Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Monday, 26 April 2021

FLASH...మే 1 నుంచి 31 వరకు పదవ తరగతి వారికి వేసవి సెలవులు

 ❇️ మే 1 నుంచి 31 వరకు పదవ తరగతి వారికి వేసవి సెలవులు..

ఈ నెల 30న జూనియర్ కళాశాలలు , పదవతరగతి విద్యార్థులకు లాస్ట్ వర్కింగ్ డే..

షెడ్యూల్ మేరకు జూన్ 7వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు..

కడప , ఏప్రిల్ 26 : -

ప్రస్తుతం covid 19 రెండవ దశ  ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో... పదవ తరగతి వారికి సిలబస్ మొత్తం పూర్తయిన నేపథ్యంలో... మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్ నేడిక్కడ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలులో సోమవారం మధ్యాహ్నం జిల్లాలో covid 19 రెండవదశ ప్రబలకుండా తీసుకోవలసిన నివారణ చర్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశం అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ... కోవిడ్ వ్యాప్తిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం అన్ని రకాల నివారణ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా కూడా విద్యాలయాల గురించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇందులో భాగంగానే పదవ తరగతి వారికి సిలబస్ మొత్తం పూర్తయిన నేపథ్యంలో మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులు ప్రకటించడం జరిగిందన్నారు జూన్ ఒకటవ తేదీనుంచి టీచర్లు బడికి వచ్చి షెడ్యూల్ మేరకు జూన్ 7వ తేదీ నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు సిద్ధం కావాలని కోరుతున్నామన్నారు. అలాగే ఈనెల 30 కి జూనియర్ కళాశాలలకు, టెన్త్ క్లాస్ పిల్లలకు లాస్ట్ వర్కింగ్ డే అవుతుందన్నారు. సెలవుల్లో ఇంటి పట్టునే ఉండి విద్యార్థులందరూ పరీక్షలకు బాగా ప్రిపేర్ కావాలని మంత్రి సూచించారు. కోవిడ్ కు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల  రక్షణ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాబట్టి ఇంతకుముందు ఆన్లైన్ క్లాస్ వర్క్ ఏదైతే ఉందో అది కూడా అవసరం మేరకు విద్యామృతం, విద్య కలశం లను పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు దోహదపడే విధంగా ఆన్లైన్ క్లాసులు కొనసాగిస్తామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

వీడియో సందేశం చూడండి....



8 comments:

  1. Our school didnt complete 10 th class syllabus

    ReplyDelete
  2. Inka syllabus kaledhu, ayindi ani evaru chepparu, students lifes tho play chestunna AP govt.

    ReplyDelete
  3. సెలవలు ఇస్తే ఒక ఏడుపు ఇవ్వకపోతే మరో ఏడుపు...

    ReplyDelete
  4. ఎవడికో ఇంకా సిలబస్ అవలేదంట పాపం సెలవులు వద్దంట

    ReplyDelete
  5. ఎండలు మండి పోతున్నాయి.
    సెలవులు ఇవ్వాలి.

    ReplyDelete
  6. At this juncture holidays r useful to teachers as well as students. Don't comment on this ...

    ReplyDelete
  7. ఇంటర్ వాళ్ళకు సరిగా క్లారిటీ ఇవ్వలేదు సెలవల గురించి, మేలో ఎక్జామ్స్ ఉంటే ఎలా ఉంటాయి 🤔🤔🤔

    ReplyDelete

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top