Government Jobs: నిరుద్యోగులకు షాకింగ్ న్యూస్.. భారీగా తగ్గుతున్న ప్రభుత్వ ఉద్యోగాలు.. కారణాలివే..
ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎంతగానో నిరీక్షిస్తారు. ఒక్క నోటిఫికేషన్ పడినా దానివెంట హాట్ కేకుల మాదిరిగా పడుతారు. ఉద్యోగ ప్రకటన కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అందులోను కేంద్రప్రభుత్వ ఉద్యోగాల గురించైతే వేరే చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా పోటీ ఉండటం, మంచి జీతంతో పాటు ఇతర అలవెన్సుల కారణంగా చాలామంది వీటి కోసం తీవ్రంగా కష్టపడతారు. అయితే గత ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వేలు, బ్యాంకింగ్ పోస్టులను గణనీయంగా తగ్గించుకుంటూ వస్తోంది సర్కారు. సివిల్ సర్వీస్ పరీక్షలను గమనిస్తే గతేడాది 796 పోస్టులను విడుదల చేయగా.. ఈ సంవత్సరం 10 శాతం తగ్గించి 712 ఉద్యోగాను విడుదల చేసింది.
ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగుల కొరత ఉన్నప్పటికీ ఏటా ప్రభుత్వం ఈ పోస్టులను తగ్గించడం గమనార్హం. 2014 నుంచి గమనిస్తే యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్(UPSC) ఆ ఏడాది 1364 పోస్టులను విడుదల చేయగా.. 2020కి వచ్చేసరికి ఆ సంఖ్య 47.8 శాతం మేర తగ్గింది. 2016-17లో యూపీఎస్సీ మొత్తం 6103 మందిని నియమించగా.. 2019-20కి వచ్చే సరికి 4,399కి చేరుకుందని ప్రభుత్వం ఈ ఏడాది లోక్ సభలో ప్రకటించింది. దీని ప్రకారం దాదాపు 30 శాతం మేర తగ్గించింది.
అదనంగా CSE, UPSC కొన్ని ఇతర పరీక్షలను కూడా నిర్వహిస్తున్నాయి. వీటిలో ఇంజినీరింగ్ సర్వీసెస్, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, సెంటర్ ఆర్మ్ డ్ పోలీసు బలగాలు తదితర ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ఇందులో ఉన్నాయి. ఏదైనా సర్వీస్ కు సంబంధించిన నియామకాల్లో ఖాళీల సంఖ్యను నిర్ణయించడంలో ప్రధాన అంశం కేడర్ మేనేజ్మెంట్ అని పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో విస్తృతంగా కొరత ఉన్నప్పటికీ ఇవి ఎక్కువగా ఎంట్రీ లెవల్లోనే ఉన్నట్లు ఓ అధికారి స్పష్టం చేశారు.
ప్రభుత్వం నియమించే వ్యక్తులు కెరీర్ పురోగతి గుర్తుంచుకోవాలని, పదోన్నతులకు అవకాశం కల్పించాలని అందువల్ల దిగజారుడు ధోరణి ఉందని ఆయన అన్నారు. ఏదేమైనా, యుపీఎస్సీ ప్రభుత్వ నియామక సంస్థలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది అయినప్పటికీ, సెలక్షన్ స్టాఫ్ కమిషన్ (SSC), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB), పోస్టల్ శాఖ(Postal Jobs) వంటి ఇతర నియామక సంస్థలు కూడా ప్రతీ సంవత్సరం కేంద్ర ప్రభుత్వంలో పోస్టింగ్ కోసం 2016-17 నుంచి తక్కువ అభ్యర్థులను తీసుకున్నాయి.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఎస్ఎస్సీ పోస్టుల నియామకాలు బాగా తగ్గిపోతున్నాయి. 2016-17లో ఎస్ఎస్సీని 68,880 మంది అభ్యర్థులను కేంద్ర ప్రభుత్వం నియమించుకోగా.. ఈ సంఖ్య 2020-21కి కేవలం 2,106కి చేరింది. అంటే దాదాపు 96 శాతం పడిపోయింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 14,691గా ఉంది. 2017-18లో 45,391, 2018-19 సంవత్సరంలో 16,748 మందిని మాత్రమే నియమించుకుంది. ఎస్ఎస్సీ భారత ప్రభుత్వంలో గ్రూప్-బీ (నాన్ గెజిటెడ్), గ్రూప్-సీ(నాన్-గెజిటెడ్) పోస్టులకు నియమిస్తుంది. 1975లో ఏర్పాటు చేసిన ఈ కమిషన్ ను క్లాజు-3, క్లాజు-4 వర్గాలకు చెందిన ప్రభుత్వ సిబ్బందిని నియమించుకునే బాధ్యతను కలిగి ఉంది. ఈ విధంగా పోస్టులకు తగ్గడానికి గల కారణాన్ని వివరిస్తూ డీఓపీటీ కార్యదర్శి సత్యానంద్ మిశ్రా స్పందించారు.
