phone overnight Charging : అసలు ఫోన్ ఎప్పుడూ ఛార్జింగ్ చేయాలి? ఉదయమా? రాత్రిపూటా? రాత్రి సమయంలో ఫోన్ ఛార్జింగ్ పెట్టొద్దనడంలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు. ఒక ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతకాలం ఉంటుంది? మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎప్పుడు ఛార్జింగ్ తగ్గిపోతోంది. ఇంతకీ రాత్రిపూట ఛార్జింగ్ పెట్టొచ్చా లేదో తెలుసుకోవాలని ఉందా? సాధారణంగా మీ ఫోన్ పర్పార్మానెన్స్ తెలుసుకోవాలంటే.. సింపుల్ గా *3001#12345#* అని టైపు చేసి డయల్ చేస్తే చాలు.. వెంటనే ఫీల్డ్ మోడల్ డిస్ప్లే అవుతుంది. లోకల్ నెట్ వర్క్‌ల వివరాలతో పాటు సెల్ టవర్ల వివరాలు కూడా తెలుసుకోవచ్చు.
ఫోన్ మేకర్లు ఏమంటున్నారంటే?
ఫోన్ బ్యాటరీ లైఫ్ స్పాన్ విషయంలో మొబైల్ తయారీదారులు ఏమంటున్నారంటే… మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ స్పాన్ అనేది.. అసెంబ్లెడ్ ఎప్పుడు చేశారనేదానిబట్టి ఉండదు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అది అధిక ఉష్టోగ్రతలో హెచ్చుతగ్గుదల కావొచ్చు. లేదంటే మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టే అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. మన ఫోన్లలో ఉండే లిథియం ఐయాన్ బ్యాటరీలన్నీ కెమికల్ ఏజ్ ఉంటుంది. కొంత సమయానికి ఛార్జింగ్ దిగిపోతుంది.
ఆపిల్ ఆన్సర్ ఇదే :
అందుకే ఎక్కువ కాలం ఛార్జింగ్ బ్యాటరీల్లో నిలవదు. కానీ, రాత్రిపూట ఫోన్ ఛార్జింగ్ పెట్టడంలో ఏదైనా పెద్ద తేడా కనిపిస్తుందా? అంటే.. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ సమాధానమిదే.. ఐఫోన్ ఎప్పుడైనా ఫుల్ ఛార్జింగ్ అయినా అలానే ఎక్కువ సమయం ఉంచితే.. బ్యాటరీ హెల్త్ పై తీవ్ర ప్రభావం పడుతుందని అంటోంది. ఆండ్రాయిడ్ ఫోన్ మ్యానిఫ్యాక్చరర్లలో శాంసంగ్ సహా ఇతర మొబైల్ మేకర్లు కూడా ఇదే విషయాన్ని గట్టిగా నొక్కిచెబుతున్నారు. రాత్రి లేదా ఎప్పుడైనా సరే గంటల తరబడి ఛార్జింగ్ కనెక్ట్ చేసి అలానే ఫోన్ వదిలేయకూడదని అంటున్నారు.
ఫోన్ బ్యాటరీ లెవల్ ఎప్పుడూ సాధ్యమైనంతవరకు 30శాతం నుంచి 70శాతం మధ్య దగ్గరగా ఉండేలా చూసుకోవాలంటోంది హువావే. అప్పడు దీర్ఘకాలంగా బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెబుతోంది. అంటే దీనిర్థం.. మీ ఫోన్ ఎప్పుడూ కూడా ఫుల్ ఛార్జింగ్ చేయరాదు. వాస్తవానికి ఫోన్ ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు ఫుల్ కాగానే ఆటోమాటిక్ గా స్టాప్ ఛార్జింగ్ ఆగిపోతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం 99శాతం బ్యాటరీ డౌన్ కాగానే.. మళ్లీ 100 శాతానికి ఛార్జ్ కావాలంటే ఎక్కువ ఎనర్జీ అవసరం పడుతుంది. ఇలానే స్థిరంగా కొనసాగితే మాత్రం బ్యాటరీ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. అందుకే చాలా ఫోన్లు ఛార్జింగ్ రెగ్యులేషన్ ఆప్షన్లతో రావడానికి ఇదే కారణమంటున్నారు.
ఫోన్ బుల్ట్-ఇన్ ఫీచర్లనే వాడండి :
ఐఫోన్లలో ఐఓఎస్ 13 లేదా ఆపై వెర్షన్ రన్ అవుతుంటాయి. ఆప్టమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ ద్వారా మీ ఫోన్ ఫుల్ ఛార్జింగ్ అయ్యే సమయం తగ్గిపోతుంది. ఒకసారి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే.. మీ ఐఫోన్ ఛార్జింగ్ పెట్టే విధానంపై విశ్లేషణ చేస్తుంది. 80శాతం ఫాస్ట్ ఛార్జింగ్ పూర్తి అయ్యేవరకు వెయిట్ చేస్తుంది. మీ ఫోన్ ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు మీకు ఒక Optimized Battery Charging అనే పాప్ అప్ ఆప్షన్ డిస్ ప్లే వస్తుంది. దానిపై ట్యాప్ చేసి హోల్డ్ డౌన్ చేయాలి. ( Settings > Battery > Battery Health > Optimized Battery Charging) డిపాల్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇది టర్న్ ఆన్ అయింది లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ ఫోన్లలో బ్యాటరీ లైఫ్ కోసం AccuBattery అనే యాప్ ఒకటి ఉంది. ఇది ఎప్పుడూ మీ బ్యాటరీ హెల్త్ పై ఓ కన్నేసి ఉంచుతుంది. రియల్ టైమ్ ఇష్యూలను పసిగడుతుంది. ఎప్పుడు ఛార్జింగ్ పెట్టాలి? ఎప్పుడూ అన్ ప్లగ్ చేయాలో కూడా ఇది గైడ్ చేస్తుంది. మీ ఫోన్ ఎప్పుడూ కూడా జీరో శాతానికి ఛార్జింగ్ పడిపోయేంత వరకు వాడొద్దు.. ఛార్జింగ్ సైకిల్ దెబ్బతింటుందని మరిచిపోవద్దు. మీ సౌకర్యాన్ని బట్టి జీరో వరకు దిగిపోకుండా ఛార్జ్ చేస్తుండాలి.
– మీ ఫోన్ ఎప్పుడూ చల్లటి ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. వేడి, ఉష్ణోగ్రత ఉంటే.. బ్యాటరీ లైఫ్ పై తీవ్ర ప్రభావం పడుతుంది.
– సూర్యకిరణాలు ప్రభావంగా పడే చోట ఫోన్ ఉంచరాదు. లేదా పూర్తి చల్లగా ఉండే ప్రాంతాల్లోనూ ఫోన్ ఉంచరాదు.
– రాత్రిపూట మీ ఫోన్ ఛార్జింగ్ పూర్తి అయిందో లేదో చూడండి.. ఫుల్ కాగానే అన్ ప్లగ్ చేసేయండి.
0 comments:
Post a comment