Nitin Gadkari : టోల్ గేట్స్ పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కీలక ప్రకటన చేశారు. దేశంలో ఎక్కడా టోల్ గేట్స్ ఉండవని ప్రకటించారు. వచ్చే ఏడాదిలోపు..ఇది జరుగుతుందని, టోల్ వసూలు చేయరని..వాహనాన్ని జీపీఎస్ సిస్టం ఏర్పాటు చేస్తారు..దీని ద్వారా టోల్ వసూలు చేస్తారు. పార్లమెంట్ లో టోల్ ప్లాజాలపై సభ్యులు పలు ప్రశ్నలు వేశారు. దీనికి మంత్రి గడ్కరి సమాధానం ఇచ్చారు.
గత ప్రభుత్వాలు అన్యాయంగా..పట్టణ ప్రాంతాల్లో టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారని, టోల్ ప్లాజాలు తీసివేయడం ద్వారా..జాతీయ రహదారులపై ప్రయాణం సాఫీగా సాగుతుందని, వాహనాలను ఎవరూ ఆపేవారుండరు..దీంతో సమయం ఆదా కానుంది. రోడ్లపై కెమెరాలు ఏర్పాటు చేస్తారు..జీపీఎస్ సిస్టం..ద్వారా వాహనాన్ని ఫొటో తీస్తుంది.
జాతీయ రహదారిపై వెళ్లే వాహనానికి ఆటోమెటిక్ గా పన్ను పడనుంది. ప్రస్తుతం జాతీయ రహదారులపై ఫాస్టాగ్ సిస్టం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఫాస్టాగ్ ద్వారా..టోల్ ప్లాజాల వద్ద…భారీ క్యూ లైన్ లేకుండా..దోహదపడనుంది. ఈ సిస్టం ద్వారా..రోజు వంద కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఫాస్ట్‌టాగ్ వాడకం గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా ఈ మధ్య వస్తున్న ప్యాసింజర్, కమర్షియల్ వెహికిల్స్ దాదాపుగా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ తో ఉన్నవనే సంగతి తెలిసిందే.
0 comments:
Post a comment