Total vacancies 3,479: Plan for recruitment of teacher posts in Ekalavya Model schools
మొత్తం ఖాళీలు 3,479: ఏకలవ్య మోడల్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రణాళిక!
న్యూఢిల్లీ: 17 రాష్ట్రాల్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న 3,479 బోధనా సిబ్బంది భర్తీకి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికోసం ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
...ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీలకు సంబంధించిన 4 వేర్వేరు పోస్టులలోని బోధనా సిబ్బందిని ప్రవేశపరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే టీజీటీలకు మినహా మిగతా సిబ్బందికి ఇంటర్వ్యూలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. ఏపీలో 14 ప్రిన్సిపాల్, 6 వైస్ ప్రిన్సిపాల్, 97 టీజీటీలతో కలపి మొత్తం 117 ఖాళీలు ఉన్నాయని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో 11 ప్రిన్సి పాల్, 6 వైస్ ప్రిన్సిపాల్, 77 పీజీటీ, 168 టీజీటీలతో కలిపి మొత్తం 262 పోస్టుల భర్తీ జరుగనుంది.
జూన్ తొలివారంలో ప్రవేశ పరీక్షలు
దరఖాస్తులను స్వీకరించడానికి పోర్టల్‌ను ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30వ తేదీ మధ్య అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. ప్రవేశ పరీక్షలను తాత్కాలికంగా జూన్ మొదటి వారంలో షెడ్యూల్ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న 288 పాఠశాలలున్నాయి. 452 కొత్త పాఠశాలను ఏర్పాటు చేసిన తర్వాత వాటిసంఖ్య 740కి చేరనుంది. ఇందులో 100 పాఠశాలలను ప్రారంభించేందుకు రాష్ట్రాలు సమర్పించిన ప్రతిపాదనలు దాదాపు ఖరారయ్యాయని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ తెలిపింది.
Ministry of Tribal Affairs Recruitment 2021 Selection Criteria
The selection of the candidates will be done on the basis of a computer-based test followed by an interview.
Download Ministry of Tribal Affairs Recruitment 2021 Notification PDF
What is the eligibility and age
ReplyDeleteReply
ReplyDelete