Aadhaar connection to voter ID
ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం
▪️కేంద్ర ప్రభుత్వం ఆధార్ పై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ తో ఓటర్ ఐడీని లింక్ చేస్తున్నట్టు పార్లమెంటులో ప్రకటించింది. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వేసిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిచ్చారు. ఓటర్ ఐడీకి ఆధార్ నంబరును అనుసంధానం చేస్తామని చెప్పారు. దీంతో ఓటు హక్కు రక్షణకు వీలవుతుందని అన్నారు. ఎవరు ఓటు వేశారో, ఎవరు వేయలేదో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు.
🗳️ఓటర్ ఐడీకి ఆధార్ ను లింక్ చేయాలనే డిమాండ్లు చాలా రోజులుగా వస్తున్నాయి. ఆధార్ తో అనుసంధానిస్తే నకిలీ ఓట్లు తొలగిపోతాయని కేంద్ర ఎన్నికల సంఘం కూడా అభిప్రాయపడింది. ఓటర్ ఐడీని ఆధార్ తో అనుసంధానం చేస్తే... నకిలీ ఓట్లను సులభంగా తొలగించవచ్చు. ఒక్కొక్కరు కేవలం ఒక ఓటుకు మాత్రమే పరిమితమవుతారు. రెండు, మూడు చోట్ల ఓటరుగా నమోదు చేసుకునే అవకాశముండదు.
0 comments:
Post a comment