Corona for 53 students at AU
ఎయులో 53 మంది విద్యార్థులకు కరోనా
బిటెక్, బిఫామ్ పరీక్షలు వాయిదా
🌻ప్రజాశక్తి గ్రేటర్ విశాఖ బ్యూరో
ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు 53 మంది కరోనా బారిన పడ్డారు. మూడు రోజుల క్రితం ఒక విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ విద్యార్థికి కరో నా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. విద్యార్థుల కోరిక మేరకు 800 మంది నుంచి శ్యాంపిల్స్ తీసుకోగా వారిలో 53 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంకా 300 మంది ఫలితాలు రావాల్సి ఉంది. దీంతో శనివారం నుంచి జరగాల్సిన బిఇ బిటెక్, బి- ఫార్మసీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు శుక్రవారం రాత్రి ప్రకటించారు.
♦ఒకే కుటుంబంలో 21 మందికి
🌻ప్రజాశక్తి తొండంగి(తూర్పుగోదావరి)
తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో శుక్ర వారం ఒకే కుటుంబంలో 21 మంది కరోనా బారిన పడ్డారు. తొండంగిలో నివాసముంటు న్న ఓ కుటుంబం ఇటీవల తీర్థయాత్రలకు వెళ్లి 23న తిరిగి చేరుకున్నారు. మరో నాలుగు కుటుంబాలకు చెందిన వారితో కలిసి ఇంట్లో భజన కార్యక్రమం పెట్టుకున్నారు. వీరిలో కొందరికి జ్వరం రావడంతో ఈ నెల 24న కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు మందిలో 21 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
0 comments:
Post a comment