Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Wednesday, 7 April 2021

Election News

సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ .. పరిషత్ ఎన్నికలు యథాతథం.

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను కొట్టేసిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ నిన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులుసింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఎస్‌ఈసీ అప్పీల్‌సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల కొట్టివేతతో రేపటి ఎన్నికలు యథాతథంఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. రేపు ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిషత్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను కొట్టేసిన ధర్మాసనం ఎన్నికలు నిర్వహించవచ్చని పేర్కొంది. ఐతే తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఫలితాలు ప్రకటించరాదని పేర్కొంది. విచారణ సందర్భంగా ఎన్నికల నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఎస్ఈసీని కోరింది. ఐతే సరైన పత్రాలు సమర్పించకపోవడంతో విచారణను కాసేపు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ఎందుకు పాటించలేదని ధర్మాసనం ఎస్ఈసీని ప్రశ్నించింది. ఎస్ఈసీ తరపున సీవీ మోహన్ రెడ్డి, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి అధికారాలు ఎన్నికల కమిషన్ కు ఉంటాయని..4 వారాల కోడ్ ఉండాలన్న నిబంధన ఎక్కడ లేదని కోర్టుకు చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీ తరపున పిటిషన్ దాఖలు చేసిన వర్ల రామయ్య... ఎన్నికల్లో పోటీ చేయడం లేదుగనుక.. పరిగణలోకి తీసుకోవద్దని కూడా కోరినట్లు సమాచారం. ఆయన టీడీపీ తరపున ఆయన పిటిషన్‌ వేయలేదని..., వ్యక్తిగతంగా రిట్‌ పిటిషన్‌ వేయకూడదని.. పిల్‌ మాత్రమే వేయాలని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.ఎన్నికలను నిలిపేయాలంటూ బీజేపీ, టీడీపీ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన సింగిల్ జడ్జితో కూడిన బెంచ్.. బీజేపీ పిటిషన్ ను కొట్టేసింది. ఐతే టీడీపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం 4 వారల ఎన్నికల కోడ్ అమలు చేయడంలో ఎస్ఈసీ విఫలమైందని వ్యాఖ్యానించింది. ఎన్నికలు నిలిపేస్తున్నట్లు ఆదేశాలివ్వడంతో పాటు తుదపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. ఈ నేరథ్యంలో ఎస్ఈసీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.కోర్టు తీర్పుతో  రేపు రాష్ట్ర వ్యాప్తంగా 516 జెడ్పీటీసీ 7,258 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు  జరగనున్నాయి.  జడ్పీసీ ఎన్నికల బరిలో 2,092 మంది, ఎంపీటీసీ బరిలో 19,002 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే 126 జెడ్పీటీసీ స్థానాలు, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సిబ్బంది, భద్రతా సిబ్బంది కేటాయింపుతో పాటు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల తరలింపు వంటి ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది.
ఇక ఈ నెల 1న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ.. అదే రోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ఏడాది ఎక్కడైతే ప్రక్రియ నిలిచిందో.. అక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐతే ఎస్ఈసీ ప్రకటనను వ్యతిరేకించిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు వేశాయి. తాజాగా ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.




8 న పరిషత్‌ ఎన్నికలకు కోర్టు పచ్చజెండా..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ లో పరిషత్‌ ఎన్నికల నిర్వహణపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి నేటి మధ్యాహ్నం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం 8 వ తేదీన యథావిధిగా ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలను నిర్వహించవచ్చంటూ.. పచ్చజెండా ఊపింది. రేపు ప్రతి ఒక్కరు తమ ఓటును ఉపయోగించుకోవాలని ఎన్నికల కమిషన్‌ కోరింది. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు.