ఇది పరిపాలనాపరమైన నిర్ణయమని, గతంలో ఎస్ఎస్సీ ఏర్పడినప్పుడు కేంద్రప్రభుత్వంలోని దిగువ, ఉన్నత డివిజన్ గుమాస్తాల స్థానాలకు మాత్రమే అభ్యర్థులను నియమించేదని ఆయన అన్నారు. కాలక్రమేణా తక్కువ సంఖ్యలో మాత్రమే నియామాకం చేస్తోందని, మిగిలినవి ఔట్ సోర్స్ చేస్తోందని స్పష్టం చేశారు. 2010-11లో లక్ష అభ్యర్థులను ఈ విధంగా చేర్చుకుందని తెలిపారు. అప్పటి నుంచి వీటి సంఖ్య బాగా తగ్గిందని, లీకేజీలు, కొనసాగుతున్న కోర్టు కేసుల కారణంగా పరీక్షలను తరచూ రద్దు చేయాల్సి వస్తుందని చెప్పారు. ఫలితంగా పోస్టులు గణనీయంగా పడిపోయాయని అన్నారు.
భారత రైల్వే దేశంలోనే అతిపెద్ద బోర్డు. కేంద్రప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేవలం 3,873 నియామకాలను మాత్రమే చేసింది. 2016-17లో ఈ సంఖ్య 27,427గా ఉంది. 2017-18, 2018-19లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వరుసగా 25,564, 7,365 మంది అభ్యర్థులను నియమించుకోగా.. 2019-20లో ఈ సంఖ్య 1,16,391కి చేరింది. గతేడాది వరకు తాము పెద్ద సంఖ్యలో పోస్టులను విడుదల చేశామని, ఈ ఏడాది ఆ సంఖ్య చేరుకోలేమని రైల్వే బోర్డు అధికారి ఒకరు అన్నారు. ప్రభుత్వం కూడా కొన్ని ఉద్యోగాలను ఉంచాలని చెప్పారు. రైల్వే మంత్రిత్వశాఖ ప్రతినిధి డీజే నరైన్ ప్రకారం.. వివిధ ఖాళీల భర్తీకి నిరంతరం నియామాకాలు చేస్తున్నామని, గతేడాది యావత్ ప్రపంచానికే అత్యంత అసాధారణమైన సంవత్సరమని, ఇందుకు రైల్వే మినహాయింపు కాదని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఎన్టీపీసీ, ఇతర ఖాళీల నియామాకాలు ప్రారంభించామని, దశలవారీగా పోస్టులు నింపుతామని తెలిపారు. ఈ ఏడాది ALP అభ్యర్థులకు కాల్ లెటర్లు జారీ చేశామని చెప్పారు. ఎన్టీపీసీ నియామకాలకు 1.4 కోట్లకుపైగా దరఖాస్తు చేసున్నారని, గత కొన్ని నెలల్లోనే కోటి పైగా పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బట్టి పోస్టుల నియామకం ఉంటుందని మరో అధికారి స్పందించారు. రైల్వేలో కూడా ఇప్పటికే చాలా మంది ఉద్యోగుల పదవీకాలం ముగియనుందని, ప్రభుత్వం కూడా తక్కువ నియామకాలు చేస్తుందని అన్నారు.
