Good news for the unemployed: DSC announcement in Telangana soon!
నిరుద్యోగులకు శుభవార్త : తెలంగాణలో త్వరలో DSC ప్రకటన !
దేశంలోనే మొదటిసారి వర్క్ షీట్స్ పెట్టిన ఘనత తెలంగాణ కే దక్కుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన ఆమె టి-సాట్ యాప్ 12 లక్షల మంది విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్నారని, 85శాతం డిజిటల్ స్టడీ తెలంగాణలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తుంది అని అన్నారు. తెలంగాణ డిజిటల్ పాఠాలు పిల్లలకు అందించిన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచిందన్నారు. హైదరాబాద్ నగరంలో వరదల్లో సర్టిఫికెట్స్ నష్టపోయిన పిల్లలకు మళ్ళీ కొత్తవి అందించామన్న ఆమె కరోనా ప్రభావం ఇంకా రాష్ట్రంలో కొనసాగుతుందని అన్నారు. కరోనా వల్ల విద్యార్థులు చదువుకు ఇబ్బందులు కాకుండా డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక కస్తూర్బా గురుకులాల్లో కోర్సులు పెంచి- ఇంటర్ వరకు చదువుకునే తరగతులు పెంచామని, కరోనా వల్ల ఇంటర్ క్లాసెస్ డిజిటల్ ద్వారా అందించారు- 80 శాతం సిలబస్ పూర్తి అయిందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ లకు- డిగ్రీ కాలేజీలకు నిధులు కావాల్సినన్ని ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్స నియామకం త్వరలోనే ఉంటుందని అన్నారు.
విద్యాలయాల యజ్ఞానికి ప్రభుత్వం స్వీకారం చుట్టిందన్న ఆమె ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు బడ్జెట్ లో 4వేల కోట్లు ప్రత్యేక నిధి కేటాయిస్తున్నమాని అన్నారు. తాను- కేటీఆర్- హరీష్ రావు- ఎర్రబెల్లి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు ప్రభుత్వం చేసిందని, ఈ కమిటీ ఆధ్వర్యంలో కొత్త విధివిధానాలు- ప్రణాళికలు కమిటీ తీసుకుంటుందని అన్నారు. అంతర్ జిల్లా బదిలీలు- మహిళలు ప్రత్యేక సెలవులు ప్రభుత్వం ప్రకటించిందని, ప్రైవేట్ పాఠశాలల టీచర్స్ జీతాలు పై తిరుపతి రావు కమిటీ ప్రభుత్వం వేసిందని అన్నారు. విద్యాశాఖ తరపున తిరుపతి రావు కమిటీ సిఫార్సులు అమలు చేసే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. సంక్షేమ విద్యా సంస్థల్లో 4లక్షల విద్యార్థులు చదువుతున్నారని ఆమె అనారు. త్వరలోDSC భర్తీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆమె అన్నారు. గురుకులాల్లో ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా అన్ని రంగాల్లో విద్యార్థులు దూసుకుపోతున్నారని ఆమె అన్నారు.
0 comments:
Post a comment