Satyavathi Rathod, popularly known as Mangli, is an Indian playback singer, television anchor and actress. She is popular for her traditional Banjara attire. Her popularity on YouTube for her Telangana songs and performs at festival events in India and abroad
Tollywood Singer : తన గాత్రంతో జానపదులకు సొగసులు అద్దిన గాయని.. తెలంగాణ యాసతో ఆటపాటలతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించుకున్నారు మంగ్లీ. ఒక న్యూస్ ఛానెల్ లో కెరీర్ ని ప్రారంభించిన మంగ్లీ సారంగదారియా సాంగ్ తో సంగీత ప్రేక్షకులను మళ్ళీ ఓ రేంజ్ లో అలరిస్తున్నారు. మంగ్లీ వర్థమాన టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. అయితే ఈ స్థాయికి ఈజీగా చేరుకోలేదు.. ఒక చిన్న తండా లో పుట్టిన మంగ్లీ జర్నీ లో ఎన్నో కష్టాలు ఎత్తుపల్లాలు ఉన్నాయి. తనకు ఎదురైన ప్రతి కష్టాన్ని ఇష్టంగా ఎదుర్కొని ఈరోజు తనకంటూ ఓ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు మంగ్లీ.
మంగ్లీ అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లె తాండలోని పేద బంజారా కుటుంబంలో జన్మించారు. ఆ తండాలోనే 5వ తరగతి వరకూ చదువుకున్నారు..6 నుండి 10 తరగతి వరకు గర్ల్స్ హై స్కూల్ లో చదివారు. అనంతరం రూరల్ డవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పాటలు పాడడం నేర్చుకున్నారు. ఆ సంస్థ ఆర్ధికంగా సపోర్ట్ ఇవ్వడంతో మంగ్లీ తిరుపతిలో కర్నాటక సంగీతం నేర్చుకున్నారు. ఇక పదవ తరగతి తర్వాత ఎస్.వీ.విశ్వవిద్యాలయంలో మూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లోమా కోర్సులో చేరారు.. అదే ఆమె జీవితంలో మలుపురాయి అని చెప్పవచ్చు. సంగీతం పై పట్టు పెంచుకొని తిరుపతి లోని సంగీత విద్యాలయంలో పూర్తి మెళకువలు నేర్చుకుంది.
జానపదాల పాటలతో తన కెరియర్ మొదలు పెట్టి మంగ్లీ తెలంగాణ లో పల్లె పాటలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు. ఇంకా చెప్పాలంటే చాలామందికి మంగ్లీ తెలంగాణ అమ్మాయి అనుకునేటంతగా తెలంగాణ పల్లె పదానికి తనదైన ముద్ర వేశారు. మొదట జానపద గీతాలతో కెరియర్ మొదలు పెట్టిన మంగ్లీ.. తీన్మార్ పొగ్రాంతో టీవీ ఛానల్స్ లోకి ఎంటర్ అయి జనాలకు పరిచయయ్యారు. అయితే మంగ్లీ యాస భాష చూసి తను తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా అనుకుంటారు
ఒకసారి ఓ ప్రముఖ మీడియా సంస్థలోని జానపద కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీ ని తర్వాత ఆ ఛానెల్ లో యాంకరింగ్ ఆఫర్ ఇచ్చారు. అలా సత్యవతి మంగ్లీ గా మారారు. సత్యవతి పేరు కంటే వేరే పేరుఎంచుకో మంటే మంగ్లీ అనే తన తాతమ్మ పేరును ఎంచుకున్నారు. ఆ పేరుతోనే ‘మాటకారి మంగ్లీ’ అనే కార్యక్రమం మొదలైంది. ఆ తర్వాత చేసిన ‘తీన్మార్ ‘ తీన్మార్ న్యూస్ ‘ తో మంగ్లీ పేరు తెలంగాణా లోని గడప గడపకీ చేరారు. అప్పుడే ఎంటర్ టైన్మెంట్ యాంకర్ గా నేషనల్ టీవీ అవార్డు గెలుచుకున్నారు.
అయితే తన పేరు వచ్చింది కానీ తనకు ఇష్టమైన సంగీతానికి దూరం అవుతున్నా అనే ఫీలింగ్ తో టివి షో లనుంచి బయటకు వచ్చి ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ కు పాటలు పాడడం మొదలు పెట్టారు. ఇక తెలంగాణా ఆవిర్భావ సందర్భంగా పాడిన “రేలా……రేలా….రే.” పాట మంగ్లీని సెలబ్రటీ సింగర్ ని చేసింది. శివయ్య సాంగ్స్ తో పాటు బతుకమ్మపాటలు కూడా మంగ్లీ కి మంచి పేరు తెచ్చాయి. సినిమా పాటల రచయిత కాసర్ల శ్యాం ద్వారా సినిమా పాటలు కూడా పాడారు. అలా సినిమాలలో పాటలు పాడిన మంగ్లీ ‘గోర్ జీవన్ ‘ అనే లంబాడీ చిత్రంలో హీరోయిన్ గా నటించారు. లంబాడా ఆడ పిల్లల్ని కాపాడుకోవాలంటూ సందేశమిచ్చే చిత్రం అది. కొన్ని సీరియల్స్ లో కూడా నటించి అక్కడ కూడా నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
సారంగ దరియా
సాంగ్ చూడండి....
0 comments:
Post a comment