As part of the National Education Policy (NEP) 2020, CBSE will change the assessment framework for 6th to 10th grade students. CBSE said on the occasion that the framework would go a long way in enhancing students' intellectual ability, especially on mathematics, science and English subjects.
సీబీఎస్ఈ నిర్ణయం:6 నుంచి 10వ తరగతుల విద్యార్థుల కోసం కొత్త అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)2020లో భాగంగా సీబీఎస్ఈ 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్‌ను మార్చనుంది. ముఖ్యంగా గణితం, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులపై విద్యార్థుల మేథాశక్తికి పదును పెడుతూ, మరింత పట్టుసాధించేందుకు ఈ ఫ్రేమ్ వర్క్ ఎంతగానో సహాయ పడుతుందని సీబీఎస్ఈ ఈ సందర్భంగా పేర్కొంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అందుబాటులోకి తెచ్చిన ఈ విధానం గురించి స్పందించారు.
విద్యార్థులు సబ్జెక్టులపై గట్టి పట్టు సాధించేందుకు వీలుగా ఈ ఫ్రేమ్ వర్క్ రూపొందించినట్లుగా తెలిపారు. విడతల వారీగా మూడు-నాలుగు ఏళ్లలో ఈ కొత్త విధానాన్ని విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రశ్నా పత్రాలు, అసెస్మెంట్ విధానాలు మారనున్నాయి.
అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్ ఇలా..
*తొలి విడతకు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రైవేటు పాఠశాలలను ఎంపిక చేశారు. ఫలితంగా 2024 నాటికి దేశవ్యాప్తంగా 25,000 సీబీఎస్ఈ పాఠశాలలు ఈ కార్యక్రమంలో భాగంకానున్నాయి.
*40 మంది అసెస్మెంట్ రూపకర్తలు, 180 టెస్ట్ ఐటెం రైటర్లు, 360 మాస్టర్ ట్రైనర్ మెంటార్లకు ఈ అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్ గురించి ఇప్పటికే శిక్షణ కొనసాగుతోంది. దీని వలన మోడల్ క్వశ్చన్ బ్యాంక్, పాఠాల ఎంపిక సులువుకానుంది.
*జాతీయ విద్యా విధానం -2020 అనుసరించి రూపొందించే ఈ విధానంతో 2024 నాటికి పూర్తిస్థాయిలో విద్యార్థులకు కొత్త విధానం అందుబాటులోకి వస్తుంది. ఆల్ఫా ప్లస్, బ్రిటీష్ కౌన్సిల్ లు ఈ విధానం రూపకల్పనలో భాగస్వాములయ్యాయి.
*భారతదేశంలోని 25,000 సీబీఎస్ఈ విద్యాలయాల్లో సమూల మార్పులు రానున్నాయి. ఇప్పటికే ఈ విధానం గురించి, ఉద్దేశం గురించి విశ్లేషణాత్మక సమాచారం విద్యా దిగ్గజాలకు అందింది.
0 comments:
Post a comment