదైనా సర్వీస్‌ను ఉపయోగించినప్పుడల్లా గూగుల్ మీ డేటాను సేకరిస్తుంది. అలా సేకరించిన డేటాను పైన తెలిపిన సైట్లో చూపిస్తుంది. ఆ డేటాకు అనుగుణంగా మీకు గూగుల్ యాడ్స్ కనిపిస్తాయి. అయితే ఆ డేటాను మీరు తొలగించవచ్చు. అందుకు గాను అక్కడ చూపించే వాటిలో దేనిపైనైనా క్లిక్ చేసి అనంతరం వచ్చే ఆప్షన్లలో రిమూవ్ అనే దాన్ని ఎంచుకోవాలి. దీంతో గూగుల్‌లో మీ డేటా డిలీట్ అవుతుంది. ఇలా ఎప్పటికప్పుడు మీ నుంచి గూగుల్ సేకరించే డేటాను ఆ సైట్ నుంచి తొలగించవచ్చు.
0 comments:
Post a comment