AP Sarkar gives good news to volunteers
వాలంటీర్లకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్
ఉగాది రోజున ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పేరిట మూడు కేటగిరీలుగా వార్డు, గ్రామ వార్డు వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం సత్కరించనుంది. సేవా వజ్రకు రూ. 30 వేల నగదు, సేవా రత్నకు రూ. 20 వేలు, సేవా మిత్రకు రూ. 10 వేల నగదు పురస్కారాన్ని, శాలువాతో ఏపీ ప్రభుత్వం సత్కరించనుంది. సత్కారానికి నవరత్నాల అమలులో చూపిన చొరవ, కోవిడ్, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అందించిన సేవలను పరిగణనలోకి తీసుకోనున్న ప్రభుత్వం... ఏప్రిల్ 13 తేదీన వార్డు, గ్రామ వాలంటీర్లను సత్కరించే కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించింది.
ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయంతో వాలంటీర్లలో నూతన ఉత్సాహం నెలకొంది. కాగా..తమ జీతాలు పెంచాలని కొన్ని జిల్లాల్లో వలంటీర్లు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వాలంటీర్ల పనితీరును బట్టి సత్కరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
0 comments:
Post a comment