School Education Guidelines for conducting Andhra Pradesh State Teacher Eligibility Test (AP TET) under the Right of Children to Free and Compulsory Education Act (RTE), 2009 - Orders Issued.
📚✍ఇక ఏడాదికి ఒక్కసారే ఏపీ టెట్
♦మార్గదర్శకాలతో ఉత్తర్వులు.. ఈ ఏడాది జూలైలో ఏపీ టెట్
🌻అమరావతి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (ఏపీ టెట్) ఇకపై ఏడాదికి ఒక్కసారే నిర్వహిస్తారు. గతంలో ఏటా రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినా ఆచరణలోకి రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 2017లో ఒకసారి, 2018లో ఒకసారి మాత్రమే ఏపీ టెట్ నిర్వహించారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) తాజా మార్గదర్శకాల మేరకు ఇక ఏటా ఒక్కసారి మాత్రమే ఏపీ టెట్ నిర్వ హించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ టెట్ ను రెండు పేపర్లలో నిర్వహి స్తారు. 1 నుంచి 5 తరగతలకు బోధించే టీచర్ల కోసం పేపర్-1, 6-8 తరగ తులకు బోధించే టీచర్ల కోసం పేపర్-2 నిర్వహిస్తారు. ప్రతి పేపర్ లో మళ్లీ రెండు కేటగిరిలు ఉంటాయి. జనరల్ స్కూళ్లలో పనిచేసే టీచర్ల కోసం పేప ర్-1ఎ, వేపర్-2ఏ నిర్వహిస్తారు. స్పెషల్ స్కూళ్లలో పనిచేసే టీచర్ల కోసం పేపర్-1బి, పేపర్-2బి నిర్వహిస్తారు. టెట్లో అభ్యర్థులు సాధించిన మార్కు లకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. జనరల్ అభ్యర్ధథులకు 60 శాతం, బీసీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 40 శాతం క్వాలిఫైయింగ్ మార్కులుగా నిర్ణయించారు. పేపర్-1, 2 లను 150 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో వేపర్ లో 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి, కంప్యూటర్ ఆధారితంగా టెట్ నిర్వహిస్తారు. ఈ మేరకు మార్గద రకాలతో పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులిచ్చింది. తాజా సమా చారం ప్రకారం ఈ ఏడాది జూలైలో ఏపీ టెట్ నిర్వహించే అవకాశముంది.
0 comments:
Post a comment