WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... మీ ఛాట్స్‌కి పాస్‌వర్డ్ పెట్టుకోవచ్చు
వాట్సప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందించబోతోంది. వాట్సప్‌లోని మీ ఛాట్స్‌కి పాస్‌వర్డ్ పెట్టుకోవచ్చు. మీ ఛాట్స్‌ని బ్యాకప్ చేసినప్పుడు పాస్‌వర్డ్ సెట్ చేయాలి. మళ్లీ మీరు ఆ ఛాట్స్ రీస్టోరే చేయాలనుకుంటే పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సప్ బీటా యూజర్లు టెస్ట్ చేస్తున్నట్టు WABetaInfo సమాచారం ఇచ్చింది. ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ని కూడా షేర్ చేసింది. వాట్సప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్‌కి ఈ ఫీచర్ పనిచేస్తుంది. ప్రస్తుతం వాట్సప్‌లోని ఛాట్స్ బ్యాకప్ చేస్తే గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ అవుతుంది. దీనికి ఎలాంటి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేదు. ముఖ్యమైన ఛాట్స్ బ్యాకప్ చేయాలనుకునేవారి కోసం పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ తీసుకొస్తోంది వాట్సప్.
పాస్‌వర్డ్ సెట్ చేస్తే ఆ ఛాట్స్‌ని రీస్టోర్ చేయాలంటే పాస్‌వర్డ్ తప్పనిసరి.
వాట్సప్ ఛాట్స్ బ్యాకప్‌కి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఫీచర్ ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మీరు బీటా యూజర్ అయితే మీ వాట్సప్ యాప్ అప్‌డేట్ చేసి ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. బీటా యూజర్లు విజయవంతంగా పరీక్షించిన తర్వాత మిగతా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
ఇవే కాదు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ని వాట్సప్ అందించబోతోంది. ఇప్పటికే ఉన్న డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ టైమర్‌ని మార్చబోతోంది. ప్రస్తుతం వారం రోజులు మాత్రమే టైమ్ సెట్ చేయొచ్చు. వాట్సప్ 24 గంటల ఫీచర్‌ని టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ఆన్ చేస్తే వాట్సప్‌లోని మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతాయి. ప్రస్తుతం వారం రోజుల పాత మెసేజెస్ డిలిట్ అవుతాయి. త్వరలో 24 గంటల్లోనే పాత మెసేజెస్ డిలిట్ చేయొచ్చు.
మరోవైపు సెల్ఫ్ డిస్‌స్ట్రక్టింగ్ ఫోటోస్ ఫీచర్‌ని కూడా పరీక్షిస్తోంది వాట్సప్. ఫోటోలు ఆటోమెటిక్‌గా డిలిట్ అయ్యేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సప్‌లో వచ్చే ఫార్వర్డ్ ఇమేజెస్, ఫోటోస్ యూజర్లకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. వాటిని డిలిట్ చేసేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ సెల్ఫ్ డిస్‌స్ట్రక్టింగ్ ఫోటోస్ ఫీచర్ వస్తే మీరు సెట్ చేసిన సమయానికి ఆ ఫోటోలు డిలిట్ అవుతాయి.
0 Comments:
Post a Comment