Ford EcoSport SE: ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఎస్ఈ కొత్త మోడల్ లాంఛ్.. కారు ధర, ఫీచర్లు ఇవే..
ఫోర్డ్ ఇండియా భారతదేశంలో ఎకోస్పోర్ట్ ఎస్‌యువి పేరుతో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఇదే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ ఈ.. ఈ కొత్త వేరియంట్ కారు ధర పెట్రోల్ ఇంజిన్ అయితే రూ. 10.49 లక్షలు, అదే డీజిల్ ఇంజిన్‌తో రూ. 10.99 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ ఈ ని ప్రస్తుతం అమెరికా, యురోపియన్ మార్కెట్లలో అమ్ముతున్నారు. వీటికి రేర్-మౌంటెడ్ స్పేర్ వీల్ రాదు. అదేకాకుండా, భారతదేశంలో ఇప్పటికే విక్రయిస్తున్న ఎకోస్పోర్ట్ లాగానే ఈ కారు కూడా మెకానికల్ బిల్ట్ ఒకేలా ఉంటుంది. అయితే డిజైన్‌లోనూ, అలాగే చూడటానికి ప్రత్యేకంగా, విలక్షణంగా ఉండాలనుకునే కస్టమర్లు పెరుగుతున్నారు. సరిగ్గా ఇదే క్వాలిటీలతో ఉంది సరికొత్తగా వెలువడిన ఎకోస్పోర్ట్ ఎస్ ఈ అంటారు ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ & సర్వీసెస్‌లో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా ఉన్న వినయ్ రైనా.
ఇతర మార్పులను గమనిస్తే.. సరికొత్త డ్యూయల్ టోన్ రేర్ బంపర్‌తో పాటు సిల్వర్-ఫినిషింగ్ ఉన్న ఫౌక్స్ స్కిడ్ ప్లేటు ఉంది. అలాగే, ఎకోస్పోర్ట్ ఎస్ ఈ కారుకి సులభంగా వాడగలిగిన పంక్చర్ కిట్ ఉంది. అలాగే టైర్ డామేజీ అయినప్పుడు కొన్ని నిమిషాల్లోనే స్వయంగా ఓనర్లు రిపేరు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అంతేకాదు, అసలు టైర్‌ని దాని స్థానం నుంచి తీయకుండానే పని చేసుకోవచ్చు.
ఈ ఎకోస్పోర్ట్ ఎస్ ఈ టైటానియమ్ ట్రిమ్‌తో వస్తుంది. అంటే, ఈ ఎస్‌యువి (SUV)లో యాపిల్ కార్‌ప్లేతో పాటు ఫోర్డ్ సింక్ 3 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అలాగే ఫోర్డ్ పాస్ యాప్ ఇంటిగ్రేషన్‌తో సహా ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ కూడా ఉంది. ఎకోస్పోర్ట్ ఎస్ ఈ ఎంపికలో వివిధ ఆఫర్లు ఉన్నాయి. 1.5 లీటర్ల మూడు సిలిండర్లు టైవిసిటి పెట్రోల్ ఇంజిన్ అన్నది ఈ సెగ్మెంట్‌లో ఉత్తమంగా 122 పిఎస్ పవర్, 149 ఎన్ ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది. అలాగే , 1.5 లీటర్ల టిడిసిఐ డీజిల్ ఇంజిన్ 100 పిఎస్ పవర్, 215 ఎన్ ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ రెండు ఇంజన్‌లూ 5-స్పీడ్ మాన్యుల్ గేర్‌బాక్స్ కలిగి ఉన్నాయి.
ఫోర్డ్ ఇటీవలే మోడల్ ఇయర్ 2021 ఇకోస్పోర్ట్ లైనప్ పరిచయం చేసింది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్‌ల వరకూ ఉంటాయి. ఈ సౌకర్యం వాటి వేరియంట్‌ను బట్టి ఉంటుంది. ఇక సగం వేరియంట్లలో ఆఫర్‌పై సన్‌రూఫ్ ఉంది. ఇదే ఎకోస్పోర్ట్ ఎస్ ఈ లోనూ ఉంది.
0 Comments:
Post a Comment