Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 11 April 2021

వందల ఏళ్ల కిందటే..తెలుగు గడ్డపై ఆస్పత్రులు అంటువ్యాధుల నిర్మూలన పద్ధతులు కూడా 1700 ఏళ్ల క్రితమే 'విగత జ్వరాలయం' వెయ్యేళ్ల కిందటే సర్జన్‌గా అగ్గలయ్య ఖ్యాతి 8 శతాబ్దాల క్రితం ప్రసూతి వైద్యశాల సేవలు ఫణిగిరిలో బయల్పడ్డ వైద్య శాసనాలు

 

వందల ఏళ్ల కిందటే..తెలుగు గడ్డపై ఆస్పత్రులు

అంటువ్యాధుల నిర్మూలన పద్ధతులు కూడా

1700 ఏళ్ల క్రితమే 'విగత జ్వరాలయం'

వెయ్యేళ్ల కిందటే సర్జన్‌గా అగ్గలయ్య ఖ్యాతి

8 శతాబ్దాల క్రితం ప్రసూతి వైద్యశాల సేవలు

ఫణిగిరిలో బయల్పడ్డ వైద్య శాసనాలు

నందలూరులో అంటువ్యాధుల శాసనం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): పదిహేడొందల ఏళ్ల కిందటే.. జ్వర పీడితుల కోసం ప్రత్యేక ఆస్పత్రి. వెయ్యేళ్ల క్రితమే అందుబాటులో గొప్ప సర్జన్‌. 800 ఏళ్లకు మునుపే ప్రసూతి కోసం ప్రత్యేక దవాఖానాలు. అంటువ్యాధులు ప్రబలితే యుద్ధప్రాతిపదికన నిర్మూలన చర్యలు ప్రారంభించే యంత్రాంగం. పాములు, పశువులకూ సిద్ధ వైద్యం. నయాపైసా ఫీజు లేకుండా..

రాజపోషణతోనే ప్రజలకు వైద్య సేవలు. ఇదీ.. తెలుగు గడ్డ గొప్పదనం. అల్లసాని వారి జిగిబిగి పద్యాల్లో గంధర్వుడైన ఇందీవరాక్షుడు.. అష్టాంగాలైన ఆయుర్వేదాన్ని అభ్యసించేందుకు ''తండ్రీ నాకుననుగ్రహింపగదే వైద్యంబంచు'' అంటూ బ్రహ్మమిత్రుడి వద్ద పడే తపన వంటివన్నీ కథలు కావని, ఆ కాలంలోనే గొప్ప వైద్య సేవలు ఉచితంగా అందేవనడానికి నిదర్శనాలుగా నిలిచిన శాసనాలు కోకొల్లలు. తెలుగు రాష్ట్రాల్లో అలనాటి వైద్య సంపత్తిపై 'ఆంధ్రజ్యోతి' ప్రత్యేక కథనం..!


తొలి ప్రసూతి ఆస్పత్రి


ఆధునిక వైద్య సేవలెన్ని అందుబాటులోకి వచ్చినా.. ప్రసవ సమయంలో సరైన వైద్యం అందక ఈరోజుల్లో మాతాశిశు మరణాలకు అడ్డుకట్ట పడడం లేదు. కానీ, కాకతీయుల కాలంలో మాతాశిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ప్రసూతి వైద్యశాలలు కట్టించారు. గుంటూరు జిల్లా తుళ్లూరుకు 9 కిలోమీటర్ల దూరంలోని మల్కాపురంలో 13వ శతాబ్దంలో ప్రసూతి ఆస్పత్రి, సాధారణ దవాఖానాలు కొనసాగేవని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు ఆ ఆస్పత్రుల పోషణ కోసం రెండేసి పుట్ల భూమి (సుమారు 40 ఎకరాలు) దానమిచ్చినట్లు మల్కాపురం పరిసరాల్లోని పాత శివాలయం వద్ద.. నల్లరాతి స్తంభంపై సంస్కృతంలో ఓ శాసనం ఉంది. ఇక్కడి సాధారణ దవాఖానాలో పంచకర్మ చికిత్సలు చేసేవారని 'ఆయుర్వేద ఇతిహాసం'లో పరిశోధకుడు వేటూరి శంకరశాస్త్రి వెల్లడించారు. తెలుగునాట ఇదే మొట్టమొదటి ప్రసూతి ఆస్పత్రి అయ్యి ఉంటుందని ఆయన ఆ పుస్తకంలో పేర్కొన్నారు.


అంటువ్యాధులు ప్రబలితే..?


