ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ షెడ్యూల్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదివారం విడుదల చేసింది. దేశంలోని ఆరు వేదికల్లో (అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా) ఈ టోర్నీ జరగనుంది. అయితే మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేసినా.. హైదరాబాద్‌కు మాత్రం బీసీసీఐ అవకాశం ఇవ్వలేదు.
ఏప్రిల్ 9న స్టార్ట్
14వ సీజన్ ఏప్రిల్ 9న చెన్నైలో జరిగే తొలి మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడనున్నాయి. ఇక ఫైనల్ మే 30న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
0 comments:
Post a comment