SBI Offer on Amazon: ఎస్బీఐ కస్టమర్లకు బంపరాఫర్... అమెజాన్‌లో ఈ మొబైళ్లపై 40 శాతం వరకు డిస్కౌంట్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో బంపరాఫర్‌తో ముందుకొచ్చింది. ప్రముఖ మొబైల్ బ్రాండ్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందజేస్తుంది. అయితే, ఈ ఆఫర్‌ను కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీనికి సంబధించి ఎస్బీఐతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఆఫర్లో భాగంగా ఐఫోన్, శామ్సంగ్, రెడ్మీ, వన్‌ప్లస్, ఒప్పో, వివో, ఎల్జీ, నోకియా వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ఫోన్లను 40 శాతం వరకు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఎస్బీఐ కస్టమర్లు వీటికి అదనంగా 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఒకవేళ, ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో మొబైల్ కొనుగోలు చేస్తే 5 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
అయితే, మీరు ఈ డిస్కౌంట్‌ను పొందడానికి కనీసం రూ .5 వేల లావాదేవీ నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కో కార్డుకు గరిష్ట తగ్గింపు కింద రూ .1,000 డిస్కౌంట్ మాత్రమే లభిస్తుందని గుర్తించుకోవాలి. ఈ ఆఫర్‌ను పొందడానికి ఎస్బీఐ కస్టమర్లు ముందుగా ఎస్బీఐ యోనో యాప్‌లోకి లాగిన్ అయి 'బెస్ట్ ఆఫర్స్' సెక్షన్లోకి వెళ్లాలి. అందులో అమెజాన్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంపిక చేసుకొని అమెజాన్ సైట్లో మీ మొబైల్ కొనుగోలు చేయవచ్చు. ఆఫర్లో భాగంగా ఎస్బీఐ కస్టమర్లకు అమెజాన్ ప్రత్యేకంగా నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది.
ఏ మొబైల్ ఎంతకు లభిస్తుంది?
ఆఫర్లో భాగంగా అమెజాన్ సైట్లో శామ్సంగ్ గెలాక్సీ ఎం 12ను కేవలం రూ .10,999 లకే కొనుగోలు చేయవచ్చు. ఇక, రెడ్మీ నోట్ 10 రూ.11,999, రెడ్మీ 9 రూ.8,799, వన్‌ప్లస్ నార్డ్ 5 జీ రూ.29,999, శామ్సంగ్ గెలాక్సీ ఎం 31 రూ.18,499, రెడ్మీ నోట్ 9 రూ.10,999, రెడ్మీ 9 పవర్ రూ.10,499, శామ్సంగ్ గెలాక్సీ ఎం 51 మొబైల్ రూ.21,749, వన్‌ప్లస్ 8 టి 5 జీ రూ.42,999, ఐఫోన్ మినీ రూ.67,100, శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ఎం02 రూ.8999, రెడ్మీ నోట్9 ప్రో మాక్స్ రూ.14,999, శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ రూ.27,999, ఒప్పో ఎ 31 రూ.9,990, రెడ్మీ నోట్ 9 ప్రో రూ.12,999, రెడ్మీ 9ఎ రూ.6,799, వివో వై 91 రూ.7,490, వివో వై 11 రూ.8,990, ఎల్జీ డబ్ల్యూ 41 రూ.12,990, ఒప్పో ఎ 15 రూ.11,490, శామ్సంగ్ గెలాక్సీ ఎ 12 రూ.12,999, ఒప్పో ఎ 15 రూ.9,990, శామ్సంగ్ గెలాక్సీ ఎం 11 రూ.10,999, ఒప్పో ఎ 11 రూ.8,490, నోకియా 3.4 రూ.11,999, వివో వై 12 రూ.9,990, వివో వై 20 రూ.11,490. ఎంఐ 10 ఐ రూ.21,999, ఒప్పో ఎఫ్ 19 రూ.25,990, శామ్సంగ్ గెలాక్సీ ఎ 32 రూ.21,999, ఒప్పో ఎఫ్ 19 ప్రో రూ.21,490, వివో వి 20 రూ.22,990, వివో వి 20 ఎస్ఈ రూ.19,990, ఒప్పో ఎఫ్ 17 మొబైల్ రూ.16,990, వివో వై 51 రూ.17,990, వివో వై 31 రూ.16,490, ఒప్పో ఎ 52 రూ.14,990, ఒప్పో ఎ 53 రూ.12,990, వివో వై 30 రూ.13,990, ఐఫోన్ 11 ప్రో మాక్స్ రూ.94,900, ఐఫోన్ 12 రూ.1,19,900, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 రూ.81,999, వన్ ప్లస్ 8 ప్రో రూ.54,999, శామ్సంగ్ ఎ 72 రూ.41,999, శామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా రూ.1,04,999, ఎంఐ 10 టి ప్రో రూ.37,999, ఐఫోన్ 12 మినీ రూ.67,100లకు ఆఫర్ కింద కొనుగోలు చేయవచ్చు.
0 comments:
Post a comment