పరిషత్ ఫలితాలు ప్రకటించొద్దు : హైకోర్టు
జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్కు అనుమతించిన హైకోర్టు..ఫలితాలను మాత్రం ప్రకటించకూడదని ఆదేశాలు జారీ చేసింది
తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఫలితాలు వెల్లడించవద్దని తీర్పు ఇచ్చిన డివిజన్ బెంచ్














హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యాహ్నం  2.15 PM  తుది తీర్పు
✍️ఎస్‌ఈసీ అప్పీల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు... తీర్పును మధ్యాహ్నం 2.15 గంటలకు వెలువరించనుంది. ఎస్‌ఈసీ అప్పీల్‌పై హైకోర్టులో విచారణ కొనసాగింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ.. ఎస్‌ఈసీ కార్యదర్శి కన్నబాబు అప్పీల్‌ దాఖలు చేశారు. ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది సి.వి. మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. 28 రోజుల కోడ్‌ ఉండాలనే నిబంధన సుప్రీంకోర్టు ప్రత్యేక సందర్భంలో ఇచ్చిందన్నారు. కోడ్‌ నిబంధన ఈ ఎన్నికలకు వర్తింపజేయాల్సిన అవసరం లేదని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది వాదించారు. హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద ఈ వాదనలు వినిపించారా అని ఎస్​ఈసీ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే వాదనకు సమయం సరిపోలేదని ఎస్​ఈసీ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. రిట్‌ పిటిషన్‌ వేసిన వర్ల రామయ్య ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ఎస్‌ఈసీ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తెదేపా తరఫున ఆయన పిటిషన్‌ వేయలేదన్నారు. వ్యక్తిగతంగా రిట్‌ పిటిషన్‌ వేయకూడదని.. పిల్‌ మాత్రమే వేయాలని ఎస్‌ఈసీ న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే పిటిషన్‌లో సరైన వివరాలు లేవని ఎస్‌ఈసీపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను హైకోర్టు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. అనంతరం ప్రతివాదుల తరపున వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను ముగించింది.  తీర్పును మధ్యాహ్నం 2.15 గంటలకు వెల్లడించనుంది


పరిషత్‌ ఎన్నికలపై విచారణ మధ్యాహ్నానికి వాయిదా 11.30 AM

అమరావతి: రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యదర్శి కన్నబాబు ధర్మాసనం ముందు మంగళవారం రాత్రి అప్పీల్‌ దాఖలు చేశారు. ఈపిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం‌ బుధవారం ఉదయం విచారణ చేపట్టింది. ఎస్‌ఈసీ తరపున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వర్ల రామయ్య తెదేపా తరఫున పిటిషన్‌ వేయలేదని, వ్యక్తిగతంగా రిట్‌ పిటిషన్‌ వేయకూడదని సీవీ మోహన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 28 రోజులు కోడ్‌ ఉండాలనేది సుప్రీం ప్రత్యేక సందర్భంలో ఇచ్చిందని పేర్కొన్నారు. కోడ్‌ నిబంధన ఈ ఎన్నికలకు వర్తింప జేయాల్సిన అవసరం లేదన్నారు. పిటిషన్‌లో సరైన వివరాలు లేవని ఎస్‌ఈసీపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సరైన పేపర్లతో మధ్యాహ్నం 12 గంటలకు కోర్టు ముందుకు రావాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదికి ధర్మాసనం ఆదేశించింది.






ఎన్నికల వాయిదా అని హై కోర్ట్ ఉత్తర్వులు నేపధ్యంలో మనం పాఠశాలల కు వెళ్ళాలా లేదా ఎన్నికల విధులకు వెళ్ళాలా అని సంశయం ఉన్న నేపధ్యంలో పూర్తి  వివరణ

ఎన్నికల విథులకే వెళ్ళాలి
Clarification on Election Duty for Today
పోలింగ్ ప్రక్రియ వాయిదా వేసినట్టు గా ఇప్పటి వరకు SEC నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదు
ప్రభుత్వం వేసిన పిటిషన్ పై 8 గంటల తరువాత విచారణ, తదుపరి తీర్పు వచ్చే అవకాశం ఉంది.
ఆ తీర్పు తరువాత SEC ఎన్నికల నిర్వహణ పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కావున
ఎన్నికల కమిషన్ మనకి ఎన్నికల విధులకు కేటాయించింది. ఎన్నికల కమిషన్ నుండు తిరిగి ఆదేశాలు వచ్చే వరకూ ఎన్నికల విధులకు కేటాయించబడినవారు అందరూ ఎన్నికల విధుల్లో ఉండాల్సిందే.

