Postponement of judgment on finalization of fees of degree colleges
Arguments concluded in the High Court
✍డిగ్రీ కాలేజీల ఫీజుల ఖరారుపై తీర్పు వాయిదా
♦హైకోర్టులో ముగిసిన వాదనలు
🌻సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ ఎయి డెడ్ డిగ్రీ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో జారీ చేసి న జీవో 1ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్య నారాయణమూర్తి తీర్పును వాయిదా వేశారు. అంతకు ముందు కాలేజీల తరపున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసిందని, కాలేజీలను మూ డు రకాలుగా వర్గీకరించారని, ఈ వర్గీకరణ చట్ట నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు. ఉన్న తవిద్యా కమిషన్ తరపు న్యాయవాది సుదేశ్ ఆనంద్ వాదనలు వినిపిస్తూ, యూజీసీ నిబంధ నలకు అనుగుణంగా ఫీజులు పెంచామన్నారు. ఆయా కాలేజీలు వారి వారి నిర్వహణకు సం బంధించిన వివరాలను సమర్పించలేదని తెలి పారు. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా నిర్ణ యం తీసుకోవడం జరిగిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
డిగ్రీ కళాశాల fee how much
ReplyDeleteడిగ్రీ కళాశాల fee how much
ReplyDelete