The government has given clarity on the reduction of working days in central government offices. In a written reply to the Lok Sabha, Union Labor Minister Santosh Gangwar said there was no proposal to implement four working days a week or 40 working hours a week.
వారానికి 4పని దినాలపై కేంద్రం క్లారిటీ
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిదినాల తగ్గింపుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వారంలో నాలుగు రోజుల పనిదినాలు లేదా వారానికి 40 పని గంటలను అమలు చేసే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ లోక్సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పని దినాలు,సెలవులు,పనిగంటలపై కేంద్ర వేతన సంఘం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
నాలుగో వేతన సంఘం సిఫార్సు ఆధారంగా..కేంద్రప్రభుత్వ కార్యాలయాల్లో వారంలో ఐదు రోజుల పనిదినాలు, రోజు ఎనిమిదన్నర పని గంటలను అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఏడో వేతన సంఘం యథాతథ స్థితిని కొనసాగించవచ్చని సిఫార్సు చేసిందని మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు.
0 comments:
Post a comment