ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్.. కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ పంజా విసురుతోంది.. ఇప్పటికే పలు దేశాల్లో కోవిడ్ సెకండ్‌వేవ్‌లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు.. మృతుల సంఖ్య కూడా కొత్త రికార్డులు సృష్టించి.. ఇప్పుడు.. భారత్‌లోనూ కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది... దీనిపి తాజాగా ఓ అంచనాకు వచ్చిన శాస్త్రవేత్తలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.. ఈ నెల మధ్య వరకు కరోనా కొత్త కేసుల సంఖ్య తారా స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే, వచ్చే నెల (మే నెల) చివరి వరకు కోవిడ్ కొత్త కేసుల సంఖ్య తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కోవిడ్ తాజా పరిస్థితిపై అంచనా వేసిన సూత్ర అనే గణిత విశ్లేషణ సంస్థ...
ఈ మేరకు వెల్లడించింది.
అయితే, భారత్‌లో కరోనావైరస్ ప్రవేశించిన తర్వాత.. మొదట కరోనా వైరస్ కేసులు, వ్యాప్తిపై కూడా 'సూత్ర' గతంలో ఓ నివేదిక ఇచ్చింది.. తొలి రిపోర్ట్‌లో ఆగస్టు నెలలో కేసులు పెరిగి సెప్టెంబర్ వరకు తారాస్థాయికి చేరుకుంటాయని.. ఆ తర్వాత 2021 ఫిబ్రవరిలో కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుతాయని ఆదిలోనే అంచనా వేసింది. ఇక, ఇప్పుడు కూడా.. ఏప్రిల్ 15 నుంచి 20 నాటికి కేసులు సంఖ్య గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని వెల్లడించింది సూత్ర.. అదే వేగంగా మే చివరి నాటికి కొత్త కేసులు తగ్గిపోయని పేర్కొంది. దీంతో.. ఇప్పటికే భారీగా కోవిడ్ కేసులు నమోదు అవుతుండగా.. ఆ సంఖ్య మరింత పెరుగుతోందన్న అంచనాలు కలవరపెడుతున్నాయి.
0 comments:
Post a comment