Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Tuesday, 27 April 2021

Acidity - అసిడిటీని తరిమికొట్టండిలా

 

ఎసిడిటీ సమస్యతో సతమతమయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆహారం తీసుకున్న వెంటనే కడుపులో మంటగా అనిపంచడం, పుల్లటి తేనుపులు రావడం, గుండె బరువుగా అనిపించడం, వికారం వంటివన్నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలే. ఇది పెద్ద సమస్యే కానేకాదు అన్నట్టు కొంతమంది వ్యవహరిస్తుంటారు. కానీ గ్యాస్ ట్రబుల్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీవన విధానంతోపాటు ఆహార అలవాట్లులో స్వల్ప మార్పులు చేసుకుంటే ఎసిడిటీకి గుడ్‌బై చెప్పేయవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. ఇంతకీ గ్యాస్ ట్రబుల్‌ సమస్యను ఎలా గుర్తించాలి? ఎసిడిటీ రావడానికి ముఖ్యమైన కారణాలేవి? ఎసిడిటీ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?



వంటి కనీస అంశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం తీసుకున్న కొన్ని గంటలకు వికారంగా అనిపించినా, తల తిరుగుతున్నట్టు అనిపించినా, వామ్టింగ్ సెన్సేషన్ కలిగినా.. అది గ్రాస్ట్రిక్ ట్రబులే. ఎక్కువగా చెమటలు పడుతున్నా, గుండెల్లో మంట అనిపించినా జీర్ణ సమస్యలు తరచూ కనిపిస్తున్నా, మలబద్ధకం సమస్య ఉన్నా..

ఇవన్నీ ఎసిడిటీ లక్షణాలే. ఈ లక్షణాలు దీర్ఘకాలం ఉంటే తీవ్రమైన ఎసిడిటీగా భావించి కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. ఆహారం తీసుకున్న వెంటనే పడుకుంటే ఎసిడిటీ సమస్య కచ్చితంగా వస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అలాగే..

అధిక బరువు ఉన్నా, ఆల్కాహాల్ తాగుతున్నా, సిగరెట్ అలవాటు ఉన్నా గ్రాస్ ట్రబుల్ సమస్య ఉత్పత్పమవుతుందట. మసాలా దట్టించిన స్పైసీ ఫుడ్ తిన్నా, రోజుకు మోతాదుకు మించి కాఫీ, టీలు తాగినా ఎసిడిటీ ప్రారంభమవుతుందట. నిద్ర పోయే ముందు ఆహారం తీసుకునే వారిలో యాసిడ్‌ ఎక్కువగా ఉత్పత్తి అయి ఎసిడిటీ సమస్యలు వస్తాయట. ఎసిడిటీ సమస్య రాకూడదన్నా లేక వచ్చిన వారైనా చిన్నచిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి.

ఆహారాన్ని నెమ్మదిగా, పూర్తిగా నములుతూ నిదానంగా తినాలి. నీరు ఎక్కువగా తాగాలి. రాత్రిళ్లు డిన్నర్ ముగిసిన వెంటనే వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. శరీర బరువును అదుపులో పెట్టుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ మానేయాలి. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాలి.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top