కొవిడ్‌ మహమ్మారితో ఇప్పుడు ప్రపంచమంతా వణికిపోతోంది. అయితే.. 900 ఏళ్ల క్రితం అప్పటి వైద్యుల్లో అంటువ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ ఉండేది. కడప జిల్లా నందూలూరు గ్రామంలో క్రీ.శ 1191లో విష జ్వరాలు మృత్యుకేళీ సాగిస్తున్నప్పుడు.. గ్రామస్థులంతా ఊరికి దూరంగా గుడిసెలు వేసుకుని ఉన్నారు. ఈ విషయాన్ని చోళరాజు కుళోత్తుంగ చోళుడి కాలం నాటి శాసనంలో ప్రస్తావించారు. అంటువ్యాధులు ప్రబలితే.. అప్పటి రాజులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించి, కొత్త గూడేలు నిర్మించేవారు.


అగ్గలయ్య శస్త్ర చికిత్సలు


వెయ్యేళ్ల కిందటే ఆయుర్వేద శాస్త్ర పద్ధతుల్లో శస్త్రచికిత్సలు చేసి, ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఘనత జైన మతస్థుడు అగ్గలయ్య సొంతం. చాళుక్య రాజు రెండో జయసింహుడి ఆస్థాన వైద్యుడిగా అగ్గలయ్యకు గుర్తింపు ఉంది. జయసింహుడి ఏలిక(క్రీ.శ 1015-1042)లో అగ్గలయ్య ఔన్నత్యాన్ని వివరించే శాసనం నల్గొండ జిల్లా సైదాపురంలో ఉంది. ఈ శాసనాన్ని ముప్ఫై ఏళ్ల కిందట ప్రముఖ చరిత్ర పరిశోధకుడు పీవీ పరబ్రహ్మశాస్త్రి పరిష్కరించారు. మొండి వ్యాధులను సైతం ఇట్టే నయం చేసే అగ్గలయ్యకు వైద్యరత్నాకర, నరవైద్య, ప్రాణాచార్య బిరుదులు ఉండేవని ఆయన వెల్లడించారు. ఉమాతంత్రం, సంగ్రహ పరిచ్ఛేదనంలో అగ్గలయ్య సిద్ధహస్తుడని ఆ శాసనం చెబుతోంది.


అభ్యంగనంతో ఆరోగ్యం..


ఆయుర్వేద చికిత్సలో 'అభ్యంగన' విధానానికి క్రీ.శ 12వ శతాబ్దం నుంచే ప్రాముఖ్యత ఉందనడానికి ద్రాక్షారామ శాసనం నిదర్శనం. వేటూరి శంకరశాస్త్రి తన 'ఆయుర్వేద ఇతిహాసం'లో ఈ విషయం తెలిరు. క్రీ.శ ఆరో శతాబ్దానికి చెందిన సిద్ధ నాగార్జునుడు కంటి వ్యాధుల ఔషధాన్ని రూపొందించినట్లు పాటలీపుత్రం గదనిగ్రహకారుడు రచించిన 'గదనిగ్రహ'లో ప్రస్తావించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. సిద్ధ నాగార్జున వర్తి నేత్ర ఔషధం ఇప్పటికీ కంటి చికిత్సలో వాడుతున్నట్లు వైద్య విజ్ఞాన వారసత్వ కేంద్రం పరిశోధకుడు తిగుళ్ల సాకేత్‌రామ్‌ వివరిస్తున్నారు. నాగార్జున కొండ ప్రాంతంలో 'విగత జ్వరాలయం' పేరుతో జ్వరపీడితులకు ప్రత్యేక విహార క్షేత్రం క్రీ.శ రెండు లేదా మూడో శతాబ్దంలో ఉండేదని వెల్లడించారు.


పరహితులు.. అన్నవరం


ఈ రోజుల్లో లక్షలు ఖర్చుపెట్టి వైద్యవిద్యను అభ్యసించి, కోట్ల రూపాయలు గడించడమే చాలామంది లక్ష్యంగా మారింది. కానీ.. కొన్ని వందల ఏళ్ల కిందట తాము వైద్య విద్యను పరోపకారానికి మాత్రమే ఉపయోగించేవారనడానికి 'పరహితులు' వంశం ఒక ఉదాహరణ. దవడలో కప్ప ఎముక గుచ్చుకొని బాధపడుతున్న పాముకి చికిత్స చేసి కాపాడిన కృపాళువు అనే ధన్వంతరికి.. పరహితుడు అనే బిరుదు వచ్చినట్లు జయంతి రామయ్య పంతులు తన రచనలో పేర్కొన్నారు. పరహితుల వంశానికి చెందిన కాళనాథ భట్టు పుత్రుడికి క్రీశ 1423లో కలువచేరు గ్రామాన్ని అనితల్లి అనే ఆమె దానమిచ్చినట్లు కలువచేరు శాసనం ద్వారా వెల్లడైంది. కలువచేరు ఆతర్వాత అనితల్లిగానూ.. ప్రస్తుతం అన్నవరం పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.


వివిధ శాసనాల్లోని వైద్యుల ప్రస్తావన..

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top