ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకల్లో ఫొటో షూట్లకు ఎక్కువ ప్రిపరేన్స్ ఇస్తున్నారు. చాలా స్పెషల్‌గా, కొత్తగా ఫొటో షూట్‌ను డిజైన్ చేసేందుకు భారీగానే ఖర్చు చేసే కూడా ఉన్నారు. ఇలాంటి కొన్ని ఫొటో షూట్లు వైరల్‌గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా లాహోర్‌లోని ఓ జంట తమ పెళ్లి ఫొటో షూట్లో సింహం పిల్లను వాడుకున్నారు. మత్తు ఎక్కించిన సింహం పిల్లతో ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఆ జంటపై పెద్ద ఎత్తున విర్శలు వెల్లువెత్తాయి. పలువురు జంతు ప్రేమికులు ఈ ఫొటోషూట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు జంతువుల ఆరోగ్యం, చికిత్సపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ ఫొటోలు, వీడియోల్లో.. సింహం పిల్ల నేలపై నిద్రపోతున్నట్టుగా ఉన్న సింహం పిల్లతో కలిసి ఆ జంట కనిపించింది. ఇక, పాకిస్తాన్‌కు చెందిన save the wild అనే స్వచ్ఛంద సంస్థ దేశంలోని వన్యప్రాణులను రక్షించడానికి పనిచేస్తోంది. ఆ నూతన దంపతుల ఫొటోషూట్‌కు సంబంధించిన చిన్నపాటి వీడియోను ఈ సంస్థ సోషల్ మీడియోలో షేర్ చేసింది. "వేడుకల కోసం సింహం పిల్లను అనుమతి ఇవ్వడానికి @PunjabWildlife మీకు అనుమతి ఉందా?. పాపం ఆ సింహం పిల్లకు మత్తు ఇచ్చా.. అలా బాధించడం చూడండి. ఈ ఘటన లాహోర్‌లోని స్టూడియోలో చోటుచేసుకుంది. దయచేసి ఆ సింహం పిల్లని రక్షించండి" అంటూ సేవ్ ది వైల్డ్ సంస్థ ట్వీట్ చేసింది.
Studio Afza అనే స్టూడియో ఈ ఫొటోలను షేర్ చేసినట్టుగా తెలుస్తోంది. దానికి ఇన్‌స్టాగ్రామ్‌లో 1,20,000 ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆ ఫొటోలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ఆ ఫొటోలను సోషల్ మీడియో నుంచి తొలగించింది.
ఈ ఘటనకు సంబంధించి JFK animal Rescue వ్యవస్థాపకుడు జుల్ఫిషన్ అనుషే ది ఇండిపెండెంట్‌తో మాట్లాడుతూ.. "వారి స్నేహితుడు ఒకరు అతడు పెంచుకుంటున్న సింహం పిల్లని అక్కడికి తీసుకొచ్చినట్టు ఆ స్టూడియో నిర్వాహకులు తెలిపారు. అయితే ఆ సమయంలో కొత్త పెళ్లి జంట కూడా అక్కడే ఉండటంతో వారు కూడా దానితో ఫొటోలు దిగాలని నిర్ణయించుకున్నారు" అని తెలిపారు.
0 comments:
Post a comment