TS ఎంసెట్ షెడ్యూల్ ఖరారు... జులై 5 నుండి 9 వరకు ఎంట్రెన్స్
ఎంసెట్ షెడ్యూల్ ఖరారైంది. జులై 5 నుండి 9 వరకు ఎంసెట్ ఎంట్రెన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 18 న నోటిఫికేషన్ ఇవ్వనుండగా... ఈ నెల 20 నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 18 దరఖాస్తుకు చివరి తేదీ. 5 వేల లేట్ ఫీ తో జూన్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సారి ఇంటర్ ప్రథమ సంవత్సరం మొత్తం సిలబస్, ద్వితీయ సంవత్సరం 70 శాతం సిలబస్ తోనే ఎంసెట్ ఎంట్రెన్స్ జరగనుంది. జులై 3 న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నేపథ్యంలో ఎంసెట్ లో మొదట జులై 5,6 తేదీల్లో అగ్రికల్చర్ స్ట్రీమ్ ..జులై 7,8,9 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంట్రెన్స్ టెస్ట్ జరగనుంది. సిలబస్ తగ్గించిన నేపథ్యంలో పరీక్ష విధానం లో మార్పులు చేయొద్దని సెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది తెలంగాణ లో పరీక్ష కేంద్రాలు పెరిగాయి. అయితే ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నాం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఓసి, బీసీ లకు 800 రూపాయలు...ఎస్సి ఎస్టీ లకు 400 రూపాయల పరీక్ష ఫీ ఉంటుంది.
0 comments:
Post a comment