డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. కరోనా ప్రభావం తగ్గి అన్ లాక్ ప్రారంభమైన నాటి నుంచి సంస్థ వరుసగా జాబ్స్ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. తాజాగా జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 22, ఏప్రిల్ 23న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు ఆ తేదీన ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ తో పాటు వివిధ ఒరిజినల్ సర్టిఫికేట్లను వెంట తీసుకురావాల్సి ఉంటుంది అయితే ఈ ఉద్యోగాలను పూర్తిగా తాత్కాలిక పద్ధతితోనే భర్తీ చేస్తున్నారు.
అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనకుంటున్న అభ్యర్థులు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెక్రో బయోలజీ, బయో టెక్నాలజీ తదితర సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి. గేట్/నెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. వయస్సు గరిష్టంగా 28 ఏళ్లు ఉండాలి.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 22, 23 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. అప్లికేషన్ Appendix 'A' ప్రకారం పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫామ్ ను టైప్ చేయించాలి. ఆ ఫామ్ తో పాటు అటెస్ట్ చేసిన మార్క్ షీట్లు/సర్టిఫికేట్లు/కుల ధ్రువీకరణ సర్టిఫికేట్లు/అనుభవం ధ్రుపత్రాలను ఇంటర్వ్యూ సమయంలో వెంట తీసుకురావాల్సి ఉంటుంది. Director, CFEES, Brig. S. K. Mazumdar Marg, Delhi-110054 పేరు మీద రూ. 10 విలువైన పోస్టల్ ఆర్డర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఈ పేమెంట్ లో మినహాయింపు ఉంటుంది.
Official Website-Direct Link
Notification-Direct Link
పబ్లిక్, ప్రభుత్వ రంగంలో పని చేసే వారు సంబంధిత మేనేజ్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అయితే తాత్కాలిక పద్ధతిలోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు Centre for Fire, Explosive & Environment Safety, Brig. S. K. Mazumdar Marg, Timarpur, Delhi-110054 ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
0 comments:
Post a comment