Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Friday, 26 March 2021

Vaccination for Children: పిల్లలకు కూడా కరోనా వ్యాక్సినేషన్ అవసరమా? ఎప్పుడు వేయించాలి?

 Explainer- Vaccination for Children: పిల్లలకు కూడా కరోనా వ్యాక్సినేషన్ అవసరమా? ఎప్పుడు వేయించాలి?

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మన దేశంలో వేగంగా కొనసాగుతోంది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ల పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. మరో నెల లేదా రెండు నెలల సమయంలో ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చే వీలుండొచ్చు. కానీ పిల్లలకు ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం సరైనదేనా? అని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. దీనికి సమాధానమిస్తూ ప్రముఖ పిడియాట్రిషియన్, పిడియాట్రిక్ ఇన్ఫెక్షియస్ డిజీజెస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. జేమ్స్ వుడ్ తల్లిదండ్రులకు సలహాలు అందించారు. పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ అవసరమే అని జేమ్స్ వుడ్ వెల్లడించారు. చాలా అధ్యయనాలు కరోనా పిల్లల్లో ఎక్కువగా వ్యాపించట్లేదని.. ముఖ్యంగా వయసు తక్కువగా ఉన్న పిల్లలకు దీని ముప్పు చాలా తక్కువగా ఉందని వెల్లడించాయి.
కానీ దీని అర్థం వారిలో కరోనా అస్సలు రాదని అర్థం కాదు. పన్నెండేళ్ల కంటే చిన్న పిల్లల్లో కరోనా వచ్చినా లక్షణాలు ఎక్కువగా కనిపించవు. టీనేజర్లకు కూడా లక్షణాలు కనిపించినా అవి పెద్దవారితో పోల్చితే తక్కువేనని చెప్పుకోవాలి. ఐదు నుంచి పదకొండేళ్ల వారితో పోల్చితే టీనేజ్ వారిలో కరోనా వచ్చే అవకాశాలు రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయట. అయితే ఇలా పిల్లల్లో లక్షణాలు కనిపించకపోవడానికి కారణమేంటో ఇంకా నిపుణులకు కూడా అర్థం కాలేదు.

చిన్న పిల్లల కంటే టీనేజీలో ఉన్నవారు స్నేహితులతో ఎక్కువగా కలిసి బయటకు వెళ్లేందుకు ఆసక్తిచూపడం, మాస్క్ లు ధరించేందుకు ఆసక్తి చూపకపోవడం వంటివి చిన్న పిల్లల కంటే టీనేజర్లలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండేందుకు కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో పాటు పిల్లలు బయట ఆడుకోవడం వల్ల వారికి నాన్ SARS-CoV-2 రకం వైరస్ ల వ్యాప్తి కామన్ గా ఉంటుంది. దీంతో వారిలో పెరిగిన యాండీబాడీల వల్ల కరోనా రావడం వారిలో తక్కువగా ఉంటుందని వారు అంటున్నారు. అయితే ఇవన్నీ వారి అంచనాలే కానీ నిజాలు కాదు. ఇవి ఇంకా నిరూపితం కావాల్సిన అవసరం ఉంది. అయితే పిల్లల్లో లక్షణాలు తక్కువగానే ఉన్నా కరోనా వస్తే తీవ్రత మాత్రం వారిలో ఎక్కువగానే ఉంటోందట. అందుకే వారికి వ్యాక్సిన్ వేయించడంతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ లు ధరించేలా వారిని ప్రోత్సహించడం వల్ల కరోనా ముప్పును తగ్గించుకోవచ్చు.

