కరోనా ఎఫెక్ట్‌తో చాలా కాలం స్కూళ్లు మూతపబడ్డాయి.. ప్రత్యామ్నాయంగా.. ఆన్లైన్ విద్యకు మొగ్గు చూపారు.. ఇక, కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి కాలేజీలు, స్కూల్లు ప్రారంభం అయ్యాయి.. కానీ, మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు ఇప్పుడు కొత్త టెన్షన్ పెడుతున్నాయి.. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలను కూడా ఇప్పుడు కోవిడ్ వెంటాడుతోంది. దీంతో దీనికి సంబంధించి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. మన రాష్ట్రం పక్కన ఉన్న మహారాష్ట్రలో కేసులు భయంకరముగా పెరుగుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా మర్చిపోయే టైంకి మళ్ళీ కేసులు పెరుగుతున్నాయన్న ఆయన మన దేశంలో సెకండ్ వేవ్ రాలేదు...
ఇప్పుడే అందుకుందని అన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి వైద్య శాఖ గట్టిగా పనిచేస్తుందన్న ఆయన స్కూల్ లలో కరోనా కేసులతో భయపడుతున్నారని, కొనసాగించడమా... లేదా అనేది రెండు మూడు రోజుల్లో అసెంబ్లీ లో స్టేట్మెంట్ ఇస్తానని చెప్పుకొచ్చారు.
0 comments:
Post a comment