.
జాతీయ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల కోసం ప్రొబేషనరీ అధికారులు, గుమాస్తాలు, కార్యాలయ సహాయకులు, ఇతర పోస్టుల ఎంపిక కోసం పరీక్షలు నిర్వహించే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) పోస్టుల తగ్గింపుకు మినహాయింపేమి కాదు. గత సంవత్సరం, ఐబీపీఎస్ 2020 కోసం ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీఓ) పోస్టుల కోసం 1,167 ఖాళీల గురించి ప్రకటన విడుదల చేసింది. 2019 నుండి ఈ సంఖ్య 67 శాతం తగ్గి ఖాళీల సంఖ్య 4,336గా ఉంది. ఇటీవలి సంవత్సరాలలో ఈ క్షీణత తగ్గుతున్నప్పటికీ విడుదలైన ఖాళీలు 22,000 వద్ద ఉన్నాయి. 2012 నుండి ప్రతి సంవత్సరం తక్కువ పీఓలను నియమించుకుంటోంది ఐబీపీఎస్.
ఈ మధ్య కాలంలో ప్రతి ఏటా విడుదలయ్యే ఖాళీల సంఖ్య పరిశీలిస్తే 2013 నుంచి 2018 మధ్య వరుసగా 21680, 16721, 12434, 8832, 3562, 4252గా ఉంది. భారత్ లో స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ సంస్థ అయిన ఐబీపీఎస్ పరిధిలో ఉన్న బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా, ఇండియన్, పంజాబ్ నేషనల్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి తదితర బ్యాంకులు ఉన్నాయి.
డీఓపీటీ డేటా ప్రకారం 2018 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వంలో వివిధ స్థాయిలో 6.83 లక్షల ఖళీలు ఉన్నాయి. ఈ అంశంపై యువ హల్లా బీఓఐ జాతీయ కన్వీనర్ అనుపమ్ స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా నిరుద్యోగం తీవ్రంగా ఉన్నప్పుడు సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వానికి సులభమైన మార్గం ప్రస్తుతమున్న ఖాళీలను భర్తీ చేయడమేనని తెలిపారు. ఎస్ఎస్సీ, ఐబీపీఎస్ నియామకాల్లో తగ్గుదల ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎస్ఎస్సీ లీకేజి కుంభకోణం దగ్గరనుంచి ఎప్పటికప్పుడు పోస్టులు కనిష్ఠానికి చేరుకున్నాయని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంలో ప్రభుత్వం లేదని ఆయన దుయ్యబట్టారు. యువత దేశంలో నియామక వ్యవస్థపై విశ్వాసం కోల్పోతున్నారని, ఉద్యోగాలన్నింటినీ ప్రైవేటు, ఔట్ సోర్సింగ్ కు అప్పగించేందుకు చేసే ప్రయత్నంలా ఉందని అన్నారు.
గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల నియామక ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం గత సంవత్సరం ఎన్‌ఆర్‌ఏని ఏర్పాటు చేసింది. ఎస్‌ఎస్‌సి నిర్వహించిన పరీక్షలకు హాజరు కావాలని కోరుకునే అభ్యర్థులను పరీక్షించడానికి ఈ కొత్త సంస్థ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ వంటి జి-మాట్ నిర్వహించడానికి ఏర్పాటు చేయబడింది. ప్రభుత్వ అంచనాల ప్రకారం ప్రస్తుతం 1.5 లక్షల ఖాళీలు ఉన్న నాన్ గెజిటెడ్ గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులన్నింటికీ వన్ స్టాప్ పరీక్షను నిర్వహించడానికి ఎన్ఆర్ఏ ఉద్దేశించబడింది. ఈ కొత్త వ్యవస్థ నియామక సమయాన్ని ప్రస్తుతం 18-20 నెలల నుండి మూడు నెలలకు తగ్గించేలా చేస్తుంది.
0 Comments:
Post a Comment