Shock to AP CM in Supreme Court..Clean chit to NV Ramana in Amravati land scam
సుప్రీంకోర్టులో ఏపీ సీఎంకి షాక్..అమరావతి ల్యాండ్ స్కామ్ లో ఎన్వీ రమణకు క్లీన్ చిట్
Supreme Court అమరావతి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆంధ్రప్రదేశ్ సీఎం చేసిన ఫిర్యాదును బుధవారం(మార్చి-24,2021) సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.అమరావతి భూమలు వ్యవహారంలో జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సీఎం వైఎస్ జగన్ 2020 అక్టోబర్ 6న సుప్రీం కోర్టుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. అమరావతి కుంభకోణంలో జస్టిస్ ఎన్వీ రమణతో పాటు ఆయన కుమార్తెలకు భాగముందని అందులో ఆరోపించారు.
ఏపీ సీఎం చేసిన ఫిర్యాదుపై ఇన్-హౌస్ విచారణ జరిపినట్లు సుప్రీంకోర్టు బుధవారం ప్రకటించింది. జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సీఎం జగన్ చేసిన అరోపణల్లో నిజం లేదని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసిన తర్వాత తేలిందని సుప్రీంకోర్టు తెలిపింది.ఈ ఇన్-హౌస్ ప్రొసీజర్ అత్యంత రహస్యమైనదని
ఈ వివరాలు బహిరంగంగా వెల్లడించదగినవి కాదని సుప్రీం కోర్టు పేర్కొంది. సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో సీజేఐగా ఎంపిక కావడానికి జస్టిస్ ఎన్వీ రమణకు ఉన్న ఇబ్బందులు తొలిగినట్లైంది.
మరోవైపు, ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్ ఎస్ఏ బాబ్డే పదవీ కాలం ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయబోతున్నారు. తర్వాత సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించాలని జస్టిస్ బాబ్డే మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ లేఖ రాశారు. ప్రధాన మంత్రి పరిశీలన అంతరం రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఏప్రిల్ 24న జస్టిస్ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
0 comments:
Post a comment