పోలింగ్ కేంద్రాలుగా కేటాయించిన పాఠశాలలు కూడా అంత వరకు పోలింగ్ కేంద్రాలుగానే ఉంటాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అవి ఎన్నికల కేంద్రాలు గానే ఉంటాయి. వాటిని నిన్ననే హ్యాండోవర్ చేయడం జరిగింది.  ఎన్నికలు వాయిదా అని SEC నుండి ఆదేశాలు వచ్చే వరకు మనం వాటిని తెరవడానికి వీలులేదు. 
ఎన్నికల కమిషన్ ఎన్నికలు వాయిదా వేసినట్టు ఆదేశాలు ఇచ్చే వరకు మనం ఎన్నికల కమిషన్ పరిధిలోనే విధులు నిర్వహించవలసి ఉంటుంది. APTELS లో OTP వస్తే OD అప్లై చేయండి. .
       



📙✍️ఉదయం 8 గంటలకు విచారణ

పరిషత్‌ పోరుకు సర్వం సిద్ధమైన దశలో హఠాత్తుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ హైకోర్టులో రాత్రి హౌస్‌ మోషన్‌ రూపంలో అప్పీల్‌ దాఖలు చేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని అభ్యర్థిస్తూ కమిషన్‌ కార్యదర్శి కన్నబాబు దాఖలు చేసిన ఈ అప్పీల్‌ను హైకోర్టు *ధర్మాసనం బుధవారం ఉదయం 8 గంటలకు విచారించే అవకాశం ఉంది.


ఈనాడు

📚✍సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై ధర్మాసనానికి ఎస్‌ఈసీ అప్పీల్‌✍📚

♦నేటి ఉదయం విచారణకు అవకాశం!

*🌻ఈనాడు, అమరావతి:* రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యదర్శి కన్నబాబు ధర్మాసనం ముందు మంగళవారం రాత్రి అప్పీల్‌ దాఖలు చేశారు. అందులో... ‘తెదేపా నేత వర్ల రామయ్య జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదు. వ్యక్తిగత హోదాలో ఆయన వేసిన వ్యాజ్యాన్ని సింగిల్‌ జడ్జి కొట్టేసి ఉండాల్సింది. నాలుగు వారాల ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) విధించాలనే చట్టబద్ధ నిబంధన లేదు. ఎన్నికల కోడ్‌ అమలు విషయంలో విచక్షణాధికారం ఎస్‌ఈసీకే ఉంటుంది. సుప్రీంకోర్టు ఏ సందర్భంలో అలాంటి ఉత్తర్వులు ఇచ్చిందో.. ఆ మొత్తం ఆదేశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలన్న ఒక్క వ్యాఖ్యానానికి భాష్యం చెప్పకూడదు. కరోనా కారణంగా ఎన్నికల్ని వాయిదా వేసినప్పుడు.. కోడ్‌ అమల్లో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయన్న ప్రభుత్వ వాదనతో సుప్రీం ఏకీభవించింది. ఈ నేపథ్యంలో కోడ్‌ విధింపును సడలించి, తదుపరి పోలింగ్‌ తేదీకి నాలుగు వారాలకు ముందు విధించాలని గరిష్ఠ గడువు పెట్టింది...’ అని పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ అప్పీల్‌పై బుధవారం ఉదయం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉందని సమాచారం.