ప్రస్తుతం అన్ని స్కూళ్లలోనూ మాస్క్ ధరించడం, దూరంగా ఉండడం తప్పనిసరిగా మారింది. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా వారు చదువుకునేందుకు వీలు పడుతోంది. అయితే జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు కూడా కరోనా బారిన పడే అవకాశాలు.. పెద్దవాళ్లకు అది సోకే ప్రమాదాలు కూడా ఉన్నాయట. అందుకే అందరూ వ్యాక్సీన్ వేసుకునేవరకూ ఇలా మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరి అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత పెద్దవారిదే. ఇప్పటివరకు కేవలం అమెరికాలోనే ఫైబర్ వ్యాక్సీన్ ని 16 ఏళ్ల వయసున్నవారికి అందిస్తున్నారు.

పిల్లలకు ఈ వ్యాక్సీన్ ని అందించే కంటే ముందే వ్యాక్సీన్ ప్రభావం వారిలో ఎలా ఉంటుందన్న దానిపై అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న అన్ని వ్యాక్సీన్ సంస్థలు తమ వ్యాక్సీన్లను పెద్దవారిపైనే ప్రయోగాలు నిర్వహించాయి. ప్రస్తుతం 16 సంవత్సరాల వారికి దీన్ని అందించి అది సేఫ్ అని తేలితేనే 12 సంవత్సరాల లోపు పిల్లలకు అందించడం మంచిది. దీన్ని బట్టి గమనిస్తే ఈ సంవత్సరాంతం లేదా వచ్చే సంవత్సరం ప్రారంభం వరకూ పిల్లలకు వ్యాక్సీన్ అందుబాటులోకి రాకపోవచ్చు. మొడెర్నా సంస్థ ఇప్పటికే 6 నుంచి 11 సంవత్సరాల పిల్లలపై తమ వ్యాక్సీన్ ని ప్రయోగించి చూస్తోంది. అన్ని వ్యాక్సీన్ సంస్థలు ఆ స్థాయికి చేరుకొని ట్రయల్స్ పూర్తి చేయడానికి కనీసం సంవత్సరం పట్టవచ్చు.

కరోనా వ్యాక్సీన్ విషయంలో పెద్దలకు, చిన్న పిల్లలకు అదే వ్యాక్సీన్ ని ఉపయోగించవచ్చు. కానీ వారికి డోసేజ్ లో మార్పు ఉండే వీలుండవచ్చు. ఈ వ్యాక్సీన్ ట్రయల్స్ లో ఎవరికి ఎంత డోస్ అవసరం అన్న విషయం గుర్తించాల్సి ఉంటుంది. ఈ ట్రయల్స్ లో వీలైనంత తక్కువ డోస్ ఇస్తూ ఎక్కువ యాంటీబాడీలు విడుదలయ్యేలా కంపెనీలు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఉదాహరణకు మొడెర్నా పెద్దవాళ్లకు వంద మైక్రోగ్రాముల డోస్ ఇస్తోంది. పిల్లల విషయంలో రెండేళ్ల కంటే చిన్న వారికి 25, 50, 100 మైక్రోగ్రాములు ఇచ్చి టెస్ట్ చేస్తుండగా.. రెండేళ్ల కంటే పెద్ద వారికి 50, 100 మైక్రోగ్రాముల డోస్ ఇచ్చి ప్రయత్నిస్తున్నారు.

ఇందులో భాగంగా సరైన డోసేజ్ ఏంటనేది కంపెనీ నిర్ధారిస్తుంది. అప్పటివరకూ పిల్లలను వేరే వారి ఇంటికి తీసుకెళ్లడం, వారి ఇంట్లో పిల్లలతో ఆడుకోనివ్వడం వంటివి చేయడం వల్ల వైరస్ ముప్పు పెరిగే ప్రమాదం ఉంటుంది. దీని బదులు వారిని మాస్కులు పెట్టుకునేలా చేసి ఆ తర్వాత ఆడనివ్వడమో లేక అవుట్ డోర్ ఆటలైన క్రికెట్, ఫుట్ బాల్, సైకిల్ పోటీలు వంటివి ఆడేలా చేయడం వల్ల కరోనా ప్రమాదాన్ని తగ్గించిన వారవుతారు.


0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top