ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా హెల్త్ పై చర్చ జరుగుతోంది. ఉన్నట్లుండి ఆమె ఆస్పత్రిలో జాయిన్ అవడం, రెండు మేజర్ ఆపరేషన్లు జరగడంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినీపరిశ్రమలో రోజా ఆరోగ్యం అంశం చర్చనీయాంశమైంది. ఆమెకు ఏమైంది..? ఉన్నట్లుండి ఏ ఆరోగ్య సమస్య వచ్చింది? అనేదానిపై అందరూ చర్చించుకుంటున్నారు. ఏడాది క్రితమే ఆపరేషన్ జరగాల్సి ఉన్నా.. ఎన్నికలు, కరోనా కారణంగా వాయిదా పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు రెండేళ్లుగా రోజా ఏ సమస్యతో బాధపడుతున్నారా.. శస్త్ర చికిత్స జరిగేందగా ఏ సమస్య వచ్చిందని ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం నెటిజన్లు కూడా ఆమె ఆరోగ్యంపైనే సెర్చ్ చేస్తున్నారు. రోజాకు ఏ సమస్య వచ్చింది..? ప్రస్తుతం ఆమె ఎలా ఉన్నారనే సమాచారం కోసం వెతుకుతున్నారు.
చెన్నై ఆపోలో ఆస్పత్రిలో ఆమెకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. రెండు రోజుల క్రితం ఆమె చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఆదివారం ఆమెకు శస్త్ర చికిత్సలు జరిగాయి. ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచిన అనంతరం ఆమెను జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. ఐతే అభిమానుల ఆందోళనకు తెరదించుతూ ఆమె భర్త సెల్వమణి ఆడియో ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆమె భర్త సెల్వమణి తెలిపారు. ఆపరేషన్ అనంతరం ఆమెను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసినట్లు సెల్వమణి వెల్లడించారు.
రెండు వారాలు పాటు ఆమెను కలిసేందుకు ఎవరూ రావొద్దని.. రోజా బాగానే ఉన్నారని పేర్కొన్నారు. ఆస్పత్రి వద్దకు కూడా రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఆమె త్వరగానే కోలుకొని అందర్నీ కలుస్తారని వెల్లడించారు. రోజాకు ఆపరేషన్ గత ఏడాదే జరగాల్సి ఉందని.. కానీ ఎన్నికలు, కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోందని వివరించారు.
వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన రోజా ఆరోగ్యంపై అటు పార్టీ వర్గాల్లోనూ చర్చ జరగుతోంది. ఐతే ఆమె పూర్తిగా కోలుకునేవరకు పార్టీ కార్యక్రమాలకు రెండు వారాల పాటు అందుబాటులో ఉండరు. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రోజా.. వైసీపీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా నగిరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో అధికార పార్టీని గెలిపించారు. రోజా పూర్తిగా కోలుకున్నతర్వాత నియోజకవర్గంలో పర్యటిస్తారని ఆమె భర్త సెల్వమణి తెలిపారు. దీంతో ఆమె త్వరగా కోలుకొని తనదైన శైలిలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడాలని ఆమె అభిమానులు ప్రార్ధిస్తున్నారు.
0 comments:
Post a comment