ప్రజా శక్తి



📙✍ఎన్నికలు జరుగుతాయా? జరగవా?

🔸తీవ్ర గందరగోళంలో అధికారులు, ఉద్యోగులు

🔸అర్ధరాత్రి వరకూ టెన్షన్

🌷ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:* పరిషత్ ఎన్నికల పై హైకోర్టు సింగిల్ బెంచ్

ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లే విషయంలో అర్ధరాత్రి వరకూ టెన్షన్ నెలకొంది. సుప్రీంకోర్టు నిబంధనలు ప్రకారం ఎన్నికల కోడ్కు సరిపోయినంత సమయం లేదని, అందువల్లే నూతన. నోటిఫికేషన్ ను నిలిపేయాలని జస్టిస్ దుర్గాప్రసాదరావుతో కూడిన సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డివిజన్ బెంచ్ కు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ కాపీ వచ్చిన తరువాతే డివిజన్ బెంచ్ అప్పీలుకు వెళ్లాల్సి ఉంది. రాత్రి తొమ్మిది గంటలకు ఆర్డర్ కాపీ రావడంతో దాన్ని పరిశీలించి అప్పీలుకు సిద్ధమైందిమరోవైపు వైసిపి నాయకులు ఎన్నికలు జరుగుతాయని, అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది ఒకరోజే గడువు ఉండటంతో అధికారులు, ఎన్నికల విధులు నిర్వహించాల్సిన సిబ్బంది తీవ్ర గండరగోశానికి గురయ్యారు. ఎన్నికలు ఉన్నాయనే పేరుతో 7, 8 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఎన్నికలు నిలిచిపోతే సెలవులు ఇవ్వాలా, వద్దా అనేది విద్యాశాఖ సందిగ్ధంలో పడింది. బుధవారం ఉదయం నుంచి ఎన్నికల సరంజామా తీసుకుని రాత్రికి ఆయా గ్రామాలకు సిబ్బంది చేరుకోవాల్సి ఉంది. డివిజన్ బెంచ్ లో హౌస్ మోషన్ దాఖలు చేయడం, దాన్ని పరిశీలించి ఆదేశాలు ఇవ్వడం చకచకా జరిగిపోవాల్సి ఉంది. లేనిపక్షంలో రేపు సిబ్బంది విధుల నిర్వహణకు కోర్టు ఆదేశాలు అడ్డు రానున్నాయి. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా సిబ్బంది. ఎన్నికల ప్రక్రియ నిర్వహించకూడదు. అలా చేస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన అప్పీలును పరిశీలించి అర్ధరాత్రి తరువాత అర్దర్ఇస్తే ఉదయం నుంచి ప్రక్రియ మొదలు పెట్టొచ్చు డివిజన్ బెంచ్ లో హౌస్ మోషన్ దాఖలు చేసేందుకు రాత్రి 11 గంటల వరకు ప్రధాన న్యాయమూర్తి నుంచి అనుమతి రాలేదు. దీంతో ఎస్ఇసి తరుపు న్యాయవాదులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అప్పీలుకు వెళుతున్న నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై అన్ని జిల్లాల అధికారులకు తదుపరి ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. అప్పీలుకు వెళితే డివిజన్ బెంచ్ ఆదేశాల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. అప్పటి వరకూ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలా? వద్దా? అనే అంశంపై జిల్లా అధికారుల్లో గందరగోళం నెలకొంది. గతంలో వచ్చిన ఆదేశాల ప్రకారం ప్రక్రియ చేపడతామని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు స్పష్టంగా వచ్చే వరకూ ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అతి తక్కువ సమయం కావడంతో సిబ్బంది పైనా మానసికంగా ఒత్తిడి పెరుగుతోంది. అసలు ఎన్నికలు జరుగుతాయా ? జరగవా? అనేది డివిజేన్  బెంచ్ ఆదేశాలపై ఆధారపడి ఉంది.



0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top